OnePlus Nord 5: భారీ ఆఫర్స్ తో మొదలైన వన్ ప్లస్ కొత్త ఫోన్ సేల్.!

HIGHLIGHTS

వన్ ప్లస్ నార్డ్ 5 స్మార్ట్ ఫోన్ నిన్ననే మార్కెట్లో లాంచ్ అయ్యింది

OnePlus Nord 5 ఈరోజు నుంచి సేల్ కి అందుబాటులోకి కూడా వచ్చింది

స్కౌంట్ ఆఫర్ తో ఈ ఫోన్ రూ . 29,749 రూపాయల ప్రారంభ ప్రైస్ ట్యాగ్ తో లభిస్తుంది

OnePlus Nord 5: భారీ ఆఫర్స్ తో మొదలైన వన్ ప్లస్ కొత్త ఫోన్ సేల్.!

OnePlus Nord 5 : వన్ ప్లస్ నార్డ్ 5 స్మార్ట్ ఫోన్ నిన్ననే మార్కెట్లో లాంచ్ అయ్యింది. అయితే, ఈ స్మార్ట్ ఫోన్ ఈరోజు నుంచి సేల్ కి అందుబాటులోకి కూడా వచ్చింది. జస్ట్ సేల్ కి రావడం కాదు ఈ ఫోన్ భారీ ఆఫర్స్ తో ఈరోజు నుంచి సేల్ కి అందుబాటులోకి కూడా వచ్చింది. వన్ ప్లస్ లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ వన్ నార్డ్ 5 స్లే ఆఫర్లు మరియు ఫోన్ ఫీచర్లు తెలుసుకోండి.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

OnePlus Nord 5: సేల్ ఆఫర్స్

వన్ ప్లస్ ఈ ఫోన్ ను మూడు వేరియంట్స్ లో లాంచ్ చేసింది. ఈ మూడు వేరియంట్ ప్రైస్ ఈ క్రింద చూడవచ్చు.

వన్ ప్లస్ నార్డ్ 5 (8 జీబీ + 256 జీబీ) వేరియంట్ ప్రైస్ : రూ. 31,999

వన్ ప్లస్ నార్డ్ 5 (12 జీబీ + 256 జీబీ) వేరియంట్ ప్రైస్ : రూ. 34,999

వన్ ప్లస్ నార్డ్ 5 (12 జీబీ + 512 జీబీ) వేరియంట్ ప్రైస్ : రూ. 37,999

ఈ ఫోన్ రోజు నుంచి అమెజాన్ మరియు వన్ ప్లస్ అఫీషియల్ సేల్ నుంచి సేల్ అవుతోంది.

ఆఫర్లు:

ఈ ఫోన్ పై రూ. 2,250 రూపాయల అదనపు బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ ని వన్ ప్లస్ ప్రకటించింది. ఈ ఫోన్ ను ICICI మరియు RBL క్రెడిట్ కార్డ్ EMI అప్షన్ తో తీసుకునే వారికి ఈ అదనపు డిస్కౌంట్ లభిస్తుంది. ఈ బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ తో ఈ ఫోన్ రూ . 29,749 రూపాయల ప్రారంభ ప్రైస్ ట్యాగ్ తో లభిస్తుంది.

OnePlus Nord 5: స్పెక్స్ అండ్ ఫీచర్స్

ఈ వన్ ప్లస్ లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ క్వాల్కమ్ Snapdragon 8s Gen 3 ఆక్టాకోర్ చిప్ సెట్ జతగా 12 జీబీ LPDDR5X ర్యామ్ సపోర్ట్ తో లాంచ్ వచ్చింది మరియు ఈ ఫోన్ లో 512 జీబీ హెవీ ఇంటర్నల్ స్టోరేజ్ కూడా కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్ ఫోన్ గేమింగ్ కోసం గొప్పగా ఉంటుంది మరియు దీనికి అవసరమైన 144hz రిఫ్రెష్ రేట్ కలిగిన 6.83 ఇంచ్ AMOLED స్క్రీన్ కూడా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ స్క్రీన్ కంటెంట్ కోసం కూడా గొప్పగా ఉంటుంది. ఎందుకంటే, ఈ ఫోన్ స్క్రీన్ 1.5K రిజల్యూషన్ 1400 నిట్స్ పీక్ బ్రైట్నెస్ మరియు HDR 10+ సపోర్ట్ కలిగి ఉంటుంది.

OnePlus Nord 5 Sale Offers

ఈ ఫోన్ కెమెరా పరంగా కూడా గొప్ప ఫీచర్స్ మరియు స్పెక్స్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ లో వెనుక 50MP Sony IMX906 మెయిన్ సెన్సార్ మరియు 8MP అల్ట్రా డ్యూయల్ రియర్ మరియు ముందు 50 JN5 సెల్ఫీ కెమెరా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ 60FPS తో స్టేబుల్ 4K వీడియో లను రికార్డ్ చేసే సత్తా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ లో అనేకమైన లేటెస్ట్ AI కెమెరా ఫీచర్లు మరియు వన్ ప్లస్ కెమెరా ఫిల్టర్స్ కూడా ఉన్నాయి.

Also Read: Moto G96 5G: బడ్జెట్ యూజర్ మనసు దోచుకునే ప్రైస్ అండ్ ఫీచర్స్ తో వచ్చేసింది.!

ఈ ఫోన్ ప్లస్ స్మార్ట్ ఫోన్ Bluetooth 5.4, aptX, aptX HD, LDAC, AAC, SBC, LHDC 5.0 ఫీచర్స్ తో పాటు NFC ఎనేబుల్ తో వస్తుంది. ఇందులో నోయిస్ క్యాన్సిలేషన్ సపోర్ట్ మరియు డ్యూయల్ స్టీరియో స్పీకర్లు ఉన్నాయి. ఈ వన్ ప్లస్ ఫోన్ 80W SUPERVOOC సపోర్ట్ కలిగిన 6800 mah బిగ్ బ్యాటరీ కలిగి ఉంటుంది.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile