OnePlus 12R smartphone available with big deals
OnePlus 12R స్మార్ట్ ఫోన్ రోజు గొప్ప డిస్కౌంట్ లతో బడ్జెట్ ధరలో లభిస్తుంది. భారత మార్కెట్లో ప్రీమియం ధరలో వచ్చిన ఈ ఫోన్ ను ఈరోజు 30 వేల కంటే తక్కువ ధరలో అందుకునే ఛాన్స్ వుంది. ఈ ఫోన్ ప్రీమియం కెమెరా సెటప్ మరియు గొప్ప ఫీచర్స్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ ఈరోజు బడ్జెట్ ధరలో లభిస్తుంది. మరి ఈరోజు లభిస్తున్న ఈ బెస్ట్ వన్ ప్లస్ స్మార్ట్ ఫోన్ డీల్ పై ఒక లుక్కేద్దామా.
వన్ ప్లస్ 12R స్మార్ట్ ఫోన్ రూ. 39,999 రూపాయల బేసిక్ ధరతో ఇండియాలో లాంచ్ అయ్యింది. ఈ స్మార్ట్ ఫోన్ ఈ రోజు రూ. 7,000 భారీ డిస్కౌంట్ తో కేవలం రూ. 32,999 రూపాయల ఆఫర్ ప్రైస్ తో లిస్ట్ అయ్యింది. అంతేకాదు, ఈ ఫోన్ పై రూ. 3,000 రూపాయల భారీ బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ కూడా అందుబాటులో ఉంది.
ఈ ఫోన్ ను HDFC మరియు ICICI బ్యాంక్ క్రెడిట్ అండ్ డెబిట్ కార్డ్ తో కొనే వారికి ఈ డిస్కౌంట్ లభిస్తుంది. అంతేకాదు, RBL బ్యాంక్ మరియు OneCard క్రెడిట్ కార్డ్ తో ఈ ఫోన్ ను కో కొనుగోలు చేసే వారికి కూడా ఈ డిస్కౌంట్ లభిస్తుంది. ఈ డిస్కౌంట్ ఆఫర్ తో ఈ ఫోన్ ను కేవలం రూ. 29,999 రూపాయల అతి తక్కువ ధరకు పొందవచ్చు. ఈ ఫోన్ ను అమేజ్ ఇండియా మరియు oneplus.com నుంచి అఫర్ ధరకే కొనుగోలు చేయవచ్చు. Buy From Here
Also Read: బిగ్ డిస్కౌంట్ తో 5 వేలకే 200W 5.1 Soundbar అందుకోండి.. ఎక్కడంటే.!
ఈ వన్ ప్లస్ ప్రీమియం స్మార్ట్ ఫోన్ Snapdragon 8 Gen 2 ఫాస్ట్ చిప్ సెట్ ను కలిగి ఉంటుంది. దీనికి జతగా 8GB LPDDR5X RAM మరియు 256GB UFS 3.1 ఇంటర్నల్ స్టోరేజ్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ లో 6.78 ఇంచ్ AMOLED ProXDR స్క్రీన్ ఉంటుంది. ఈ స్క్రీన్ 1.5K రిజల్యూషన్, 1-120 Hz డైనమిక్ రిఫ్రెష్ రేట్, LTPO4.0, ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ మరియు HDR10+ సపోర్ట్ లను కలిగి ఉంటుంది.
ఈ ఫోన్ లో వెనుక 50MP (Sony IMX890) ప్రధాన సెన్సార్, 8MP అల్ట్రా వైడ్ మరియు 2MP మ్యాక్రో సెన్సార్స్ కలిగిన ట్రిపుల్ రియర్ కెమెరా వుంది. ఈ ఫోన్ 4K వీడియో రికార్డింగ్ మరియు గొప్ప ఫోటోలు షూట్ చేసే సత్తా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ లో 5500 mAh బిగ్ బ్యాటరీ మరియు 100W SUPERVOOC ఫాస్ట్ చార్జ్ సపోర్ట్ కూడా ఉంటుంది.