ఈ రోజే ONEPLUS 7 మొదటి సేల్ : SD855 SoC, 48MP డ్యూయల్ కెమేరా ఇంకా మరెన్నో..

ఈ రోజే ONEPLUS 7 మొదటి సేల్ : SD855 SoC, 48MP డ్యూయల్ కెమేరా ఇంకా మరెన్నో..
HIGHLIGHTS

ఈ స్మార్ట్ ఫోన్ను ఒక స్నాప్ డ్రాగన్ 855 SoC తో తీసుకొచ్చింది మరియు ఇది 7nm చిప్సెట్ కావడంతో అత్యంతవేగంగా పనిచేస్తుంది.

ఈ వేగవంతమైన ప్రాసెసరుకు జతగా, 6GB/8GB ర్యామ్ ఎంపికలతో తీసుకొచ్చింది.

ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకి అమెజాన్ నుండి అమ్మకానికి సిద్దమయ్యింది.

ONEPLUS ప్రియలు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న Oneplus 7 ఈ రోజు నుండి సేల్ కి సిద్ధమైంది.  వన్ ప్లస్ సంస్థ తన Oneplus 7 స్మార్ట్ ఫోన్ను గొప్ప కెమేరాలు, అత్యంత వేగవంతమైన ప్రాసెసర్ మరియు బెస్ట్ డిస్ప్లేతో ఇండియాలో విడుదల చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ను ఒక స్నాప్ డ్రాగన్ 855 SoC తో తీసుకొచ్చింది మరియు ఇది 7nm చిప్సెట్ కావడంతో అత్యంతవేగంగా పనిచేస్తుంది. ఈ వేగవంతమైన ప్రాసెసరుకు జతగా, 6GB/8GB ర్యామ్ ఎంపికలతో తీసుకొచ్చింది. ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకి అమెజాన్ నుండి అమ్మకానికి సిద్దమయ్యింది.

OnePlus 7 కూడా రెండు వేర్వేరు కలర్ వేరియంట్లలో విడుదల చేయబడింది, దీని యొక్క 6GB RAM మరియు 128GB స్టోరేజి మిర్రర్ గ్రే కలర్ వేరియంట్ కేవలం రూ .32,999 ధరతో మరియు  8GB RAM మరియు 256GB  స్టోరేజి మిర్రర్ గ్రే కలర్ వేరియంట్ రూ .37,999 ధరతో కొనుగోలు చేయవచ్చు. అంతేకాకుండా, మీరు OnePlus 7 రెడ్ కలర్ 8GB RAM మరియు 256GB స్టోరేజి వేరియంట్ తీసుకోవాలనుకుంటే, దీని కోసం రూ .37,999 ఖర్చు చేయాలి.

OnePlus 7 లాంచ్ ఆఫర్లు

OnePlus 7  స్మార్ట్ ఫోనుతో పాటుగా జియో యొక్క 9300 రూపాయల బెనిఫిట్స్ అందుకోవచ్చు. ఇక బ్యాంక్ ఆఫర్ల విషయానికి వస్తే, SBI కార్డుతో ఈ ఫోన్ను కొనుగోలు చేసేవారికి 2,000 రూపాయల వరకూ తక్షణ డిస్కౌంట్ అందిస్తోంది. అలాగే, 3 నెలల EMI ఎంపికతో కొనుగోలు చేసేవారికి ఎటువంటి వడ్డీ లేకుండా No Cost EMI ని కూడా అందిస్తోంది.     

OnePlus 7  ప్రత్యేకతలు

ఈ స్మార్ట్ ఫోన్ 3120 x 1440 పిక్సెళ్ళ రిజల్యూషన్ అందిచగల ఒక 6.41 అంగుళాల ఆప్టిక్ AMOLED డిస్ప్లేతో అందించింది. ఈ డిస్ప్లే ఒక వాటర్ డ్రాప్ నోచ్ తో ఉంటుంది మరియు ఒక 19.5:9 ఆస్పెక్ట్ రేషియాతో వస్తుంది. ఈ ఫోన్  అత్యంత వేగవంతమైన క్వాల్కామ్ స్నాప్ డ్రాగన్ 855 ఆక్టా కోర్ 7nm ప్రాసెస్సరుతో పనిచేస్తుంది. ఈ వేగవంతమైన ప్రాసెసరుకు జతగా, 6GB/8GB LPDDR4X  ర్యామ్ ఎంపికలతో తీసుకొచ్చింది. ఈ ఫోన్ యొక్క డిస్ప్లేలో ఒక అంతర్గత ఫింగర్ ప్రింట్ సెన్సార్ ని కూడా అందించింది. కేవలం వేగం ఒక్కటే కాకుండా, స్టైల్ మరియు ట్రెండ్ రెండింటిని  జత చేసినట్లు చెప్పొచ్చు.

ఇక కెమేరా విభాగానికి వస్తే, ఈ స్మార్ట్ ఫోన్ యొక్క వెనుక భాగంలో f/1.7 అపర్చరు కలిగిన 48MP SonyIMX586 సెన్సర్ ని ప్రధాన కెమెరాగా అందించింది. దీనికి జతగా మరొక  f/2.4 అపర్చరు కలిగిన 5MP కెమేరాని జతచేసిన దుఆలు కెమెరాని అందించింది . ఈ కెమేరాతో 4K రిజల్యూషన్ తో 30/60fps వద్ద వీడియోలను తీసుకోవచ్చు. ఇక సెల్ఫీ కెమేరా విషయానికి వస్తే, ఇందులో ఒక 16MP కెమేరాని SonyIMX 471 సెన్సారుతో అందించి.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo