OnePlus Nord 2 5G: మిడ్ రేంజ్ ధరలో జబర్దస్త్ స్మార్ట్ ఫోన్

Updated on 23-Jul-2021
HIGHLIGHTS

ఇండియాలో OnePlus Nord 2 5G స్మార్ట్ ఫోన్ లాంచ్

50MP SonyIMX766 సెన్సార్ తో వచ్చింది

వన్‌ప్లస్ నార్డ్ 2 5G మిడ్ రేంజ్ ధరలో జబర్దస్త్ స్మార్ట్ ఫోన్

ఇండియాలో OnePlus Nord 2 5G స్మార్ట్ ఫోన్ లాంచ్ అయ్యింది. వన్‌ప్లస్ నార్డ్ 2 5G మిడ్ రేంజ్ ధరలో జబర్దస్త్ స్మార్ట్ ఫోన్. ఈ ఫోన్ కేవలం మిడ్ రేంజ్ ధరలో వచ్చినా కూడా ప్రీమియం స్మార్ట్ ఫోన్లలో మాత్రమే కనిపించే 50MP SonyIMX766 సెన్సార్ తో వచ్చింది. ఈ స్మార్ట్ ఫోన్ వేగవంతమైన ప్రాసెసర్, బెస్ట్ కెమెరా ఫీచర్లు మరియు వేగవంతమైన ఛార్జింగ్ టెక్నాలజీ వంటి బెస్ట్ ఫీచర్లతో ఇండియన్ మార్కెట్లో  విడుదల చెయ్యబడింది.

OnePlus Nord 2 5G: ధర

వన్‌ప్లస్ నార్డ్ 2 5G యొక్క బేస్ వేరియంట్ రూ.27,999 రూపాయలతో ప్రారంభమవుతుంది. ఈ ఫోన్ మరిన్ని వేరియంట్స్ లో లభిస్తుంది. వన్‌ప్లస్ నార్డ్ 2 బ్లూ హేజ్, గ్రే సియారా మరియు గ్రీన్ ఉడ్స్ వంటి మూడు కలర్స్ లో లభిస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ యొక్క మొదటి సేల్ అమెజాన్ ప్రైమ్ డే సేల్ మొదటి రోజైన జూలై 26 నుండి మొదలవుతుంది.

OnePlus Nord 2 5G: ప్రత్యేకతలు

ఈ వన్‌ప్లస్ నార్డ్ 2 స్మార్ట్ ఫోన్ 6.43 -అంగుళాల FHD + రిజల్యూషన్ గల Fluid AMOLED డిస్ప్లే తో వుంటుంది మరియు ఇది 90Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ తో ఉంటుంది. ఇందులో, సెల్ఫీ కెమెరా కోసం పైన ఎడమ వైపున పంచ్ హోల్ డిజైన్ ని అందించింది. ఈ స్క్రీన్ 20: 9 ఎస్పెక్ట్ రేషియోని కలిగి ఉంది.

ఈ ఫోన్ మీడియాటెక్ Dimensity 1200-AI ప్రాసెసర్ శక్తితో వస్తుంది. ఇది ఆక్టా-కోర్ CPU మరియు ARM G77 MC9 GPU తో పనిచేస్తుంది. ఇది 12GB RAM మరియు 256GB UFS 3.1 2- లైన్ స్టోరేజ్ ఎంపికతో జత చేయబడుతుంది. ఇది ఆక్సిజన్ OS ఆధారితంగా ఆండ్రాయిడ్ 11 తో వస్తుంది.

ఇక కెమెరాల విషయానికి వస్తే, వన్‌ప్లస్ నార్డ్ 2 వెనుక భాగంలో ట్రిపుల్ కెమెరా సెటప్ తో వస్తుంది. ఈ సెటప్ లో ప్రాధమిక కెమెరా 50MP SonyIMX766 సెన్సార్ ని OIS ఫీచర్ f/1.88 అపర్చర్ తో అందించింది. ఈ మైన్ కెమెరా ఫోటోలు మరియు వీడియోలను చిత్రీకటించడంలో అద్భుతంగా వుంటుంది. దీనికి జతగా 8MP అల్ట్రా-వైడ్-యాంగిల్ కెమెరా, మోనో లెన్స్ లను జతచేసింది. ముందు భాగంలో, ఈ ఫోన్ పైభాగంలో ఉన్న పంచ్ హోల్ లోపల 32 MP సెల్ఫీ కెమెరాని SonyIMX615 సెన్సార్ తో అందించింది.

వన్‌ప్లస్ నార్డ్ 2 ఇన్ డిస్ప్లే  ఫింగర్ ప్రింట్ సెన్సార్ ని కలిగి వుంటుంది మరియు డ్యూయల్ స్టీరియో స్పీకర్లు, నోయిస్ క్యాన్సిలేషన్ సపోర్ట్ తో వస్త్తుంది. ఈ ఫోన్ 4,500 ఎమ్ఏహెచ్ బ్యాటరీని 65W వ్రాప్ ఛార్జ్ సపోర్ట్ తో వస్తుంది. ఈ ఛార్జింగ్ టెక్నాలజీతో కేవలం 15 నిముషాల ఛార్జింగ్ తో ఒక రోజుకు సరిపడిన ఛార్జ్ ను ఇవ్వగలదని వన్‌ప్లస్ తెలిపింది.              

Disclaimer: Digit, like all other media houses, gives you links to online stores which contain embedded affiliate information, which allows us to get a tiny percentage of your purchase back from the online store. We urge all our readers to use our Buy button links to make their purchases as a way of supporting our work. If you are a user who already does this, thank you for supporting and keeping unbiased technology journalism alive in India.
Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :