షావోమి రెడ్మి 6 ప్రో ధర తగ్గింది : ఇప్పుడు రూ. 9,999 నుండి ప్రారంభం

HIGHLIGHTS

ఈ డివైజ్ యొక్క 4GB RAM మోడల్ ధర ఇప్పుడు రూ .11,999.

షావోమి రెడ్మి 6 ప్రో ధర తగ్గింది : ఇప్పుడు రూ. 9,999 నుండి ప్రారంభం

ముఖ్యాంశాలు:

Digit.in Survey
✅ Thank you for completing the survey!

1. Xiaomi Redmi 6 Pro ధర తగ్గింది.

2. ఈ స్మార్ట్ ఫోన్ యొక్క 3 జీబి ర్యామ్ వేరియంట్ ధర ఇప్పుడు రూ .9,999.

3. ఈ డివైజ్ యొక్క 4GB RAM మోడల్ ధర ఇప్పుడు రూ .11,999.

షావోమి యొక్క మరొక ప్రైస్ కట్ రోజు, ఈ వారంలో నాలుగో రోజు, ఈ చైనీస్ స్మార్ట్ ఫోన్ తయారీదారు దాని రెడ్మి 6 ప్రో స్మార్ట్ యొక్క యొక్క ధరలో శాశ్వత ధర డ్రాప్ ప్రకటించింది. రెడ్మి 6 ప్రో యొక్క 3 జీబి / 32 జీబి మోడల్ ఫోన్ ధర రూ. 11,499 నుండి ధర రూ .9,999 కి తగ్గించబడింది మరియు 4GB / 64GB వెర్షన్ రూ. 13,499 నుండి రూ. 11,999 ధరకి దిగొచ్చింది. ముందుగా, రెడ్మి నోట్ 5 ప్రో, మి A2 మరియు రెడ్మి Y2 – స్మార్ట్ ఫోన్ల పైన ధర తెగింపు ప్రకటించిన షావోమి ఇప్పుడు ఈ జాబితాలో రెడీమి 6 ని కూడా చేర్చింది. అంతేకాదు,  రేపు మరొక ప్రకటన కూడా చేస్తుంది మరియు ఇలాంటి ధోరణిలోనే మరో ప్రకటన ఉండవచ్చు, అది మరొక Xiaomi స్మార్ట్ ఫోన్ డిస్కౌంట్ గురించి ఉంటుంది.

రెడ్మి 6 ప్రో,  గత సంవత్సరం సెప్టెంబర్ లో  ప్రారంభించబడింది. ఈ స్మార్ట్ఫోన్ ఒక అల్యూమినియం బిల్డ్ కలిగి మరియు ఒక వెనుక-మౌంట్ వేలిముద్ర సెన్సార్ కలిగి వస్తుంది. ఇది క్వాల్కమ్ స్నాప్డ్రాగెన్ 625 SoC చేత శక్తిని కలిగి ఉంది మరియు 19: 9 డిస్ప్లే ఆస్పెక్టు రేషియాతో ఒక 5.84 అంగుళాల పూర్తి HD + 'నోచ్' స్క్రీన్ కలిగి ఉంటుంది. ఆప్టిక్స్ పరంగా, ఈ హ్యాండ్ సెట్ డ్యూయల్ వెనుక కెమెరా సేటప్పును  కలిగి ఉంది, అది EIS కి మద్దతిస్తుంది. ఒక 12MP సోనీ IMX 486 ప్రాధమిక సెన్సార్ మరియు వెనుక 5MP సెకండరీ శామ్సంగ్ సెన్సార్ ఉంది. ఈ హ్యాండ్సెట్ను 4000mAh బ్యాటరీతో మద్దతు అందించారు మరియు MIUI 9.6 తో నడుస్తుంది, ఇది Android Oreo పైన ఆధారపడి ఉంటుంది.

సంస్థ గతంలో దాని Redmi Y2, రెడ్మి నోట్ 5 ప్రో మరియు Mi A2 స్మార్ట్ఫోన్లు పైన ధర తగ్గింపును ప్రకటించింది. Redmi Y2 యొక్క 3GB RAM + 32GB స్టోరేజి వెర్షన్ ధర రూ .8,999తో , దాని మునుపటి ధర Rs 9,999 నుండి తగ్గించబడింది. ఈ హ్యాండ్ సెట్ యొక్క 4GB RAM + 64GB స్టోరేజి వేరియంట్ ఇప్పుడు రూ.11,999 నుంచి రూ .10,999 కి మారింది. అలాగే, మి A2 యొక్క 4GB RAM + 64GB  వెర్షన్ ఇప్పుడు రూ. 13,999 వద్ద ఉంది, అంతకుముందు జాబితాలో ఉన్న ధర 15,999. ఈ ఫోన్ యొక్క 6GB + 128GB వెర్షన్ కూడా రాయితీ అందుకుంది మరియు రూ .18,999 నుండి రూ .15,999 వరకు దిగివచ్చింది. రూ. 13,999 గతంలో విడుదల చేసిన ధర నుంచి రెడ్మి నోట్ 5 ప్రో యొక్క 4GB ర్యామ్, 64 GB స్టోరేజి ధర తగ్గి రూ .12,999 ధరతో స్థిరపడింది, . పరికరం యొక్క 6GB RAM + 64GB స్టోరేజ్ మోడల్ ఇప్పుడు రూ. 13,999 గా ఉంది.అయితే, ఇంతకుమునుపు దీని ధర రూ .15,999గా ఉంది.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo