oneplus announced OnePlus N Series launch in india
OnePlus N Series: ఇండియాలో కొత్త స్మార్ట్ ఫోన్ సిరీస్ లాంచ్ చేస్తున్నట్లు ప్రకటించి వన్ ప్లస్ అందరినీ ఆశ్చర్యపరిచింది. వన్ ప్లస్ కొత్తగా N సిరీస్ ను ఇండియాలో లాంచ్ చేస్తోంది. ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ కోసం టీజింగ్ ని కూడా స్టార్ట్ చేసింది. ఈ అప్ కమింగ్ సిరీస్ లాంచ్ కోసం కంపెనీ అందించిన టీజర్ ఇమేజ్ లో మూడు ఫోన్లు కలిపి ఎన్ అక్షరం మాదిరిగా చూపించింది.
వన్ ప్లస్ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ సిరీస్ లాంచ్ డేట్ ను ఇంకా అనౌన్స్ చేయలేదు. ఈ స్మార్ట్ ఫోన్ లాంచ్ కోసం కేవలం టీజింగ్ మాత్రమే ప్రారంభించింది. ఈ ఫోన్ త్వరలో లాంచ్ అవుతుందని వన్ ప్లస్ టీజర్ లో తెలిపింది. ఈ అప్ కమింగ్ సిరీస్ లాంచ్ కోసం వన్ ప్లస్ అఫీషియల్ సైట్ మరియు అమెజాన్ ఇండియా నుంచి ప్రత్యేకమైన మైక్రో సైట్ టీజర్ పేజీ ద్వారా టీజింగ్ చేస్తోంది.
టెక్ వర్గాల సమాచారం ప్రకారం వన్ ప్లస్ N సిరీస్ జూలై నెలలో భారత మార్కెట్లో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. అంతేకాదు, ఈ సిరీస్ ఫోన్లు రూ.15,000 నుంచి రూ.20,000 ధర రేంజ్ లో ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. అయితే, ఈ ఫోన్ టీజర్ ఇమేజ్ ను చూస్తుంటే ఇది రూ. 25,000 నుంచి రూ. 30,000 ధరలో వచ్చే మిడ్ రేంజ్ ఫోన్ గా అనిపిస్తుంది. ఆఫ్ కోర్స్, ఇప్పుడు మనం మాట్లాడుతోంది ఈ ఫోన్ పై నెట్టింట్లో నడుస్తున్న రూమార్డ్ వివరాలు మాత్రమే సుమ.
ఇక ఫీచర్స్ విషయానికి వస్తే, ప్రస్తుతం అధికారిక వివరాలు బయటకు రానప్పటికీ, ఆన్లైన్ లీకుల ద్వారా ఈ ఫోన్ ఫీచర్లు వెల్లడిస్తున్నారు. లీక్స్ ప్రకారం, ఈ సిరీస్ ఫోన్లు 6.6 అంగుళాల నుంచి 6.8 అంగుళాల వరకు పెద్ద LCD డిస్‌ప్లే కలిగి ఉండే అవకాశం ఉంది. ఈ ఫోన్లు 120Hz హై రిఫ్రెష్ రేట్ మరియు మంచి బ్రైట్నెస్ కూడా కలిగి ఉంటాయి.
Also Read: Flipkart Sale బిగ్ డీల్ : లేటెస్ట్ 55 ఇంచ్ QLED Smart Tv ని కేవలం 25 వేలకే అందుకోండి.!
డిజైన్ పరంగా, ఈ సిరీస్ ఫోన్లు కాంపాక్ట్ అండ్ స్లీక్ డిజైన్ కలిగి ఉంటాయి. మీడియాటెక్ Dimensity లేదా Snapdragon లేటెస్ట్ సిరీస్ చిప్ సెట్ తో ఈ ఫోన్ అయ్యే అవకాశం ఉంటుంది. 5,000mAh కంటే ఎక్కువ సామర్థ్యం గల బ్యాటరీ మరియు 45W లేదా అంతకంటే వేగవంతమైన ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఈ సిరీస్ ఫోన్లలో ఉండే అవకాశం ఉంటుంది.
ఈ ఫోన్ లాంచ్ డేట్ మరియు ఈ సిరీస్ ఫోన్ కీలక ఫీచర్లు కూడా వన్ ప్లస్ త్వరలో లాంచ్ చేస్తుంది. కాబట్టి, ఈ ఫోన్ వివరాలు అఫీషియల్ గా తెలుసుకోవచ్చు.