OnePlus N6 launch date confirmed in India
OnePlus N6: రీసెంట్ గా వన్ ప్లస్ కొత్త సిరీస్ స్మార్ట్ ఫోన్ గురించి టీఆర్ విడుదల కంపెనీ, ఈరోజు ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ లాంచ్ డేట్ కూడా అనౌన్స్ చేసింది. ప్రారంభంలో కేవలం ప్రీమియం స్మార్ట్ ఫోన్లను మాత్రమే అందించిన వన్ ప్లస్ నార్డ్ సిరీస్ తో బడ్జెట్ ఫోన్లు కూడా ఇండియన్ మార్కెట్లో విడుదల చేసింది. మరి ఇప్పుడు కొత్తగా లాంచ్ చేయబోతున్న వన్ ప్లస్ ఎన్ సిరీస్ స్మార్ట్ ఫోన్లు ఏ బడ్జెట్ కోవకు చెందుతాయో చూడాలి.
వన్ ప్లస్ ఎన్ 6 స్మార్ట్ ఫోన్ ను జూన్ 30వ తేదీ ఇండియన్ మార్కెట్లో లాంచ్ చేస్తున్నట్లు వన్ ప్లస్ డేట్ అనౌన్స్ చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ లాంచ్ డేట్ మరియు టీజర్ ఇమేజ్ ను కంపెనీ వెబ్సైట్, అఫీషియల్ X (ట్విట్టర్) మరియు అమెజాన్ ఇండియా ద్వారా అందించింది. అంతేకాదు, ఈ ఫోన్ ను అమెజాన్ స్పెషల్ గా లాంచ్ చేస్తున్నట్లు అనౌన్స్ చేసింది. అంటే, ఈ ఫోన్ సేల్ కోసం అమెజాన్ ఇండియా ప్రత్యేకమైన సేల్ పార్ట్నర్ గా వ్యవహరిస్తుంది.
Also Read: OnePlus Nord Buds 4 ఇండియా లాంచ్ టీజర్ విడుదల చేసిన వన్ ప్లస్.!
వన్ ప్లస్ ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ యొక్క వివరాలు ఇంకా బయటకు వెల్లడించలేదు. ఈ స్మార్ట్ ఫోన్ లాంచ్ కోసం అందించిన టీచర్ ఇమేజ్ ద్వారా ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ డిజైన్ వివరాలు మాత్రం రివీల్ చేసింది. ఈ డిజైన్ ఇమేజ్ ప్రకారం, ఈ అప్ కమింగ్ వన్ ప్లస్ స్మార్ట్ ఫోన్ డ్యూయల్ కెమెరా, స్లీక్ డిజైన్ మరియు రౌండ్ కార్నర్ డిజైన్ తో డీసెంట్ లుక్ లో ఉన్నట్లు క్లియర్ అయ్యింది.
అయితే, ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ ఫీచర్స్ గురించి వచ్చిన లీక్స్ ఈ ఫోన్ వివరాలు తెలిపాయి. ఈ అప్ కమింగ్ వన్ ప్లస్ స్మార్ట్ ఫోన్ పై నెట్టింట్లో చర్చలో ఉన్న ఆ లీక్స్ మరియు రూమర్లు ఏమిటో ఇప్పుడు చూద్దాం.
వన్ ప్లస్ ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ సిరీస్ ను యువతను లక్ష్యంగా చేసుకుని తీసుకొస్తున్నట్లు లీక్స్ చెబుతున్నాయి. ఈ ఫోన్ లో 6.72 అంగుళాల FHD+ LCD డిస్‌ప్లే 144Hz రిఫ్రెష్ రేట్ తో కలిగి ఉండొచ్చని లీక్స్ పేర్కొన్నాయి. ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ ను మీడియాటెక్ Dimensity 7360 Turbo చిప్ సెట్ తో లాంచ్ చేస్తున్నట్లు లీక్స్ చెబుతున్నాయి.