Oppo F33 5G మరియు F33 Pro 5G రెండు కొత్త ఫోన్లు లాంచ్: ప్రైస్ అండ్ ఫీచర్స్ తెలుసుకోండి.!

HIGHLIGHTS

ఒప్పో ఈరోజు Oppo F33 5G మరియు F33 Pro 5G రెండు కొత్త ఫోన్లు లాంచ్ చేసింది

ఈ రెండు ఫోన్లను కూడా బిగ్ బ్యాటరీ, ఫాస్ట్ ఛార్జ్ మరియు స్టైలిష్ డిజైన్ చేసింది

ఈ స్మార్ట్ ఫోన్ సిరీస్ లాంచ్ లో భాగంగా భారీ ఆఫర్స్ కూడా ఒప్పో అనౌన్స్ చేసింది

ఒప్పో ఈరోజు Oppo F33 5G మరియు F33 Pro 5G రెండు కొత్త ఫోన్లు లాంచ్ చేసింది. ఈ రెండు ఫోన్లను కూడా బిగ్ బ్యాటరీ, ఫాస్ట్ ఛార్జ్ మరియు స్టైలిష్ డిజైన్ చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ సిరీస్ లాంచ్ లో భాగంగా భారీ ఆఫర్స్ కూడా ఒప్పో అనౌన్స్ చేసింది. మరింకెందుకు ఆలస్యం ఒప్పో కొత్తగా విడుదల చేసిన ఈ కొత్త ఫోన్ల ప్రైస్, ఆఫర్స్ మరియు ఫీచర్స్ తెలుసుకుందామా.

Oppo F33 5G మరియు F33 Pro 5G: ప్రైస్

ఒప్పో ఎఫ్ 33 స్మార్ట్ ఫోన్ బేసిక్ వేరియంట్ రూ. 31,999 ప్రైస్ తో లాంచ్ అయ్యింది. ఈ ఫోన్ 6GB + 128GB వేరియంట్ ను ఈ ధరతో లాంచ్ చేసింది. అయితే, ఈ ఫోన్ 8GB + 128GB వేరియంట్ రూ. 34,999 మరియు 8GB + 256GB వేరియంట్ రూ. 37,999 ప్రైస్ ట్యాగ్ లాంచ్ అయ్యాయి. ఈ ఫోన్ ఫారెస్ట్ గ్రీన్ మరియు పర్ల్ వైట్ రెండు రంగుల్లో లభిస్తుంది.

ఇక ఒప్పో ఎఫ్ 33 ప్రైస్ విషయానికి వస్తే, ఈ ఫోన్ రెండు వేరియంట్స్ లో లాంచ్ అయ్యింది. ఇందులో 8GB + 128GB బేసిక్ వేరియంట్ రూ. 37,999 ధరతో మరియు 8GB + 256GB హైఎండ్ వేరియంట్ రూ. 37,999 ధరతో లాంచ్ అయ్యాయి. ఈ ఫోన్ మిస్టీ ఫారెస్ట్, పాషన్ రెడ్ మరియు స్టారీ బ్లూ మూడు రంగుల్లో లభిస్తుంది.

ఈ రెండు ఫోన్లు కూడా ఈరోజు నుంచి ప్రీ ఆర్డర్స్ కి అందుబాటులోకి వచ్చాయి. ఈ ఫోన్ లను అమెజాన్ మరియు ఒప్పో అఫీషియల్ సైట్ నుంచి బుక్ చేసుకోవచ్చు.

ఆఫర్స్

ఈ రెండు ఫోన్స్ పై 10% ఫ్లాట్ తక్షణ తగ్గింపు మరియు 10% వరకు అదనపు ఎక్స్ చేంజ్ బోనస్ ఆఫర్స్ అందించింది. ఈ రెండు ఆఫర్స్ లో ఏదైనా ఒకటి మాత్రమే ఒకసారి లభిస్తుంది. ఇది కాకుండా 180 డేస్ స్క్రీన్ డామేజ్ రీప్లేస్మెంట్, నో కాస్ట్ EMI మరియు రూ. 2,999 రూపాయల విలువైన ఒప్పో ఎన్కో బడ్స్ 3 ప్రో ప్లస్ బడ్స్ ను రూ. 1,499 రూపాయల ధరలో లభిస్తుంది.

Also Read: Vivo T5 Pro 5G: ప్రీమియం ఫీచర్స్ తో మిడ్ రేంజ్ లో లాంచ్ అయ్యింది.!

Oppo F33 5G మరియు F33 Pro 5G: ఫీచర్స్

ఈ రెండు ఫోన్లు కూడా 360 డిగ్రీ ఆర్మర్ బాడీ కలిగి ఉంటాయి. అయితే, ఎఫ్ 33 స్టాండర్డ్ డిజైన్ తో ఉంటే ఎఫ్ 33 ప్రో మాత్రం ప్రీమియం ఫినిష్ తో వస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్లు 6.57 AMOLED స్క్రీన్ కలిగి ఉంటాయి. ఈ రెండు స్క్రీన్ లు కూడా 120Hz రిఫ్రెష్ రేట్ మరియు మంచి బ్రైట్నెస్ కూడా కలిగి ఉంటాయి. వీటిలో ఎఫ్ 33 ఫోన్ Dimensity 6360 చిప్ సెట్ టోల్ లాంచ్ అయితే, ప్రో వేరియంట్ మాత్రం కొంచెం బెటర్ మీడియాటెక్ ప్రోసెసర్ తో లాంచ్ అయ్యింది.

ఈ రెండు ఫోన్లు కూడా 50MP + 2MP డ్యూయల్ రియర్ కెమెరా మరియు 50MP సెల్ఫీ కెమెరా కలిగి ఉంటాయి. ఈ రెండు ఫోన్లు 4K వీడియో రికార్డింగ్ మరియు లేటెస్ట్ అండ్ పవర్ ఫుల్ AI కెమెరా ఫీచర్స్ కూడా కలిగి ఉంటాయి. ఈ రెండు ఫోన్లు 7000 mAh బిగ్ బ్యాటరీ మరియు 80W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ కలిగి ఉంటుంది. ఈ రెండు ఫోన్లు IP66, IP68 మరియు IP69K ప్రీమియం డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెంట్ సపోర్ట్ కూడా కలిగి ఉంటాయి.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :