శామ్సంగ్ గెలాక్సీ M 20 పైన Rs.1000 డిస్కౌంట్

HIGHLIGHTS

శామ్సంగ్ గెలాక్సీ M 20 పైన Rs.1000 డిస్కౌంట్

ఈ సంవత్సరం జనవరిలో, శామ్సంగ్ తన గెలాక్సీ M20 ని  భారతదేశంలో ప్రారంభించింది. ఈ ఫోన్ను కంపెనీ రెండు వేరియంట్లలో లాంచ్ చేసింది. వాటిలో ఒకటి 4GB ర్యామ్ మరియు 64 జిబి స్టోరేజ్ వేరియంట్ ధర రూ .12,999 కాగా, 3 GB ర్యామ్ మరియు 32 GB స్టోరేజ్ వేరియంట్ను రూ .10,990 ధరతో విడుదలచేసింది.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

అయితే,  ఇప్పుడు ఈ గెలాక్సీ M20 ధరలో 1000 రూపాయలు తగ్గింపును అందించింది. అంటే, ఇప్పుడు 4 జిబి ర్యామ్ వేరియంట్ రూ .11,990 ధరకు మరియు  3 జిబి ర్యామ్ వేరియంట్ 9,990 ధరతో కొనుగోలు చేయవచ్చు. ఈ స్మార్ట్ఫోన్ను అమెజాన్ ఇండియా నుండి ఈ ధరలకు కొనుగోలు చేయవచ్చు. గత నెలలోనే, ఈ స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 9.0 పై అప్డేటును కూడా  పొందింది.

శామ్సంగ్ గెలాక్సీ M 20 : ప్రస్తుత ధరలు    

1. శామ్సంగ్ గెలాక్సీ M20 ( 3GB + 32GB వేరియంట్) ధర – Rs. 9,990

2. శామ్సంగ్ గెలాక్సీ M20 ( 4GB + 64GB వేరియంట్) ధర – Rs. 11,990

శామ్సంగ్ గెలాక్సీ M20 స్పెసిఫికేషన్స్

ఇక గెలాక్సీ M20 గురించి చూస్తే , ఇది 2340x 1080 రిజల్యూషనుతో, 19.5 :9 యాస్పెక్ట్ రేషియో గల కొంచెం పెద్దదైన ఒక 6.3 – అంగుళాల FHD+ డిస్ప్లేతో వస్తుంది. ఇది కూడా, ఒక  వాటర్ డ్రాప్ నోచ్ వలె కనిపించే, ఇన్ఫినిటీ – V  డిస్ప్లేతో వస్తుంది. ఇది 90% స్క్రీన్ టూ బాడీ రేషియాతో వస్తుంది. ఇది 1.8GHz డ్యూయల్ కొర్ జతగా 1.6 హెక్సాకోర్ కలిపిన, క్లాక్ చేయబడిన Exynos 7904 ఆక్టా కోర్ ప్రాసెసర్ జతగా Mali-G71 MP2 GPU శక్తితో వస్తుంది. ఈ ఫోన్, 3GB + 32GB స్టోరేజి మరియు 4GB + 64GB వంటి రెండు వేరియంట్లలో లభిస్తుంది మరియు ఒక మెమొరీ కార్డ్ ద్వారా 512GB వరకు స్టోరేజిని పెంచుకునే వీలును కూడా కలిగి ఉంటుంది. ఇది డ్యూయల్ VoLTE సిమ్ ఫిచరుతో వస్తుంది.

ఇక కెమేరా విభాగానికి వస్తే, ఈ స్మార్ట్ ఫోన్ వెనుకభాగంలో f/1.9 అపర్చరు గల ఒక 13MP సెన్సారుకు జతగా 120 డిగ్రీల 5MP అల్ట్రా – వైడ్ యాంగిల్ సెన్సరుతో అనుసంధానించిన డ్యూయల్ కెమేరా సేటప్పుతో  వస్తుంది. ముందు, f/2.0 అపర్చరు8 ఒక 8 MP కెమేరాతో వస్తుంది మరియు ముందు ఇన్ డిస్ప్లే ఫ్లాష్ తో వస్తుంది. ఇందులో,  5000mAh బ్యాటరీని అందిచారు మరియు ఇది పేస్ అన్లాక్ మరియు ఫింగర్ ప్రింట్ సెన్సారుతో వస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్,శామ్సంగ్ v9.5 ఆధారితంగా ఆండ్రాయిడ్ 8.1.0 OS పైన నడుస్తుంది. 

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile