డ్యూయల్ డిస్ప్లే స్మార్ట్ ఫోన్ Nubia X అద్భుతం
స్నాప్ డ్రాగన్ 845 SoC మరియు 8GB వరకు ర్యామ్ సామర్ధ్యం
ZTE కంపెనీ ప్రతిష్టాత్మకంగా చైనాలో స్మార్ట్ ఫోన్, 6.26 మరియు 5.1 అంగుళాల డ్యూయల్ డిస్ప్లేలతో అలరిస్తుంది. కేవలం డ్యూయల్ డిస్ప్లేలు మాత్రమే దీని ప్రత్యేకత కాదు, ప్రస్తుత ఫ్లాగ్ షిప్ ప్రాసెసర్ అయినటువంటి స్నాప్ డ్రాగన్ 845 SoC, డ్యూయల్ రియర్ కెమెరా మరియు అత్యధికంగా 8GB వరకు ర్యామ్ సామర్ధ్యాన్ని కూడా కలిగి ఉంటుంది. ప్రస్తుతం ఈ స్మార్ట్ ఫోన్, కేవలం చైనాలో మాత్రమే అందుబాటులోవుంది. దీని యొక్క ముందస్తు అర్దర్లను చేసుకోవడానికి చైనాలో ఇది సిద్ధంగావుంది.
Surveyనుబియా X ప్రత్యేకతలు
ఈ నుబియా X ఫోన్, 19:9 ఆస్పెక్ట్ రేషీతో 1080×2280 పిక్సెళ్ళు గల ఒక 6.26 అంగుళాల ఫుల్ HD+ ప్రధాన డిస్ప్లే మరియు 19:9 ఆస్పెక్ట్ రేషీతో 720×1520 పిక్సెళ్ళు గల ఒక 5.1 అంగుళాల HD+ సెకండరీ డిస్ప్లే ని కలిగి ఉంటుంది. ఈ రెండు డిస్ప్లేలు కూడా కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 సంరక్షణతో అందిచబడ్డాయి మరియు 100 శాతం కలర్ పరిపూర్ణతను అందించగలవు. ఈ స్మార్ట్ ఫోన్, క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 845 SoC జతగా అడ్రినో 630 GPU శక్తితో పనిచేస్తుంది. ఇది ఆండ్రాయిడ్ 8.1 తో ఆధారితమైన నుబియా UI 6.0.2 తో నడుస్తుంది.
ఈ స్మార్ట్ ఫోన్ ఆప్టికల్స్ విషయానికివస్తే, ఇది వెనుకభాగంలో f /1.8 ఆపేర్చేరు కలిగిన 16MP ప్రధాన కెమేరాకి జతగా f/1.7 ఆపేర్చేరు కలిగిన 24MP డ్యూయల్ కెమేరా సెటప్పుతో వస్తుంది. ముందుభాగంలో ఎటువంటి కెమేరాని ఇందులో అందించలేదు. అయితే, ఈ స్మార్ట్ ఫోనులో వెనుక కూడా డిస్ప్లే వుంది కాబట్టి ఒకే కెమేరా వున్నా కూడా దానితోనే సెల్ఫీలను కూడా తీసుకోవచ్చు. ఈ ఫోనులో, వేగవంతమైన చార్జింగు 3.0 మద్దతునివ్వగల ఒక 3,800mAh బ్యాటరీని మనకు అందుతుంది.
నుబియా X ధరలు
ఈ డ్యూయల్ డిస్ప్లే స్మార్ట్ ఫోన్, మూడు వేరియంట్లలో లభిస్తుంది వాటి ధరలు ఈ క్రింది విధంగా వున్నాయి (చైనాలో)
6GB/64GB (బ్లాక్, గ్రే, గోల్డ్ ) – CNY 3,299 (మనకు సుమారు రూ. 35,000)
6GB/64GB (బ్లూ) – CNY 3,399 (మనకు సుమారు రూ. 36,000) ఈ రంగు వేరియంటుకి ధరను పెంచింది.
8GB/128GB (బ్లాక్, గ్రే,గోల్డ్) – CNY 3,699 (మనకు సుమారు రూ. 39,200)
8GB/128GB (బ్లూ) – CNY 3,799 (మనకు సుమారు రూ. 40,300) ఈ రంగు వేరియంటుకి ధరను పెంచింది.
ఇక అత్యధిక స్థాయి వేరియంట్ విషయానికివస్తే,
8GB/256GB (బ్లాక్, గ్రే, గోల్డ్) – CNY 4,199 (మనకు సుమారు రూ. 44,500)
8GB/128GB (బ్లూ విత్ గోల్డ్) – CNY 4,299 (మనకు సుమారు రూ. 45,600) ధరలతో ఉంచింది.
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile