OnePlus Nord 5: ప్రత్యేకమైన AI బటన్ మరియు Snapdragon చిప్సెట్ తో లాంచ్ అవుతుంది.!

HIGHLIGHTS

OnePlus Nord 5 స్మార్ట్ ఫోన్ ఇండియా లాంచ్ దగ్గరకు వచ్చేసింది

ఈ అప్ కమింగ్ ఫోన్ కీలకమైన ఫీచర్స్ కూడా టీజర్ ద్వారా బయట పెట్టడం మొదలు పెట్టింది

ఈ సిరీస్ నుంచి నార్డ్ 5 మరియు నార్డ్ 5CE రెండు ఫోన్లు లాంచ్ చేస్తుంది

OnePlus Nord 5 స్మార్ట్ ఫోన్ ఇండియా లాంచ్ దగ్గరకు వచ్చేసింది. అందుకే, వన్ ప్లస్ ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ కీలకమైన ఫీచర్స్ కూడా టీజర్ ద్వారా బయట పెట్టడం మొదలు పెట్టింది. ఈ సిరీస్ నుంచి నార్డ్ 5 మరియు నార్డ్ 5CE రెండు ఫోన్లు లాంచ్ చేస్తుంది. అయితే, ఇప్పుడు నార్డ్ 5 యొక్క చాలా ముఖ్యమైన ఫీచర్స్ కూడా ఇప్పుడు వెల్లడించింది.

OnePlus Nord 5 : లాంచ్

వన్ ప్లస్ నార్డ్ 5 సిరీస్ నుంచి లాంచ్ రెండు ఫోన్లు కూడా జూలై 8వ తేదీ మధ్యాహ్నం 12 గంటల సమయంలో లాంచ్ అవుతాయి. వీటిలో నార్డ్ 5 స్మార్ట్ ఫోన్ ఫీచర్లు బాగా ఆకట్టుకునేలా కనిపిస్తున్నాయి. అంతేకాదు, ఈ ఫోన్ సరికొత్తగా కూడా కనిపిస్తోంది.

OnePlus Nord 5 : కీలక ఫీచర్స్

వన్ ప్లస్ నార్డ్ 5 స్మార్ట్ ఫోన్ ను రీసెంట్ గా వన్ ప్లస్ విడుదల చేసిన వన్ ప్లస్ 13s ప్రీమియం స్మార్ట్ ఫోన్ మాదిరిగా కనిపించే సింపుల్ అండ్ క్లీన్ డిజైన్ తో అందిస్తున్నట్లు కనిపిస్తుంది. ఈ ఫోన్ చాలా స్లీక్ గా ఉన్నట్లు కనిపిస్తోంది మరియు మంచి లుక్స్ తో ఆకట్టుకుంటుంది. ఈ ఫోన్ సైడ్ లో AI కోసం ప్రత్యేకమైన బటన్ ఉన్నట్లు టీజర్ ఇమేజ్ ద్వారా చూపించింది.

వన్ ప్లస్ నార్డ్ 5 స్మార్ట్ ఫోన్ లో అందించిన చిప్ సెట్ వివరాలు వన్ ప్లస్ టీజర్ ద్వారా పంచుకుంది. ఈ స్మార్ట్ ఫోన్ ను క్వాల్కమ్ Snapdragon 8s Gen 3 చిప్ సెట్ తో లాంచ్ చేయబోతున్నట్లు వన్ ప్లస్ కన్ఫర్మ్ చేసింది. ఈ ఫోన్ ను చాలా వేగంగా చల్లబరిచే పెద్ద 7300 mm స్క్వేర్ వేపర్ ఛాంబర్ కూలింగ్ సిస్టం ఉన్నట్లు కూడా వన్ ప్లస్ తెలియచేసింది.

వన్ ప్లస్ నార్డ్ 5 స్మార్ట్ ఫోన్ నార్డ్ సిరీస్ ఫోన్లలో ఎన్నడూ లేని విధంగా 144Hz రిఫ్రెష్ రేట్ కలిగిన పవర్ ఫుల్ డిస్ప్లే కలిగి ఉంటుంది. ఈ ఫోన్ లో BGMI, CODM మరియు Free Fire స్మూత్ గేమింగ్ ఎక్స్పీరియన్స్ అందుకోవచ్చని కూడా వన్ ప్లస్ టీజింగ్ చేస్తోంది.

Also Read: Oppo Reno 14 Series : టాప్ ఫీచర్లు మరియు అంచనా ప్రైస్ తెలుసుకోండి.!

కెమెరా పరంగా ఈ ఫోన్ లో వెనుక డ్యూయల్ రియర్ మరియు ముందు సెల్ఫీ కెమెరా ఉంటుంది. ఇందులో, వెనుక 50MP Sony LYT 600 ప్రధాన కెమెరా మరియు ముందు 50MP JN5 సెల్ఫీ కెమెరాలు ఉంటాయని వన్ ప్లస్ వెల్లడించింది. ఈ ఫోన్ తో సహజ సిద్ధమైన రంగుల్లో నాచురల్ ఫోటోలు అందుకునే అవకాశం ఉంటుందని వన్ ప్లస్ గొప్పగా చెబుతోంది. ఈ ఫోన్ మరిన్ని ఫీచర్స్ కూడా త్వరలోనే వెల్లడించే అవకాశం ఉంటుంది.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :