OnePlus Nord 2T: జూలై 1న లాంచ్ అవుతుందా..!

HIGHLIGHTS

వన్ ప్లస్ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ OnePlus Nord 2T 5G

Nord 2T 5G స్మార్ట్ ఫోన్ జూలై 1 విడుదల కానున్నట్లు నివేదికలు చెబుతున్నాయి

ఈ ఫోన్ మీడియాటెక్ యొక్క వేగవంతమైన 5G చిప్ సెట్ Dimensity 1300 శక్తితో వస్తుంది

OnePlus Nord 2T: జూలై 1న లాంచ్ అవుతుందా..!

ఇండియాలో వన్ ప్లస్ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ OnePlus Nord 2T 5G స్మార్ట్ ఫోన్ జూలై 1 విడుదల కానున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. ఈ స్మార్ట్ ఫోన్ ఇప్పటికే UK లో విడుదల చేయబడింది మరియు ఇప్పుడు ఇండియాలో విడుదలకు సిద్దమవుతోంది. ఈ స్మార్ట్ ఫోన్ ఇండియన్ వేరియంట్ యొక్క కీలకమైన వివరాలను కూడా కంపెనీ ఇప్పటికే వెల్లడించింది. కంపెనీ అధికారిక వెబ్సైట్ ద్వారా ఈ ఫోన్ టీజర్ మరియు లాంచ్ నోటిఫికేషన్ కోసం Notify Me నోట్ ను కూడా అందించింది. మరి ఈ వన్ ప్లస్ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ లంచ్ డేట్, స్పెక్స్ మరియు ఫీచర్లను గురించి తెలుసుకుందామా.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

ఈ స్మార్ట్ ఫోన్ యొక్క లంచ్ డేట్ ని కంపెనీ అధికారికంగా ఎటువంటి లాంచ్ డేట్ ను వెల్లదించలేదు. అయితే, నెట్టింట్లో మాత్రం ఈ ఫోన్ జూలై 1న విడుదల అవుతుందని విశ్వసనీయంగా చెబుతున్నాయి. ఇదే నిజమైతే జూలై 1 వ తేది ఎక్కువ దూరంలో లేదు కాబట్టి త్వరలోనే కంపెనీ అధికారిక ప్రకటిన చేయవచ్చు.

ఇక వన్ ప్లస్ అధికారిక వెబ్సైట్ ద్వారా అందించిన వివరాల ప్రకారం, ఈ స్మార్ట్ ఫోన్ 80W SuperVOOC ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కలిగిన 4,500 mAh బ్యాటరీని కలిగి ఉంటుంది. అంతేకాదు, ఈ ఫోన్ యొక్క ప్రాసెసర్ వివరాలను కూడా కంపెనీ తెలిపింది. ఈ ఫోన్ మీడియాటెక్ యొక్క వేగవంతమైన 5G చిప్ సెట్ Dimensity 1300 శక్తితో వస్తుంది.

ఇక కెమెరా వివరాల్లోకి వెళితే, ఈ ఫోన్ వెనుక మైన్ కెమెరా గురించి కంపెనీ టీజింగ్ అందించింది. దీని ప్రకారం, OnePlus Nord 2T 5G స్మార్ట్ ఫోన్ OIS సపోర్ట్ కలిగిన 50MP SonyIMX766 సెన్సార్ తో వస్తుంది. ఈ కెమెరాతో కాంతి తక్కువగా ఉన్న సమయంలో కూడా గొప్ప ఫోటోలను చిత్రీకరించ వచ్చని కంపెనీ చెబుతోంది. అలాగే, ఈ ఫోన్ అవుట్ ఆఫ్-ది-బాక్స్ ఆక్సిజన్ OS 12.1 సాఫ్ట్ వేర్ ఆధారితంగా నడుస్తుంది.  

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo