OnePlus N6 launch confirmed with 8000 mah heavy battery
OnePlus N6: ఇండియాలో వన్ ప్లస్ పరిచయం చేస్తున్న కొత్త N సిరీస్ స్మార్ట్ ఫోన్ యొక్క లాంచ్ డేట్ మీ నిన్న ప్రకటించింది. ఈ రోజు అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ కీలక వివరాలు వెల్లడించడం కూడా ప్రారంభించింది. వన్ ప్లస్ పరిచయం చేయబోతున్న ఈ అప్ కమింగ్ ఫోన్ ను భారీ 8000 mAh బ్యాటరీతో రిలీజ్ చేస్తున్నట్లు వన్ ప్లస్ కన్ఫర్మ్ చేసింది.
వన్ ప్లస్ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ వన్ ప్లస్ ఎన్ 6 జూన్ 30వ తేదీ ఇండియాలో లాంచ్ అవుతుంది. ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ లాంచ్ టీజర్ పేజీ నుంచి ఈ ఫోన్ కీలక ఫీచర్స్ ఈరోజు రివీల్ చేసింది.
వన్ ప్లస్ ఎన్ 6 స్మార్ట్ ఫోన్ స్లీక్ అండ్ కాంపాక్ట్ డిజైన్ ఉన్నట్లు ఈ ఫోన్ టీజర్ ఇమేజ్ చూస్తే అర్ధం అవుతుంది. అంతేకాదు, ఈ ఫోన్ లో వెనుక డ్యూయల్ రియర్ కెమెరా మరియు ఈ సెటప్ తో జతగా ఫ్లాష్ లైట్ కూడా ఉంటుంది. ఈ ఫోన్ యొక్క ఒక కీలకమైన ఫీచర్ ని ఈరోజు వన్ ప్లస్ రివీల్ చేసింది. అదేమిటంటే, వన్ ప్లస్ ఎన్ 6 స్మార్ట్ ఫోన్ 8000 mAh భారీ బ్యాటరీ కలిగి ఉంటుంది.
ఈ ఫోన్ కలిగిన బిగ్ బ్యాటరీతో మూడు రోజులు పవర్ ని అందిస్తుందని కూడా వన్ ప్లస్ ఈ బ్యాటరీ శక్తిని గురించి తెలిపింది. అంతేకాదు, ఈ బ్యాటరీ 7 సంవత్సరాల బ్యాటరీ హెల్త్ సపోర్ట్ తో వస్తుంది. అంటే, లాంగ్ బ్యాటరీ మరియు లాంగ్ లైఫ్ ఈ ఫోన్ లో అందిస్తుంది. ఈ ఫోన్ లో టైప్ C పోర్ట్ మరియు ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ కూడా ఉంటుంది. అయితే, ఛార్జ్ టెక్ మరియు ఇతర ఫీచర్స్ ఇంకా ప్రకటించలేదు. అయితే, ఈ అప్ కమింగ్ ఫోన్ లీక్డ్ ఫీచర్స్ ఈ ఫోన్ గురించి వివరాలు చెబుతున్నాయి.
Also Read: Air Conditioner కొనుగోలు చేసే ముందు తప్పక తెలుసుకోవాల్సిన 10 ముఖ్యమైన విషయాలు.!
ఈ వన్ ప్లస్ ఫోన్ మీడియాటెక్ Dimensity 7360 Turbo చిప్ సెట్ లేదా Snapdragon 8s Gen 4 చిప్ సెట్ తో జతగా ఫాస్ట్ ర్యామ్ తో లాంచ్ అయ్యే అవకాశం ఉందని లీక్స్ పేర్కొన్నాయి. ఈ ఫోన్ 6.72 ఇంచెస్ LCD స్క్రీన్ ను FHD+ రిజల్యూషన్ మరియు 144Hz రిఫ్రెష్ రేట్ తో కలిగి ఉండొచ్చని కూడా లీక్స్ చెబుతున్నాయి. కెమెరా పరంగా, ఇందులో 50MP ప్రధాన కెమెరా జత 8MP అల్ట్రా వైడ్ కెమెరా కలిగిన డ్యూయల్ రియర్ మరియు ముందు 32MP సెల్ఫీ కెమెరా ఉండొచ్చని కూడా లీక్ రిపోర్ట్స్ వెల్లడించాయి.
అయితే, కంపెనీ అఫీషియల్ ఫీచర్స్ వెల్లడించిన తర్వాత ఈ లీక్డ్ ఫీచర్స్ లో ఎన్ని నిజం అవుతాయి అని తెలుస్తుంది.