ONE DAY TO GO : రియల్మీ 64MP స్నాప్ డ్రాగన్ 855+ స్మార్ట్ ఫోన్ లాంచ్

HIGHLIGHTS

ఈ ఫోన్ పైన అందరూ కూడా భారీ అంచనాలను వేస్తున్నారు.

చాలా కాలంగా, అందరిని తన టీజింగ్స్ మరియు ముందస్తు అంచనాలతో ఊరిస్తూ వస్తున్న REALME X2 PRO యొక్క లాంచ్ డేట్ దగ్గరికి వచ్చేసింది. ఈ ఫోన్ను అత్యంత వేగవంతమైన మరియు ఉన్నతమైన ప్రాసెసర్ గా పేరుపొందిన స్నాప్ డ్రాగన్ 855+ SoC తో పాటుగా ఒక 64MP ప్రధాన కెమేరా కలిగిన క్వాడ్ కెమేరాతో తీసుకువస్తుండడంతో ఈ ఫోన్ పైన అందరూ కూడా భారీ అంచనాలను వేస్తున్నారు.

మరొక ముఖ్యమైన విష్యం ఏమిటంటే, బడ్జెట్ స్మార్ట్ ఫోన్లను తీసుకురావడంలో షావోమి సంస్థకు పోటాపోటీగా నడుస్తున్న సంస్థగా కూడా Realme పేరుగాంచింది. కాబట్టి, ముందుగా రియల్మీ తీసుకొచ్చిన అన్ని స్మార్ట్ ఫోన్లను కూడా ధర పరంగా పరిశీలీస్తే, దాదాపుగా అన్ని స్మార్ట్ ఫోన్లు కూడా తక్కువధరలోనే లాంచ్ అయ్యాయి. అదేవిధంగా, ఈ స్మార్ట్ ఫోన్ను కూడా చాలా గొప్ప ప్రత్యేకతలతో తీసుకొచ్చినా కూడా ధర పరంగా జాగ్రత్తలు తీసుకుంటుందని అంచనాలు వేస్తున్నారు. అయితే, ఇప్పటి వరకూ అధికారికంగా ఎటువంటి ప్రకటన చేయలేదు.    

రియల్మి ఎక్స్ 2 ప్రో :  చైనా ధరలు

గత నెల చైనాలో విడుదలైన ఈ స్మార్ట్ ఫోన్, మూడు వేర్వేరు స్టోరేజ్ వేరియంట్లలో విడుదల చెయ్యబడింది. దీని యొక్క ప్రత్యేక ఎడిషన్ కూడా ప్రారంభించబడింది. ఈ మొబైల్ ఫోన్ యొక్క 6 జిబి ర్యామ్ మరియు 64 జిబి స్టోరేజ్ వేరియంట్‌ను కంపెనీ RMB 2,599 ధరతో లాంచ్ చేసింది, అంటే సుమారు రూ .25,990, ఇది కాకుండా, దాని 8 జిబి ర్యామ్ మరియు 128 జిబి స్టోరేజ్ మోడల్‌ను ఆర్‌ఎమ్‌బి 2,799 ధరతో లాంచ్ చేశారు, అంటే సుమారు 27,990 రూపాయలు.  ఇది కాకుండా, దాని 12 జిబి ర్యామ్ మరియు 256 జిబి స్టోరేజ్ మోడల్‌ను ఆర్‌ఎమ్‌బి 3,199 ధరతో లాంచ్ చేశారు, అంటే సుమారు రూ .31,990. ఇది కాకుండా, ఈ మొబైల్ ఫోన్ యొక్క మాస్టర్ ఎడిషన్ 12 జీబీ ర్యామ్ మరియు 256 జీబీ స్టోరేజ్‌తో ఆర్‌ఎంబి 3,299 ధరతో లాంచ్ చేయబడింది, అంటే సుమారు 32,990 రూపాయలు.

రియల్మి ఎక్స్ 2 ప్రో : ప్రత్యేకతలు

ఈ రియల్మీ ఎక్స్ 2 ప్రో  ఫోనులో  ఒక ప్రధాన క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 855+ చిప్‌ సెట్ ఇవ్వబడింది. ఇది కాకుండా, మీరు ఈ మొబైల్ ఫోనులోఒక 6.5-అంగుళాల సూపర్ అమోలెడ్ డిస్ప్లేను కూడా పొందుతారు. అంతేకాదు, ఈ డిస్ప్లేని FHD + రిజల్యూషన్‌తో అందించింది. ఈ మొబైల్ ఫోన్‌లో, మీరు వన్‌ప్లస్ 7 ప్రో, వన్‌ప్లస్ 7 టి మరియు వన్‌ప్లస్ 7 టి ప్రో మొబైల్ ఫోన్‌ల మాదిరిగానే 90 Hz రిఫ్రెష్ రేట్‌ స్క్రీన్‌ను అందుకుంటారు మరియు  ఇది లిక్విడ్ కూలింగ్ ఫీచర్‌తో వస్తుంది. ముఖ్యంగా, ఇది ఒక 4000mAh సామర్థ్యం గల బ్యాటరీని 50W VOOC ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నలాజితో తీసుకొచ్చింది.

కెమెరా మొదలైన వాటి గురించి మాట్లాడితే, ఈ మొబైల్ ఫోన్‌లో మీకు క్వాడ్-కెమెరా సెటప్ లభిస్తోంది, ఇందులో మీకు 64 MP  ప్రధాన కెమెరా లభిస్తోంది, ఇది కాకుండా మీరు 8MP  అల్ట్రా-వైడ్ యాంగిల్ లెన్స్‌ తో పాటుగా  ఒక 13MP టెలిఫోటో లెన్స్‌తో పాటు 2MP డెప్త్ సెన్సార్‌ను కూడా పొందుతున్నారు. ఇది కాకుండా, మీరు ఫోన్‌లో ఇన్ డిస్ప్లే వేలిముద్ర సెన్సార్‌ను కూడా అందించింది  

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :