భారత్-చైనా సరిహద్దు వివాదం తరువాత OPPO తన లైవ్ ఈవెంట్ క్యాన్సిల్ చేసింది

భారత్-చైనా సరిహద్దు వివాదం తరువాత OPPO తన లైవ్ ఈవెంట్ క్యాన్సిల్ చేసింది
HIGHLIGHTS

ఈ ఆన్లైన్ లాంచ్ ఈవెంట్ బుధవారం సాయంత్రం 4 గంటలకు ప్రత్యక్ష ప్రసారం కావాల్సిన యూట్యూబ్ లింక్ మాత్రం అందుబాటులో లేదు.

బుధవారం లైవ్ ఈవెంట్‌లో తన కొత్త Find X 2 స్మార్ట్‌ ఫోన్ సిరీస్‌ను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది.

చైనా స్మార్ట్ ‌ఫోన్ తయారీ సంస్థ OPPO బుధవారం భారతదేశంలో జరగనున్న ఆన్లైన్ లాంచ్ ఈవెంట్ రద్దు చేసింది. ఎందుకంటే, చైనా-భారత్ మధ్య చెలరేగిన సరిహద్దు వివాదం తరువాత, భారతీయ స్థానిక వాణిజ్య సంఘాలు చైనా ఉత్పత్తులను తొలగించాలని నిర్ణయించాయి.

భారత-చైనా సరిహద్దు (LAC) వద్ద ఇటీవల జరిగిన ఉద్రికత్తల కారణంగా ఇప్పటికే 20 మంది భారత సైనికులు అమరవీరులయ్యారు. ఈ సంఘటనలో మనం తెలుగు తేజాన్ని కూడా కోల్పోయాము. 1967 తరువాత చైనా మరియు భారత్ మధ్య జరిగిన అతిపెద్ద ఘటనగా దీన్ని గురించి చెప్పవచ్చు.

ముందునుండే,  కరోనోవైరస్ సంక్షోభం సమయంలో కూడా చైనా వ్యతిరేక భావాలను ఎదుర్కొన్నందున  చైనా పెట్టుబడిదారులు భారత మార్కెట్‌ను ట్రాక్ చేయడానికి ఇది ముప్పుగా ఉంటుంది.

భారతదేశంలో, ఫోన్-అసెంబ్లీ ప్లాంట్‌ను కలిగి ఉన్న ఒప్పో, బుధవారం లైవ్ ఈవెంట్‌లో తన కొత్త Find X 2 స్మార్ట్‌ ఫోన్ సిరీస్‌ను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది.  అయితే, ఈ కార్యక్రమం బుధవారం సాయంత్రం 4 గంటలకు ప్రత్యక్ష ప్రసారం కావాల్సిన యూట్యూబ్ లింక్ మాత్రం అందుబాటులో లేదు.

ఈ ఫోన్ లాంచ్ సమయం కంటే 20 నిమిషాల ముందే అప్‌లోడ్ చేయబడింది. అంటే, ఇది ముందే రికార్డ్ చేయబడిన వీడియో మరియు భారతదేశంలో కరోనావైరస్ ఆపడానికి భారతీయ సంస్థలకు ఒప్పో యొక్క మద్దతును చూపించింది.

లైవ్ లాంచ్‌ను ఎందుకు క్యానిల్ చేసింది అనే విషయం పైన OPPO వ్యాఖ్యానించలేదు కాని సోషల్ మీడియాలో దీనిగురించి ఎటువంటి గందరగోళం రాకుండా నివారించడానికి ఇది జరిగిందని, సన్నిహితులు చెప్పారు.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo