OnePlus N6 Lite: అప్ కమింగ్ ఫోన్ లాంచ్ అనౌన్స్ చేసిన వన్ ప్లస్.!

HIGHLIGHTS

వన్ ప్లస్ ఇండియాలో చాలా వేగంగా స్మార్ట్ ఫోన్ లను విడుదల చేస్తోంది

ఇప్పటికే వన్ ప్లస్ N సిరీస్ నుంచి వన్ ప్లస్ N6 మరియు N6x స్మార్ట్ లను అందించిన వన్ ప్లస్

ఈ ఫోన్ ను కూడా అమెజాన్ ఇండియా ద్వారా టీజింగ్ చేసింది

OnePlus N6 Lite: వన్ ప్లస్ ఇండియాలో చాలా వేగంగా స్మార్ట్ ఫోన్ లను విడుదల చేస్తోంది. ఇప్పటికే వన్ ప్లస్ N సిరీస్ నుంచి వన్ ప్లస్ N6 మరియు N6x స్మార్ట్ లను అందించిన వన్ ప్లస్, ఇప్పుడు ఇదే సిరీస్ నుంచి బడ్జెట్ వెర్షన్ ఫోన్ లాంచ్ కోసం టీజింగ్ ప్రారంభించింది. అదే, వన్ ప్లస్ ఎన్ 6 లైట్ స్మార్ట్ ఫోన్ మరియు ఈ ఫోన్ ను కూడా అమెజాన్ ఇండియా ద్వారా టీజింగ్ చేసింది.

OnePlus N6 Lite: లాంచ్ డేట్

వన్ ప్లస్ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ ఎన్ 6 లైట్ స్మార్ట్ ఫోన్ లాంచ్ డేట్ ఇంకా కన్ఫర్మ్ చేయలేదు. అయితే, ఈ ఫోన్ ను త్వరలో లాంచ్ చేయనున్నట్లు అనౌన్స్ చేసింది. ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ లాంచ్ కోసం అమెజాన్ ఇండియా మరియు కంపెనీ అఫీషియల్ వెబ్సైట్ నుంచి టీజింగ్ చేసింది. ఈ ఫోన్ యూ ఇదే నెల చివరి వరకు లాంచ్ చేసే అవకాశం ఉండొచ్చని మార్కెట్ వర్గాలు అంచనా వస్తున్నాయి.

OnePlus N6 Lite: ఫీచర్స్

వన్ ప్లస్ ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ లాంచ్ ఫీచర్స్ లేదా ఇతర వివరాలు ఇంకా రివీల్ చేయలేదు. అయితే, ఈ అప్ కమింగ్ ఫోన్ టీజర్ ఇమేజ్ ద్వారా ఈ ఫోన్ మంచి స్లీక్ డిజైన్ తో లాంచ్ కావడానికి సిద్ధంగా ఉన్నట్లు చూపించింది. ఈ ఫోన్ లాంచ్ కోసం అందించిన క్యాప్షన్ లో ‘Powerfully Big’ అని నోట్ అందించింది. అంటే, ఈ ఫోన్ బిగ్ అండ్ పవర్ ఫుల్ బ్యాటరీ అండ్ ఫీచర్స్ వుడ్ లాంచ్ చేసే అవకాశం ఉండొచ్చా? అని మార్కెట్ వర్గాలు ఊహలు మొదలు పెట్టారు. అంతేకాదు, ఈ ఫోన్ అంచనా ఫీచర్స్ వెల్లడించడం కూడా మొదలుపెట్టారు.

Also Read: లేటెస్ట్ 7.2.4 Dolby Atmos సౌండ్ బార్ పై భారీ ప్రైస్ కట్ ఆఫర్.!

వన్ ప్లస్ ఎన్ 6 లైట్: అంచనా ఫీచర్స్

ఈ ఫోన్ అంచనా ఫీచర్స్ ను మార్కెట్ వర్గాలు వెల్లడించాయి. వాటి ప్రకారం, ఈ ఫోన్ 6.8 ఇంచ్ LCD స్క్రీన్ తో లాంచ్ అవుతుంది. ఈ స్క్రీన్ HD + రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్ మరియు మంచి బ్రైట్నెస్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ ను మీడియాటెక్ Dimensity 6360 Apex తో లాంచ్ అవుతుందని చెబుతున్నారు. ఈ ఫోన్ 4 జీబీ ర్యామ్ అండ్ 128 జీబీ స్టోరేజ్ తో వచ్చే అవకాశం ఉంటుంది.

ఈ ఫోన్ లో 7000 mAh భారీ బ్యాటరీ తో లాంచ్ అయ్యే అవకాశం ఉంటుందని కూడా అంచనా వేస్తున్నారు. అలాగే, ఫాస్ట్ ఛార్జ్ మరియు రివర్స్ ఛార్జ్ కూడా కలిగి ఉండే అవకాశం ఉండొచ్చు. ఈ ఫోన్ లో 50MP లేదా 13MP డ్యూయల్ రియర్ కెమెరాతో వచ్చే అవకాశం ఉండొచ్చు.

ఈ అప్ కమింగ్ ఫోన్ లాంచ్ డేట్ తో పాటు కీలక ఫీచర్స్ ను కూడా వన్ ప్లస్ త్వరలోనే లాంచ్ చేస్తున్నట్టు చెబుతోంది కాబట్టి, ఈ ఫోన్ ఫీచర్స్ రివీల్ అయిన తర్వాత ఈ అంచనా ఫీచర్స్ లో ఎన్ని నిజం అవుతాయో తెలుస్తుంది.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :