Oneplus Pad Go 2: బిగ్ స్క్రీన్, బిగ్ సౌండ్ మరియు బిగ్ స్టోరేజ్ తో లాంచ్ అవుతుంది.!

HIGHLIGHTS

వన్ ప్లస్ 15R స్మార్ట్ ఫోన్ మరియు వన్ ప్లస్ ప్యాడ్ గో 2 రెండు డివైజెస్ లాంచ్ చేస్తోంది

వన్ ప్లస్ ప్యాడ్ గో 2 డివైజ్ ను బిగ్ స్క్రీన్, బిగ్ సౌండ్ మరియు బిగ్ స్టోరేజ్ తో లాంచ్ చేస్తోంది

అప్ కమింగ్ ప్యాడ్ కీలక స్పెక్స్ అండ్ ఫీచర్స్ కూడా కంపెనీ రివీల్ చేసింది

Oneplus Pad Go 2: బిగ్ స్క్రీన్, బిగ్ సౌండ్ మరియు బిగ్ స్టోరేజ్ తో లాంచ్ అవుతుంది.!

Oneplus Pad Go 2 : రీసెంట్ గా వన్ ప్లస్ 15 స్మార్ట్ ఫోన్ లాంచ్ చేసిన వన్ ప్లస్ ఇప్పుడు వన్ ప్లస్ 15R స్మార్ట్ ఫోన్ మరియు వన్ ప్లస్ ప్యాడ్ గో 2 రెండు డివైజెస్ లాంచ్ చేస్తోంది. వీటిలో వన్ ప్లస్ ప్యాడ్ గో 2 డివైజ్ ను బిగ్ స్క్రీన్, బిగ్ సౌండ్ మరియు బిగ్ స్టోరేజ్ తో లాంచ్ చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ ప్యాడ్ లాంచ్ కోసం కంపెనీ అధికారిక వెబ్సైట్ నుంచి అందించిన టీజర్ పేజీ నుంచి ఈ ఫోన్ కీలక ఫీచర్స్ అందించింది.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Oneplus Pad Go 2: లాంచ్ డేట్

వన్ ప్లస్ ప్యాడ్ గో మరియు వన్ ప్లస్ 15R స్మార్ట్ ఫోన్ రెండు కూడా డిసెంబర్ 17వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు బెంగళూరులో జరిగే ప్రత్యేకమైన లాంచ్ ఈవెంట్ నుంచి లాంచ్ అవుతాయి. ఈ అప్ కమింగ్ ప్యాడ్ మరియు స్మార్ట్ ఫోన్ కీలక స్పెక్స్ అండ్ ఫీచర్స్ కూడా కంపెనీ రివీల్ చేసింది.

Oneplus Pad Go 2: ఫీచర్స్

వన్ ప్లస్ ప్యాడ్ గో 2 అల్ట్రా స్లిమ్ డిజైన్ తో వస్తుంది. ఇందులో IMAX సైజు విజువల్స్ అందిస్తుందని వన్ ప్లస్ తెలిపింది. ఇందులో రేడియంట్ మరియు రేజర్ షార్ప్ విజువల్స్ చూడవచ్చని కూడా వన్ ప్లస్ చెబుతోంది. ఈ ప్యాడ్ 2.8K రిజల్యూషన్ కలిగిన బిగ్ స్క్రీన్ కలిగి ఉంటుంది. ఈ వన్ ప్లస్ అప్ కమింగ్ ప్యాడ్ మంచి స్పీడ్ కలిగిన స్టైలో పెన్ సపోర్ట్ తో కూడా వస్తుంది.

Oneplus Pad Go 2

సౌండ్ పరంగా, ఈ అప్ కమింగ్ ప్యాడ్ క్వాడ్ స్పీకర్ సెటప్ తో వస్తుంది. ఇది విజువల్స్ కి తగిన గొప్ప సౌండ్ ఆఫర్ చేస్తుంది. వన్ ప్లస్ ప్యాడ్ గో 2 5జి చిప్ సెట్ తో లాంచ్ అవుతుంది. అంతేకాదు, ఈ వన్ ప్లస్ ప్యాడ్ 8జీబీ ర్యామ్ మరియు 256 జీబీ బిగ్ ఇంటర్నల్ స్టోరేజ్ తో వస్తుంది. ఈ ఫోన్ లో సింగిల్ రియర్ కెమెరా మరియు ముందు వీడియో కాలింగ్ కోసం సెల్ఫీ కలిగి ఉంటుంది.

Also Read: ఇక మొబైల్ ఫోన్స్ లో ఆ గవర్నమెంట్ Cyber Security App తప్పనిసరి.!

వన్ ప్లస్ ప్యాడ్ గో 2 లాంచ్ కోసం వన్ ప్లస్ అందించిన టీజర్ పేజీ నుంచి కీలకమైన ఫీచర్స్ వరుసగా విడుదల చేస్తోంది. ఈ ప్యాడ్ మరిన్ని అప్డేట్స్ కూడా త్వరలో అందిస్తుంది. ఈ ప్యాడ్ కొత్త అప్డేట్ తో మళ్ళీ కలుద్దాం.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile