OPPO Find N2 Flip: భారీ ఆఫర్లతో రేపటి నుండి సేల్ అవనున్న ఒప్పో ఫ్లిప్ ఫోన్.!

HIGHLIGHTS

ప్రముఖ మొబైల్ బ్రాండ్ ఒప్పో సరికొత్త స్మార్ట్ ఫోన్ OPPO Find N2 Flip

OPPO Find N2 Flip రేపటి నుండి సేల్ కి అంధుబాటులోకి వస్తుంది

ఒప్పో ఈ స్మార్ట్ ఫోన్ పైన భారీ డీల్స్ ను కూడా అందించింది

OPPO Find N2 Flip: భారీ ఆఫర్లతో రేపటి నుండి సేల్ అవనున్న ఒప్పో ఫ్లిప్ ఫోన్.!

ప్రముఖ మొబైల్ బ్రాండ్ ఒప్పో సరికొత్త స్మార్ట్ ఫోన్ OPPO Find N2 Flip రేపటి నుండి సేల్ కి అంధుబాటులోకి వస్తుంది. లాంచ్ అఫర్ లో భాగంగా ఒప్పో ఈ స్మార్ట్ ఫోన్ పైన భారీ డీల్స్ ను కూడా అందించింది. ఈ స్మార్ట్ ఫోన్ ఆకర్షణీయమైన డిజైన్, గొప్ప కెమేరా సెట్టింగ్ మరియు మరిన్ని ఇతర ఫీచర్లను కలిగివుంది. ఈ స్మార్ట్ ఫోన్ గురించి మీరు తెలుసుకోవలసిన పూర్తి వివరాలు ఇక్కడ ఉన్నాయి. 

Digit.in Survey
✅ Thank you for completing the survey!

OPPO Find N2 Flip: ధర మరియు ఆఫర్లు

OPPO Find N2 Flip స్మార్ట్ ఫోన్ 8GB స్టోరేజ్ మరియు 256 స్టోరేజ్ సింగల్ అప్షన్ తో వస్తుంది మరియు ఈ ఫోన్ ధర రూ.89,999. ఈ స్మార్ట్ ఫోన్ పైన అందించిన అఫ్ట్రాల్ను క్రింద చూడవచ్చు. ఈ ఒప్పో ఫోన్ ను ICICI, HDFC, Kotak, SBI మరియు American Express బ్యాంక్ క్రెడిట్ లేదా డెబిట్ కార్డ్ తో కొనేవారికి రూ.5,000 భారీ డిస్కౌంట్ లభిస్తుంది. ఇది మాత్రమే కాదు, ఈ ఫోన్ గొప్ప ఎక్స్ చేంజ్ అఫర్ ను కూడా మీరు పొందవచ్చు. ఈ ఫోన్ oppo.com మరియు Flipkart తో పాటుగా ప్రముఖ ఆఫ్ లైన్ స్టోర్ లలో కూడా లభిస్తుంది. 

OPPO Find N2 Flip: స్పెక్స్ 

ఒప్పో ఫైండ్ ఎన్2 ఫ్లిప్ స్మార్ట్ ఫోన్ రెండు స్క్రీన్ లను కలిగి వుంటుంది. ఇందులో, 3.26 ఇంచ్ కవర్ స్క్రీన్ వుంది. ఈ ఫోన్ లి ఉన్న మైన్ స్క్రీన్ 6.8 ఇంచ్ పరిమాణంలో ఉంటుంది మరియు ఇది 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ తో వస్తుంది. ఈ డిస్ప్లే HDR 10+ సపోర్ట్ తో మీ కంటెంట్ అనుభవాన్ని మరింత పెంచగలదని కంపెని తెలిపింది. ఈ ఫోన్ మీడియాటెక్ Dimensity 9000+ ఆక్టా కోర్ ప్రోసెసర్ జతగా 8GB ర్యామ్ మరియు 256GB స్టోరేజ్ తో వస్తుంది.

ఒప్పో ఫైండ్ ఎన్2 ఫ్లిప్ డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ తో వస్తుంది. అయితే, ఈ కెమేరా సెటప్ ను HASSELBLAD తో అందించింది. ఇందులో, 50MP (Sony IMX890 Sensor) వైడ్ యాంగిల్ మరియు 8MP (Sony IMX355) అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఉన్నాయి. ఈ కెమేరాతో 30fps వద్ద 4K వీడియోలను తీసేవీలుంది. మైన్ డిస్ప్లేలో 32MP (Sony IMX709) ఫ్రంట్ కెమేరా కూడా వుంది. ఈ కెమేరాలతో అద్భుతమైన ఫోటోలు మరియు వీడియో లను చిత్రీకరించ వచ్చని ఒప్పో తెలిపింది. 

ఈ ఫోన్ అల్ట్రా లైనియర్ స్పీకర్లు, X-Axis లైనియర్ మోటార్, డ్యూయల్ మైక్రో ఫోన్, IPX4 వాటర్ రెసిస్టెంట్, డ్యూయల్ బ్యాండ్ Wi-Fi సపోర్ట్, 2X2 MIMO వంటి చాలా ఫీచర్లను కలిగివుంది. ఈ ఫోన్ 44W సూపర్ ఊక్ సపోర్ట్ కలిగిన 4,300mAh బ్యాటరీని కలిగివుంది.

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile