వన్‌ప్లస్ నార్డ్ 2 5G సేల్: అమెజాన్ ప్రైమ్ డే సేల్ నుండి భారీ ఆఫర్లతో సేల్

వన్‌ప్లస్ నార్డ్ 2 5G సేల్: అమెజాన్ ప్రైమ్ డే సేల్ నుండి భారీ ఆఫర్లతో సేల్
HIGHLIGHTS

వన్‌ప్లస్ నార్డ్ 2 5G ప్రీమియం ఫీచర్లతో వచ్చింది.

లేటెస్ట్ 50MP SonyIMX766 సెన్సార్

ప్రైమ్ డే సేల్ నుండి మంచి ఆఫర్లు

ఇటీవలే వన్‌ప్లస్ నార్డ్ 2 5G స్మార్ట్ ఫోన్ ఇండియాలో విడుదయ్యింది. వన్‌ప్లస్ నార్డ్ 2 5G మిడ్ రేంజ్ సెగ్మెంట్ లో ప్రీమియం ఫీచర్లతో వచ్చింది. ఈ స్మార్ట్ ఫోన్ మంచి పెర్ఫార్మెన్స్ అందించగల లేటెస్ట్ 50MP SonyIMX766 సెన్సార్ తో వచ్చింది. వన్‌ప్లస్ నార్డ్ 2 5G స్మార్ట్ ఫోన్  బెస్ట్ కెమెరా, వేగవంతమైన ప్రాసెసర్  మరియు వేగవంతమైన ఛార్జింగ్ టెక్నాలజీతో సహా మరిన్ని లేటెస్ట్ బెస్ట్ ఫీచర్లతో విడుదల చెయ్యబడింది. ఈ ఫోన్ అమెజాన్ ప్రైమ్ డే సేల్ నుండి మంచి ఆఫర్లతో అందుబాటులో ఉంటుంది.

వన్‌ప్లస్ నార్డ్ 2 5G స్మార్ట్ ఫోన్ ను HDFC బ్యాంక్ డెబిట్/క్రెడిట్ కార్డ్స్ మరియు EMI అప్షన్ తో కొనుగోలు చేసే కస్టమర్లకు 10 డిస్కౌంట్ లభిస్తుంది. అంతేకాదు, వన్‌ప్లస్ నార్డ్ 2 5G  తో పాటుగా 1TB అధనపు క్లౌడ్ స్టోరేజ్ అందుతుంది. 6 నెలల EMI అప్షన్ తో కొనుగోలు చేసే HDFC కస్టమర్లకు No Cost EMI అఫర్ అందుబాటులో ఉంది. దీనితో పాటుగా మరిన్ని ఆఫర్లు ఈ సేల్ నుండి అందుబాటులో ఉంటాయి.             

OnePlus Nord 2 5G: ధర

వన్‌ప్లస్ నార్డ్ 2 5G యొక్క బేస్ వేరియంట్ రూ.27,999 రూపాయలతో ప్రారంభమవుతుంది. ఈ ఫోన్ మరిన్ని వేరియంట్స్ లో లభిస్తుంది. వన్‌ప్లస్ నార్డ్ 2 బ్లూ హేజ్, గ్రే సియారా మరియు గ్రీన్ ఉడ్స్ వంటి మూడు కలర్స్ లో లభిస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ యొక్క మొదటి సేల్ అమెజాన్ ప్రైమ్ డే సేల్ మొదటి రోజైన జూలై 26 నుండి మొదలవుతుంది.

OnePlus Nord 2 5G: ప్రత్యేకతలు

ఈ వన్‌ప్లస్ నార్డ్ 2 స్మార్ట్ ఫోన్ 6.43 -అంగుళాల FHD + రిజల్యూషన్ గల Fluid AMOLED డిస్ప్లే తో వుంటుంది మరియు ఇది 90Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ తో ఉంటుంది. ఇందులో, సెల్ఫీ కెమెరా కోసం పైన ఎడమ వైపున పంచ్ హోల్ డిజైన్ ని అందించింది. ఈ స్క్రీన్ 20: 9 ఎస్పెక్ట్ రేషియోని కలిగి ఉంది.

ఈ ఫోన్ మీడియాటెక్ Dimensity 1200-AI ప్రాసెసర్ శక్తితో వస్తుంది. ఇది ఆక్టా-కోర్ CPU మరియు ARM G77 MC9 GPU తో పనిచేస్తుంది. ఇది 12GB RAM మరియు 256GB UFS 3.1 2- లైన్ స్టోరేజ్ ఎంపికతో జత చేయబడుతుంది. ఇది ఆక్సిజన్ OS ఆధారితంగా ఆండ్రాయిడ్ 11 తో వస్తుంది.

ఇక కెమెరాల విషయానికి వస్తే, వన్‌ప్లస్ నార్డ్ 2 వెనుక భాగంలో ట్రిపుల్ కెమెరా సెటప్ తో వస్తుంది. ఈ సెటప్ లో ప్రాధమిక కెమెరా 50MP SonyIMX766 సెన్సార్ ని OIS ఫీచర్ f/1.88 అపర్చర్ తో అందించింది. ఈ మైన్ కెమెరా ఫోటోలు మరియు వీడియోలను చిత్రీకటించడంలో అద్భుతంగా వుంటుంది. దీనికి జతగా 8MP అల్ట్రా-వైడ్-యాంగిల్ కెమెరా, మోనో లెన్స్ లను జతచేసింది. ముందు భాగంలో, ఈ ఫోన్ పైభాగంలో ఉన్న పంచ్ హోల్ లోపల 32 MP సెల్ఫీ కెమెరాని SonyIMX615 సెన్సార్ తో అందించింది.

వన్‌ప్లస్ నార్డ్ 2 ఇన్ డిస్ప్లే  ఫింగర్ ప్రింట్ సెన్సార్ ని కలిగి వుంటుంది మరియు డ్యూయల్ స్టీరియో స్పీకర్లు, నోయిస్ క్యాన్సిలేషన్ సపోర్ట్ తో వస్త్తుంది. ఈ ఫోన్ 4,500 ఎమ్ఏహెచ్ బ్యాటరీని 65W వ్రాప్ ఛార్జ్ సపోర్ట్ తో వస్తుంది. ఈ ఛార్జింగ్ టెక్నాలజీతో కేవలం 15 నిముషాల ఛార్జింగ్ తో ఒక రోజుకు సరిపడిన ఛార్జ్ ను ఇవ్వగలదని వన్‌ప్లస్ తెలిపింది. 

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo