OnePlus వన్ 2 లాంచ్ డేట్

OnePlus వన్ 2 లాంచ్ డేట్
HIGHLIGHTS

OnePlus కంపెని తరువాతి మోడల్ OnePlus 2 పై కంపెని ట్విట్ చేసింది. ఇది మొబైల్ ప్రపంచంలో ఒక చేంజ్ ను తీసుకు రానుంది అట.

OnePlus ఒక ట్వీట్ చేసి తన రెండవ మోడల్ లాంచ్ జూన్ 1 వ తారీఖున జరగనున్నట్టు హింట్ ఇచ్చింది. ట్విట్ సారంశం ఏంటంటే OnePlus 2 మోడల్ టెక్ ఇండస్ట్రీ ను షేక్ చేయనుంది అట. మరియు స్మార్ట్ ఫోన్ గేమ్ changer గా ఉండనున్నట్టు చెబుతుంది OnePlus కంపెని.

OnePlus వన్ ఊహించని దాని కన్నా అధిక సంఖ్యలో అభిమానులను సొంతం చేసుకోవడంతో, దాని తరువాతి మోడల్ పై అనేక రూమర్స్ వినిపిస్తున్నాయి. ఫింగర్ ప్రింట్ సెన్సార్ తో రానుంది అనేది ప్రధానంగా వినపడుతుంది. ఇది ఒప్పో ఫైండ్ 7 స్మార్ట్ ఫోన్ కి ఉన్న స్పెసిఫికేషన్స్ రానుంది అనేది మరొక వార్త. అయితే వీటి అన్నిటికీ జూన్ 1వ తారీఖున ముగింపు రానుంది. 

OnePlus వన్ రూమర్డ్ స్పెసిఫికేషన్స్ – 5.5 ఇంచ్ 2k క్వాడ్ HD డిస్ప్లే. స్నాప్ డ్రాగన్ 810 ప్రాసెసర్, 3 జిబి లేక 4జిబి ర్యామ్. 16MP రేర్ కెమేరా మరియు 5MP ఫ్రంట్ కెమేరా, 3300 mah బ్యాటరీ, NFC .

OnePlus 2 గురించి కంపెని చేసిన ట్విట్ – 

 

ఆధారం: ట్విట్టర్

Silky Malhotra

Silky Malhotra

Silky Malhotra loves learning about new technology, gadgets, and more. When she isn’t writing, she is usually found reading, watching Netflix, gardening, travelling, or trying out new cuisines. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo