OnePlus 10 Pro: ఇండియాలో లాంచ్ కి సిద్ధమవుతోంది ..BIS ఆమోదం పొందిన ఫోన్..!

Updated on 13-Jan-2022

ఇటీవల చైనాలో విడుదలైన OnePlus 10 Pro అతిత్వరలోనే ఇండియాలో లాంచ్ కావడానికి సిద్ధమవుతోంది. ఈ ఫోన్ BIS (బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్) ఆమోదం పొందింది. అంటే దీని అర్ధం త్వరలోనే ఈ ఫోన్ ఇండియాలో విడుదల అవుతుంది. ఈ లేటెస్ట్ వన్ ప్లస్ స్మార్ట్ ఫోన్ స్నాప్ డ్రాగన్ 8 gen1 మరియు భారీ కెమెరా సెట్టింగ్ వంటి మరిన్ని ఫీచర్లతో రీసెంట్ గా చైనాలో లాంచ్ అయ్యింది. ఈ ఫోన్ ఇప్పుడు BIS సర్టిఫికేషన్ పాస్ అయ్యిందంటే, అనుకున్న దానికంటే త్వరగానే ఇండియన్ మార్కెట్లోకి అడుగుపెడుతుంది.

ఈ లేటెస్ట్ అప్డేట్ ను ప్రముఖ టిప్‌స్టర్ అంకిత్ ట్విట్టర్‌ ద్వారా షేర్ చేశారు. అంకిత్ తన ట్విట్టర్ పోస్ట్ లో BIS వెబ్సైట్ లో కనిపిస్తున్న OnePlus 10 Pro యొక్క స్క్రీన్ షాట్ ను షేర్ చేశారు. ఈ జాబితాలోని మోడల్ NE2211 కాగా, ఇది చైనా వెర్షన్‌ మోడల్ నంబర్‌ N2210 కు  అనుగుణంగా ఉంది.

 

Disclaimer: Digit, like all other media houses, gives you links to online stores which contain embedded affiliate information, which allows us to get a tiny percentage of your purchase back from the online store. We urge all our readers to use our Buy button links to make their purchases as a way of supporting our work. If you are a user who already does this, thank you for supporting and keeping unbiased technology journalism alive in India.
Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :