OnePlus Nord CE5 launched with powerful features around 20k budget
OnePlus Nord CE5 : వన్ ప్లస్ ఈరోజు లాంచ్ చేసిన రెండు ఫోన్లలో వన్ ప్లస్ నార్డ్ CE5 స్మార్ట్ ఫోన్ బడ్జెట్ ధరలో భారీ ఫీచర్స్ తో విడుదలైన ఫోన్ గా నిలుస్తుంది. ఈ ఫోన్ కేవలం 20 వేల రూపాయల బడ్జెట్ ధరలో 1.4 మిలియన్ AnTuTu స్కోర్ కలిగిన మీడియాటెక్ చిప్ సెట్ మరియు HDR 10+ సపోర్ట్ కలిగిన గొప్ప డిస్ప్లే వంటి మరిన్ని ఫీచర్స్ తో లాంచ్ అయ్యింది.
వన్ ప్లస్ నార్డ్ సీఈ 5 స్మార్ట్ ఫోన్ మూడు ఎంపికల్లో విడుదలయ్యింది. వీటిలో ఈ ఫోన్ 8 జీబీ + 128జీబీ బేసిక్ వేరియంట్ రూ. 24,999 ధరతో, 8 జీబీ 256 జీబీ మిడ్ వేరియంట్ రూ. 26,999 ధరతో మరియు హై ఎండ్ 12 జీబీ + 256 జీబీ వేరియంట్ రూ . 28,999 రూపాయల ధరతో లాంచ్ అయ్యాయి.
ఈ ఫోన్ అమెజాన్ ప్రైమ్ డై సేల్ నుంచి సేల్ కి అందుబాటులోకి వస్తుంది. అంటే, ఈ ఫోన్ జూలై 12వ తేదీ నుంచి సేల్ అవుతుంది. ఈ ఫోన్ వన్ ప్లస్ అఫీషియల్ సైట్ మరియు అమెజాన్ నుంచి లభిస్తుంది.
ఈ ఫోన్ పై గొప్ప బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్స్ మరియు డీల్స్ అందించింది. ఈ ఫోన్ పై రూ. 2,000 భారీ బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ అందించింది. ఈ ఫోన్ ను ICICI, మరియు RBL బ్యాంక్ కార్డ్స్ తో కొనుగోలు చేసే వారికి ఈ డిస్కౌంట్ లభిస్తుంది.
వన్ ప్లస్ నార్డ్ సీఈ 5 స్మార్ట్ ఫోన్ ను కూడా స్లీక్ అండ్ సింపుల్ డిజైన్ తో లాంచ్ చేసింది. ఈ ఫోన్ లో 6.77 ఇంచ్ OLED స్క్రీన్ ని ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ తో కలిగి ఉంటుంది. ఈ స్క్రీన్ 1430 నిట్స్ పీక్ బ్రైట్నెస్, 120Hz రిఫ్రెష్ రేట్, HDR 10+ సపోర్ట్, నెట్ ఫ్లిక్స్ HDR మరియు ప్రైమ్ వీడియో HDR సపోర్ట్ వంటి ఫీచర్స్ కలిగి ఉంటుంది.
ఈ వన్ ప్లస్ బడ్జెట్ స్మార్ట్ ఫోన్ మీడియాటెక్ Dimensity 8350 Apex చిప్ సెట్ తో లాంచ్ అయింది. ఇది 1.4 మిలియన్ AnTuTu స్కోర్ కలిగిన మీడియాటెక్ చిప్ సెట్. ఈ చిప్ సెట్ కి జతగా గరిష్టంగా 12 జీబీ LPDDR5X ర్యామ్ మరియు 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ని అందించింది. ఈ ఫోన్ ఆక్సిజన్ OS 15.0 ఆధారితంగా ఆండ్రాయిడ్ 15 OS తో పని చేస్తుంది. ఈ ఫోన్ వన్ ప్లస్ AI ఫీచర్ తో గొప్ప ఎఐ పనులు కూడా నిర్వహించేలా అందించింది.
Also Read: OnePlus Nord 5 : జబర్దస్త్ ఫీచర్స్ తో మిడ్ రేంజ్ బడ్జెట్ లో లాంచ్ అయ్యింది.!
ఈ ఫోన్ లో 50MP Sony LYT – 600 మెయిన్ కెమెరా మరియు 8MP అల్ట్రా వైడ్ కెమెరా కలిగిన డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ కలిగి ఉంటుంది. ఇందులో 16ఎంపీ సోనీ సెల్ఫీ కెమెరా కూడా ఉంటుంది. ఈ ఫోన్ 40fps వద్ద 4K రికార్డింగ్ సపోర్ట్, AI కెమెరా ఫీచర్లు మరియు టన్నుల కొద్ది ఇతర కెమెరా ఫీచర్స్ కూడా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ లో 80W సూపర్ ఊక్ ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ కలిగిన భారీ 7100 mAh బిగ్ బ్యాటరీ అందించింది.