OnePlus 6T పైన రూ.10,000 రుపాయల భారీ డిస్కౌంట్

OnePlus 6T పైన రూ.10,000 రుపాయల భారీ డిస్కౌంట్
HIGHLIGHTS

భారతదేశంలో ఆల్ టైమ్ బెస్ట్ ఫోనుగా నిలచిన OnePlus 6T స్మార్ట్ ఫోను పైన అత్యధికంగా 10,000 రూపాయల డిస్కౌంట్ ప్రకటించింది అమేజాన్ ఇండియా.

భారతదేశంలో ఆల్ టైమ్ బెస్ట్ ఫోనుగా నిలచిన OnePlus 6T స్మార్ట్ ఫోను పైన అత్యధికంగా 10,000 రూపాయల డిస్కౌంట్ ప్రకటించింది అమేజాన్ ఇండియా. అంతేకాదు, NO COST EMI మరియు మరిన్ని ఆఫర్లను ఈ స్మార్ట్ పైన అందిస్తోంది.

OnePlus 6T ఫోన్ రూ.37,999 ధరతో మార్కెట్లోకి విడుదలైనది. అంతేకాదు, ఇప్పటికి కూడా నిలకడగా ఇదే ధరపైనా అమ్మకాలను కొనసాగిస్తోంది. అయితే, OnePlus 6T స్మార్ట్ ఫోన్ పైన ముందుగా 3,000రూపాయల డిస్కౌంట్ అందించింది, అమెజాన్ ఇండియా. అయితే, ప్రస్తుతం ఈ స్మార్ట్ ఫోను పైన అత్యదికంగా ఇప్పుడు అమేజాన్ ఇండియా రూ.10,000 రూపాయల డిస్కౌంట్ ప్రకటించింది. అంటే, ఇప్పుడు అమేజాన్ ఇండియా  నుండి కేవలం రూ.రూ.27,999 ధరతో కొనుగోలు చేయవచ్చు. అధనంగా, పైన తెలిపిన బ్యాంక్ ఆఫర్లు కూడా అందుబాటులో వున్నాయి కాబట్టి మరింత డిస్కౌంట్ కూడా అందుకోవచ్చు.                         

OnePlus 6T ప్రత్యేకతలు

ఇక ఈ OnePlus 6T స్మార్ట్ ఫోన్ ప్రత్యేకతలు విషయానికి వస్తే, ఈ ఫోన్ 19.5:9 యాస్పెక్ట్ రేషియాతో 2340×1080 పిక్సెళ్ళు అందించగల ఒక 6.41 అంగుళాల ఆప్టిక్ అమోల్డ్ వాటర్ డ్రాప్ నోచ్ డిస్ప్లే తో వస్తుంది మరియు ఇది 402ppi పిక్సెళ్ళ రిజల్యూషన్ అందిస్తుంది. ఈ ఫోన్ యొక్క స్క్రీన్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ రక్షణతో అందించబడినది

 వన్ ప్లస్ 6T  2.8Ghz క్లాక్ వేగంగల క్వల్కామ్ స్నాప్ డ్రాగన్ 845 SoC తో శక్తిని పొందింది మరియు 6GB ర్యామ్ జతగా 128GB అంతర్గత స్టోరేజి మరియు 8GB ర్యామ్ జతగా 256GB అంతర్గత స్టోరేజి వంటి రేడు వేరియంటలలో లభిస్తుంది. ఇది LPDDR4X ర్యామ్ మరియు UFS 2.12-Lane  స్టోరేజిని కలిగి ఉంటుంది.  ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 9 ఫై ఆధారిత తాజా ఆక్సిజన్ OS తో నడుస్తుంది. ఈ కొత్త OS, అప్డేటింగ్ గేమ్ మోడ్ మరియు స్మార్ట్ బూస్ట్ వంటి చాల మెరుగుదలలను అందిస్తుంది .

ఆప్టిక్స్ విషయానికి వస్తే, వన్ ప్లస్ ఈ ఫోన్ లో వెనుక భాగంలో, Sony IMX519 సెన్సార్ గల 16MP ప్రధాన కెమేరా  జతగా Sony IMX376 సెన్సార్ గల 20MP తో డ్యూయల్ కెమేరాని కలిగి ఉంటుంది. ఈ ప్రధాన 16MP కేమెరా, 1.22μm పిక్సెల్స్ తో  f/1.7 ఆపేర్చేరుతో వస్తుంది, అయితే రెండవ 20MP సెన్సర్ కూడా f/1.7 ఆపేర్చేరు  1.0μm పిక్సెల్ పిచ్ తో వస్తుంది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo