Oneplus నుండి చౌక స్మార్ట్ ఫోన్, అనుకోకుండా పేరును వెల్లడించిన కంపెనీ

Oneplus నుండి చౌక స్మార్ట్ ఫోన్, అనుకోకుండా పేరును వెల్లడించిన కంపెనీ
HIGHLIGHTS

Oneplus కంపెనీ తక్కువ-ధర గల స్మార్ట్‌ ఫోనుగా‌ Oneplus Z లేదా Oneplus 8 Lite ని ప్రకటించవచ్చని, కొంతకాలంగా చాలా పుకార్లు ఉన్నాయి.

ఇప్పటివరకూ ప్రీమియమా స్మార్ట్ ఫోన్లను మాత్రమే తయారుచేసిన Oneplus కంపెనీ కూడా బడ్జెట్ స్మార్ట్ ఫోన్లను చేయనున్నట్లు వస్తున్న కథనాలు నిజమే కానున్నట్లు అనిపిస్తోంది. ఎందుకంటే, ఇప్పటి వరకూ Oneplus కంపెనీ తక్కువ-ధర గల స్మార్ట్‌ ఫోనుగా‌ Oneplus Z లేదా Oneplus 8 Lite ని ప్రకటించవచ్చని, కొంతకాలంగా చాలా పుకార్లు ఉన్నాయి. నిన్నటి వరకు అధికారికంగా వీటి ఉనికిని గుర్తించలేదు. అయితే, OnePlus Z Lite Thing అని పిలువబడే ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ ప్రత్యక్ష ప్రసారం అవ్వడం చూస్తుంటే, ఇది నిజమనే అనిపిస్తుంది .

 ఈ అకౌంట్, నాలుగు గ్రూప్ ఫోటోలతో కొద్ది నిమిషాల క్రితం మరొక అప్డేట్ ను పోస్ట్ చేసింది, కాని వాటిలో ఒకటి వెంటనే తొలగించింది. కానీ, ఈ Oneplus పైన డేగ కళ్ళతో వెతికే అభిమానులు, ఈ తొలగించిన చిత్రం యొక్క స్క్రీన్ షాట్‌ను ఒడిసి పట్టుకున్నారు. ఈ స్క్రీన్ షాట్ ప్రకారం, రాబోయే వన్‌ప్లస్ సరసమైన స్మార్ట్ ఫోన్ పేరును “NORD” అని సూచిస్తుంది. ఈ చిత్రంలో వన్‌ప్లస్ సహ వ్యవస్థాపకుడు Carl Pei, రెండు కార్డులను పట్టుకొని వున్నారు, వాటిలో ఒకదానికి పైన “NORD” అనే పదాలను వ్రాశారు.

 

 

మా మునుపటి రిపోర్ట్ ప్రకారం, వన్‌ప్లస్ ఈ సంవత్సరం ప్రారంభంలో మార్చిలో “నార్డ్ బై వన్‌ప్లస్” కోసం ట్రేడ్‌మార్క్‌ను నమోదు చేసింది. వన్‌ప్లస్ జెడ్ లైట్ థింగ్ పేరుతో ఇన్‌స్టాగ్రామ్ ఖాతా విషయానికొస్తే, ఇది రాబోయే సరసమైన స్మార్ట్‌ఫోన్‌కు పేరు పెట్టడం చుట్టూ ఆన్లైన్లో చక్కర్లు కొడుతున్న అన్ని పుకార్లను దీని చుట్టూ తిప్పేందుకు, సంస్థ ఉపయోగిస్తున్న మార్కెటింగ్ పదం మాత్రమే అని స్పష్టంగా తెలుస్తుంది.

Oneplus NORD స్పెసిఫికేషన్లను కూడా లీక్ చేసింది

Oneplus NORD ఒక 6.55-అంగుళాల పూర్తి HD + (2400 x 1080 పిక్సెల్స్) AMOLED స్క్రీన్‌ను 90Hz హై-రిఫ్రెష్-రేట్‌తో కలిగి ఉందని పుకారు కూడా ఉంది. సెల్ఫీ కెమెరా కోసం ఈ ఫోన్ మధ్యలో పంచ్-హోల్ కటౌట్ ఉండవచ్చని ఆన్లైన్ Leaks సూచించాయి.

ఈ ఫోన్‌ను Qualcomm Snapdragon 765G చిప్‌సెట్ ఆక్టా-కోర్ ప్రాసెసర్ మరియు Adreno 620 GPU తో కలిగి ఉంటుంది. ఇది 6 జిబి ర్యామ్ మరియు 128 జిబి స్టోరేజ్‌తో జత చేయబడింది మరియు మరిన్ని వేరియంట్‌లు కూడా ఉండవచ్చు.

Oneplus NORD వెనుకవైపు ట్రిపుల్ కెమెరా సెటప్‌తో రావచ్చు, ఇందులో ప్రాధమిక 64 MP కెమెరా, 16 MP  అల్ట్రా-వైడ్-కెమెరా మరియు 2 MP  మాక్రో లెన్స్ ఉంటాయి. ముందు వైపు సెల్ఫీలు కోసం 16 MP కెమెరా ఉంది.

ఇది అవుట్-ఆఫ్-ది-బాక్స్ 30W ఫాస్ట్ ఛార్జింగ్ మద్దతుతో 4,300 ఎంఏహెచ్ బ్యాటరీతో అమర్చబడిందని పుకారు ఉంది. కార్ల్ పీ కూడా ఈ ఫోన్‌ను ఒరిజినల్ వన్‌ప్లస్ వన్ ధరతో సమానంగా, అంటే రూ .22,000 ధర వద్ద ప్రారంభించవచ్చని సూచించారు. ఈ ఫోన్ జూలై నెలలో ఎప్పుడైనా షెడ్యూల్ చేయబడుతుందని భావిస్తున్నారు.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo