Samsung Galaxy M40 ఇక ఓపెన్ సేల్ కి అందుబాటులో

బై Raja Pullagura | పబ్లిష్ చేయబడింది 24 Jun 2019
HIGHLIGHTS
  • అమేజాన్ మరియు samsung.com నుండి ఓపెన్ సేల్ ద్వారా అమ్ముడవుతోంది.

  • చైనా రైవల్స్ ను ఎదుర్కోవడానికి శామ్సంగ్ సంధించిన అస్త్రంగా, ఈ గెలాక్సీ M సిరీస్ గురించి చెప్పొచ్చు.

Samsung Galaxy M40 ఇక ఓపెన్ సేల్ కి అందుబాటులో

చైనా రైవల్స్ ను ఎదుర్కోవడానికి శామ్సంగ్ సంధించిన అస్త్రంగా, ఈ గెలాక్సీ M సిరీస్ గురించి చెప్పొచ్చు. ఈ సిరిస్ నుండి కొత్తగా విడుదలైనటువంటి గెలాక్సీ M40 స్మార్ట్ ఫోన్, ఒక ట్రిపుల్ రియర్ కెమేరా  సెటప్పును మాత్రమేకాకుండా, ఇన్ఫినిటీ O అమోలెడ్ డిస్ప్లే, 3500mAh భారీ బ్యాటరీ మరియు స్నాప్ డ్రాగన్ 675 ఆక్టా కోర్ ప్రాసెసర్ వంటి ప్రత్యేకతలతో అత్యంత సరసమైన ధరలో లభిస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ వెనుక కెమేరాతో సూపర్ స్లోమోషన్ మరియు స్లోమోషన్ వీడియోలను అద్భుతంగా చిత్రీకరించవచ్చు. ఈ స్మార్ట్ ఫోన్ ఇప్పటివరకూ ఫ్లాష్ సేల్ ద్వారా అమ్ముడవగా,ఇకనుండి  అమేజాన్ మరియు samsung.com నుండి ఓపెన్ సేల్ ద్వారా అమ్ముడవుతోంది.  

శామ్సంగ్ గెలాక్సీ M40 ధర

శామ్సంగ్ గెలాక్సీ M40 -  6GB + 128GB - Rs.19,990

శామ్సంగ్ గెలాక్సీ M40 ప్రత్యేకతలు

శామ్సంగ్ గెలాక్సీ M40 స్మార్ట్ ఫోన్ 2340 x 1080 పిక్సెళ్ళ రిజల్యూషన్ అందించగల ఒక 6.3 అంగుళాల ఇన్ఫినిటీ - O డిస్ప్లేతో అందించబడుతుంది. అలాగే, ఇది ఒక స్నాప్ డ్రాగన్ 675 ఆక్టా కోర్ ప్రొసెసరుతో నడుస్తుంది. ఈ ప్రొసెసరు  ట్రిపుల్ రియర్ కెమేరాకు చక్కగా అనుకూలిస్తుంది. ఈ ఫోన్, ఆండ్రాయిడ్ 9 ఫై  పైన ఆధారితంగా సరికొత్త శామ్సంగ్ one UI  పైన నడుస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ ఒక  3500 mAh బ్యాటరీతో వస్తుంది. అయితే, ఇది 6GB ర్యామ్ జతగా 128GB  వేరియంటుతో మాత్రమే వస్తుంది. అలాగే, SD కార్డు ద్వారా 512GB వరకూ స్టోరేజిని పెంచుకునే సామర్ధ్యంతో వస్తుంది.

ఇక కెమెరావిభగానికి వస్తే, ఇది వెనుక భాగంలో 32MP +5MP+8MP  ట్రిపుల్ కెమేరా సేటప్పుతో వస్తుంది. ఇందులో 32MP ప్రధాన కెమరా ఒక f/1.7 అపర్చరుతో  ఉంటుంది. ఇంకా 5MP కెమేరా Live ఫోకస్ కోసం మరియు 8MP కెమేరా అల్ట్రా వైడ్ యాంగిల్ షాట్లకోసం ఉపయోగపడుతుంది. ఇక ముందుభాగంలో సెల్ఫీల కోసం 16MP కెమెరాని అందించారు. సెల్ఫీలను క్లిక్ చేయడంతో పాటుగా ఇది పేస్ రికగ్నైజేషన్ కోసం కూడా ఉపయోగపడుతుంది. ఇందులో అందించిన వెనుక కెమెరాతో సూపర్ స్లొమాషన్ వీడియోలను, అదీకూడా 240fps వద్ద తీసుకోవచ్చు. ఈ ఫోన్ బాక్స్ లో మీకు ఒక టైప్ -C ఇయర్ ఫోన్ కూడా లభిస్తుంది.       

శామ్సంగ్ గెలాక్సీ M40 Key Specs, Price and Launch Date

Price:
Release Date: 11 Jun 2019
Variant: 128GB
Market Status: Launched

Key Specs

  • Screen Size Screen Size
    6.3" (1080 x 2340)
  • Camera Camera
    32 + 8 + 5 | 16 MP
  • Memory Memory
    128GB/6GB
  • Battery Battery
    3500 mAh
Raja Pullagura
Raja Pullagura

Email Email Raja Pullagura

Follow Us Facebook Logo Facebook Logo

About Me: Crazy about tech...Cool in nature... Read More

Tags:
samung galaxy m40 galaxy m40 sale galaxy m40 latest news galaxy m40 latest price
Advertisements

ట్రెండింగ్ ఆర్టికల్స్

Advertisements

LATEST ARTICLES మొత్తం చూపించు

Advertisements
Samsung Galaxy M31 (Ocean Blue, 6GB RAM, 128GB Storage)
Samsung Galaxy M31 (Ocean Blue, 6GB RAM, 128GB Storage)
₹ 14999 | $hotDeals->merchant_name
OnePlus Nord 2 5G (Blue Haze, 8GB RAM, 128GB Storage)
OnePlus Nord 2 5G (Blue Haze, 8GB RAM, 128GB Storage)
₹ 29999 | $hotDeals->merchant_name
Samsung Galaxy M21 2021 Edition (Arctic Blue, 4GB RAM, 64GB Storage) | FHD+ sAMOLED | 6 Months Free Screen Replacement for Prime (SM-M215GLBDINS)
Samsung Galaxy M21 2021 Edition (Arctic Blue, 4GB RAM, 64GB Storage) | FHD+ sAMOLED | 6 Months Free Screen Replacement for Prime (SM-M215GLBDINS)
₹ 11999 | $hotDeals->merchant_name
Redmi 9A (Nature Green, 2GB RAM, 32GB Storage) | 2GHz Octa-core Helio G25 Processor | 5000 mAh Battery
Redmi 9A (Nature Green, 2GB RAM, 32GB Storage) | 2GHz Octa-core Helio G25 Processor | 5000 mAh Battery
₹ 6799 | $hotDeals->merchant_name
OnePlus Nord CE 5G (Charcoal Ink, 6GB RAM, 128GB Storage)
OnePlus Nord CE 5G (Charcoal Ink, 6GB RAM, 128GB Storage)
₹ 22999 | $hotDeals->merchant_name
DMCA.com Protection Status