Oneplus Nord డ్యూయల్ సెల్ఫీ కెమేరాతో సరసమైన ధరలో, జూలై 10న విడుదలకావచ్చు

Oneplus Nord డ్యూయల్ సెల్ఫీ కెమేరాతో సరసమైన ధరలో, జూలై 10న విడుదలకావచ్చు
HIGHLIGHTS

" NORD " అని పిలవబడే ఈ సరసమైన వన్‌ప్లస్ ఫోన్‌ తో అన్ని మార్పులు చేయనున్నట్లు కనిపిస్తోంది.

ఇదే నిజమైతే, ముందు డ్యూయల్ సెల్ఫీ కెమేరా స్మార్ట్ ఫోనుగా, వన్‌ప్లస్‌కు మొదటి అవుతుంది.

ప్రీమియం స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ Oneplus,ఇప్పుడు NORD పేరుతొ సరసమైన డ్యూయల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాలు గల స్మార్ట్ ఫోన్ను  ప్రకటించనున్నట్లు  పుకార్లు వస్తున్నాయి. ఇదే నిజమైతే, ముందు డ్యూయల్  సెల్ఫీ కెమేరా స్మార్ట్ ఫోనుగా, వన్‌ప్లస్‌కు మొదటి అవుతుంది. ఇతర స్మార్ట్‌ఫోన్ తయారీదారులు సింగిల్ మరియు డ్యూయల్ సెల్ఫీ కెమెరాలతో ఇప్పటికే, మార్కెట్లో శరవేగంగా తమ స్మార్ట్ ఫోనలను విడుదల చేస్తుండగా, వన్‌ప్లస్ ఎప్పుడూ ముందు రెండు కెమెరాలను ఉపయోగించకుండా దూరంగా ఉంది, కాని" NORD " అని పిలవబడే ఈ సరసమైన వన్‌ప్లస్ ఫోన్‌ తో అన్ని మార్పులు చేయనున్నట్లు కనిపిస్తోంది.

ఆండ్రాయిడ్ సెంట్రల్ ప్రత్యేక నివేదిక ప్రకారం, రాబోయే వన్‌ప్లస్ నార్డ్ 32 ఎంపి + 8 ఎంపి అమరికతో డ్యూయల్ సెల్ఫీ కెమెరాలను కలిగి ఉంది. 8MP కెమెరా అల్ట్రా-వైడ్ కెమెరాను ఉపయోగిస్తుంది మరియు డ్యూయల్ కెమెరా, డిస్ప్లేలో ఎగువ-ఎడమ మూలలో ఉంది. వన్‌ప్లస్ ఫోన్‌లోని కటౌట్ హువావే యొక్క P40 సిరీస్‌లో ఉన్నంత పెద్దగా లేదు అని కూడా ఈ నివేదిక పేర్కొంది.

డ్యూయల్ సెల్ఫీ కెమెరాలు మాటయెత్తకుండా, వన్‌ప్లస్ 7 మరియు 7 టి సిరీస్‌లలో మనం చూసినట్లుగా, దాని తాజా వన్‌ప్లస్ 8 సిరీస్ ఫోన్‌లలో అదే సెల్ఫీ కెమెరాను ఉపయోగించిన సంస్థ ఇప్పుడు మార్పలు చేయడానికి  బయలుదేరింది. వన్‌ప్లస్ తన బడ్జెట్ సిరీస్ లో ఈ కొత్త మార్పును ఎలా ఉంచుతుంది మరియు భవిష్యత్తులో కూడా ఇది ప్రధాన ఫోన్‌లకు తీసుకువెళుతుందా లేదా అనేది ఆసక్తికరంగా ఉంటుంది. రాబోయే వన్‌ప్లస్ ఫోన్ గతంలో ఇంటర్నెట్‌లో వన్‌ప్లస్ జెడ్ మరియు వన్‌ప్లస్ 8 లైట్‌గా లీక్ అయ్యింది మరియు సంస్థ దాని గురించి కొత్త ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొత్త సూచనలు వదులుతోంది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo