Oppo F17, Oppo F17 Pro ఫోన్లను కూడా సెప్టెంబర్ 2 న సాయంత్రం 7 గంటలకి భారతదేశంలో ఆన్ లైన్ లాంచ్ ఈవెంట్ ద్వారా విడుదల చేయనున్నట్లు ప్రకటించింది.
F 17 Series 2020 యొక్క సొగసైన ఫోన్ అని ఒప్పో పేర్కొంది మరియు ఈ ఫోన్లు ఎలా ఉంటాయో అని వివరించడంతో పాటు ఈ రెండు ఫోన్ల యొక్క అనేక కీలక ఫీచర్స్ ను కూడా ధృవీకరించింది.
Oppo F17, Oppo F17 Pro లాంచ్ కోసం ఆన్ లైన్ మ్యూజిక్ లాంచ్ ఈవెంట్‌ను షెడ్యూల్ చేసింది.
Oppo F17, Oppo F17 Pro ఫోన్లను కూడా సెప్టెంబర్ 2 న సాయంత్రం 7 గంటలకి భారతదేశంలో ఆన్ లైన్ లాంచ్ ఈవెంట్ ద్వారా విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. అంతేకాదు, ఇప్పటికే ఈ లాంచ్ ఈవెంట్ కోసం మీడియా ఆహ్వానాలు కూడా పంపబడుతున్నాయి మరియు ప్రత్యామ్నాయంగా, ఒప్పో యొక్క అధికారిక ట్విట్టర్ పేజీ ద్వారా కూడా లాంచ్ తేదీని ధృవీకరించింది.
Survey
✅ Thank you for completing the survey!
F 17 Series 2020 యొక్క సొగసైన ఫోన్ అని ఒప్పో పేర్కొంది మరియు ఈ ఫోన్లు ఎలా ఉంటాయో అని వివరించడంతో పాటు ఈ రెండు ఫోన్ల యొక్క అనేక కీలక ఫీచర్స్ ను కూడా ధృవీకరించింది. ఒప్పో ఆన్ లైన్ మ్యూజిక్ లాంచ్ ఈవెంట్‌ను షెడ్యూల్ చేసింది. అలాగే, ఒప్పో ఇటీవలే త్వరలో రానున్న F 17 మరియు F 17 Pro స్మార్ట్ ఫోన్స్ ధర 25 వేల రూపాయల లోపు ఉంటుందని తెలిపింది.
F17 మరియు F17 ప్రో యొక్క ప్రత్యేకతలను క్లుప్తంగా చూద్దాం.
Oppo F17 Pro: ఫీచర్లు
Oppo F17 Pro సన్నని మరియు తేలికపాటి డిజైన్ తో కేవలం 7.48 మందం మరియు 164 గ్రాముల బరువును కలిగి ఉంటుంది. ఈ ఫోన్ ఒక 6.4-అంగుళాల FHD + (2400 x 1080 పిక్సెల్స్) రిజల్యూషన్ AMOLED స్క్రీన్ ను రెండు సెల్ఫీ కెమెరాల కోసం డ్యూయల్ పంచ్-హోల్ కటౌట్ డిజైన్ కలిగి ఉంటుందని భావిస్తున్నారు. ఈ ఫోన్ మాట్టే బ్లాక్, మ్యాజిక్ బ్లూ మరియు మెటాలిక్ వైట్ కలర్ ఆప్షన్లలో అందించబడుతుంది.
ఎఫ్ 17 ప్రో మీడియాటెక్ హెలియో పి 95 చిప్ సెట్ శక్తితో వస్తుంది, ఇది 8 జిబి ర్యామ్ మరియు 128 జిబి స్టోరేజ్ తో జతచేయబడుతుంది. ఇది ఆండ్రాయిడ్ 10 ఆధారిత కలర్ OS 7.2 తో పనిచేస్తుంది. ఒప్పో ఎఫ్ 17 ప్రో వెనుక భాగంలో క్వాడ్-కెమెరా సెటప్ తో వస్తుంది మరియు ఇటీవలి వచ్చిన లీక్స్ ప్రకారం, ఇది 48 MP ప్రాధమిక కెమెరా, 8 MP అల్ట్రా-వైడ్-యాంగిల్ కెమెరా, 2 MP మాక్రో కెమెరా మరియు 2 MP డెప్త్ సెన్సార్ ఈ సెటప్ లో ఉంటుందని భావిస్తున్నారు. ముందు వైపు, 16MP ప్రాధమిక సెల్ఫీ కెమెరా మరియు 2MP డెప్త్ సెన్సార్ ఉన్నాయి. వెనుక కెమెరాలు 30FPS వద్ద 4K UHD వరకు రికార్డ్ చేయగలవు.
VOOC 4.0 యొక్క 30W ఛార్జింగ్ మద్దతు కలిగిన 4,000mAh బ్యాటరీతో రావచ్చు.
Oppo F17: ఫీచర్స్
Oppo F17 ఒక 6.44-అంగుళాల FHD + డిస్ప్లేని కలిగి ఉంటుంది, ఇది సెల్ఫీ కెమెరా కోసం వాటర్‌డ్రాప్ నాచ్ కటౌట్‌తో AMOLED ప్యానెల్ ను ఉపయోగిస్తుంది. ఇది క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 662 ప్రాసెసర్ తో పనిచేస్తుందని మరియు 6 జిబి ర్యామ్ మరియు 128 జిబి స్టోరేజ్‌తో జతచేయబడుతుందని భావిస్తున్నారు. వెనుక వైపు రెగ్యులర్ క్వాడ్-కెమెరా సెటప్ తో వస్తుంది, ఇందులో ప్రాధమిక 16 MP కెమెరా, 8 MP అల్ట్రా-వైడ్-యాంగిల్ కెమెరా, 2 MP మాక్రో కెమెరా మరియు 2 MP డెప్త్ సెన్సార్ ఉంటాయి. ముందు వైపు, 16MP సెల్ఫీ కెమెరా ఉంది.
ఈ F17 ఒక 4,000 బ్యాటరీతో 30W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఇస్తుంది. ఒప్పో ఎఫ్ 17 డైనమిక్ ఆరెంజ్, నేవీ బ్లూ మరియు క్లాసిక్ సిల్వర్ రంగులలో రావచ్చు.