ఇక ఫోన్ రింగింగ్ 25 సెకన్లు మాత్రమే

HIGHLIGHTS

టెలికం సంస్థలు కాల్ రింగింగ్ టైం ను 35-40-సెకన్ల నుండి అమాంతంగా 25 సెకన్లకు తగ్గించాయి.

ఇక ఫోన్ రింగింగ్ 25 సెకన్లు మాత్రమే

టెలికం సంస్థలు తమ రెవిన్యూ కోసం అనేక కొత్త ప్లాన్లను అమలు చేస్తున్నాయి. ఇప్పుడు వోడాఫోన్ మరియు భారతీ ఎయిర్టెల్ రెండు టెలికం సంస్థలు కూడా తమ కాల్ రింగింగ్ టైం ను 35-40-సెకన్ల నుండి అమాంతంగా 25 సెకన్లకు తగ్గించాయి. ఈ నెట్వర్క్ నుండి కాల్ చేసేవారి కాల్ ను కేవలం 25 సెకన్ల లోపలే అటెండ్ చేయాలి లేకుంటే అది మిస్డ్ కాల్ కింద మారుతుంది. ఇంకేముంది ఎవరు ఫోన్ చేశారో, ఎందుకు చేశారో తెలుసుకోవాంటే మీరు తిరిగి కాల్స్ చేయాల్సి ఉంటుంది.       

Digit.in Survey
✅ Thank you for completing the survey!

వాస్తవానికి, ఇంటర్ కనెక్షన్ యూసేజ్ ఛార్జ్ (IUC) కారణంగా, అందరికంటే ముందుగా ఇటీవల జియోనే  తమ కాల్ రింగింగ్ టైం ను 20 నిముషాలకు తగ్గించిందని, ఆతరువాత 5 సెకన్లు పెంచి దాన్ని 25 సెకన్ల వద్ద స్థిరంగా ఉంచిందని, దానికి అనుగుణంగానే వోడాఫోన్ మరియు భారతీ ఎయిర్టెల్ రెండు టెలికం సంస్థలు కూడా తమ కాల్ రింగింగ్ టైం ను 25 సెకన్లకు తగ్గించినట్లుగా తెలుస్తోంది. ఈ విషయాన్న ముందుగా  ET తెలిపింది. దీనిప్రకారంగా, ఇప్పుడు అన్ని ప్రధాన ప్రైవేట్ తెలికం సంస్థలు యొక్క కాల్ రింగింగ్ సమయం కేవలం 25 సెకన్లగా ఉండనుంది.    

అసలు ఎందుకు ఇలా చేస్తున్నారని గమనిస్తే, TRAI టెలికం రెగ్యులేటరీ అధారిటీ ఆఫ్ ఇండియా అనుసారం ప్రతి టెలికం సంస్థ కూడా ఇంటర్ కనెక్షన్ యూసేజ్ ఛార్జ్ (IUC) చెల్లించాల్సి ఉంటుంది. ఇదేమిటంటే, తమ నెట్వర్క్ కి కాల్ చేసే ఇతర నెటర్క్ లు ఇన్ కమింగ్ కాల్ కోసం ఈ ఇంటర్ కనెక్షన్ యూసేజ్ ఛార్జ్ చెల్లించాల్సి ఉంటుంది. కాబట్టి, రింగింగ్ సమయాన్ని తగ్గిస్తే, ఈ కాల్ అటెండ్ చేయకపోయినట్లయితే వారు తిరిగి కాల్ చేస్తారు కాబట్టి, ఆ టెలికం సంస్థకు (IUC) చెలించాల్సి వస్తుంది. అందుకే ఈ విధంగా చేస్తున్నారని తెలుస్తోంది. అయితే, ఇంటర్నెషసనల్ స్టాండర్డ్స్ ప్రకారం, 25 నిముషాలు రింగింగ్ కోసం తగిన కాలమే అని జిఓ చెబుతున్నట్లు తెలుస్తోంది.                                                  

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo