OPPO F11 PRO పైన రూ.4,000 భారీ డిస్కౌంట్

OPPO F11 PRO పైన రూ.4,000 భారీ డిస్కౌంట్
HIGHLIGHTS

ఈ ఫోన్, వేనుక ఒక ప్రధాన 48MP కెమెరాను కలిగి ఉంటుంది.

ఇది 48MP కెమెరాని హ్యాండిల్ చేయగల ఒక మీడియాటెక్ హీలియో P70 ప్రాసెసరుతో వస్తుంది.

ఈ ఫోన్ ఇప్పుడు అమేజాన్ ఇండియా నుండి కేవలం రూ. 20,999 ధరతో అమ్ముడవుతోంది.

ఒప్పో నుండి ఒక 48 MP ప్రధాన కెమేరా మరియు రైజింగ్ సెల్ఫీ కెమెరా ఫీచర్లతో వచ్చిన, OPPO F11 PRO యొక్క ధరలో భారీ డిస్కౌంట్ ప్రకటించింది. ఈ ఫోన్,  వేనుక ఒక ప్రధాన 48MP కెమెరాను కలిగి ఉంటుంది. అలాగే, ఇది 48MP కెమెరాని హ్యాండిల్ చేయగల ఒక మీడియాటెక్ హీలియో P70 ప్రాసెసరుతో వస్తుంది. ఈ ఫోన్ ఇప్పుడు అమేజాన్ ఇండియా నుండి కేవలం రూ. 20,999 ధరతో అమ్ముడవుతోంది. వాస్తవానికి, దీన్ని రూ.24,999 ధరతో విడుదల చేశారు.                    

OPPO F11 Pro ధర మరియు ఆఫర్లు

ఈ స్మార్ట్ ఫోన్  6GB + 64GB వేరియంట్తో మాత్రమే ఉంటుంది, ఇక దీని ప్రస్తుత ధర రూ. 20,990 గా ఉంటుంది. ఈ ఫోన్, అమేజాన్ నుండి లభిస్తుంది. ఇక ఆఫర్ల విషయానికి వస్తే, అన్ని ప్రధాన బ్యాంకుల కార్డ్స్ పైన EMI ఎంపికతో కొనేవారికి No Cost EMI కూడా అందుబాటులో ఉంటుంది. ఎక్సేంజి పైన కొనేవారికి ఎక్స్ట్రా బోనస్ కూడా లభిస్తుంది. 

OPPO F11 PRO ప్రత్యేకతలు           

ఈ స్మార్ట్ ఫోన్, ఒక 90.90% బాడీ టూ స్క్రీన్ రేషియో కలిగి 2340X1080 పిక్సెళ్ళ రిజల్యూషన్ అందించగల ఒక 6.5 అంగుళాల FHD + డిస్పీలతో వస్తుంది. ఈ ఫోన్ 2.1GHz క్లాక్ స్పీడు కలిగినఒక  మీడియాటెక్ హీలియో P70 ఆక్టా కోర్ ప్రోసెసరుతో అందించబడింది. ఈ ప్రొసెసరుకు జతగా 6GB ర్యామ్ మరియు 64GB స్టోరేజి కూడా అందించబడింది. ఒక SD కార్డుతో 256GB వరకు స్టోరేజి సామర్ధ్యాన్ని పెంచుకోవచ్చు. అలాగే, డ్యూయల్ 4G సపోర్టుతో వస్తుంది మరియు ఆండ్రాయిడ్ 9 ఫై OS పైన నడుస్తుంది.                   

ఇక కెమెరా విభాగానికి వస్తే, OPPO F11 Pro వెనుక ఒక 48MP + 5MP సెటప్ కలిగిన డ్యూయల్ -రియర్  కెమెరాతో వస్తుంది. ఇంకా ఈ ఫోను కెమెరా ఒక పెద్ద F1.79 ఎపర్చరు లెన్స్ తో ఉంటుంది. ఇది చీకటిలో కూడా ప్రకాశవంతమైన ఫోటోలను తీసుకోవడానికి, దానిలో ముందుగా అందించిన అల్ట్రా నైట్ మోడ్ తో  దాని భారీ 48MP వెనుక సెన్సార్ను కలుపుతుంది. ఈ 48MP కెమెరా ఒక Sony IMX586 సెన్సారుతో వస్తుంది. ఈ ఫోన్ లో ఉపయోగించిన 4-ఇన్ -1 టెక్నాలజీ నాలుగు పిక్సెల్లను కలగలిపి ఒకటిగా చేస్తుందని, OPPO సూచించింది, తద్వారా ఫోటోలో వుండే సెన్సిటివ్ ప్రాంత పరిమాణాన్ని సమర్థవంతంగా అధికం చేసింది. అంతేకాక, ఇది 1 / 2.25 అంగుళాల సెన్సర్ను కూడా కలిగి ఉంది, ఇది తక్కువ కాంతి పరిస్థితుల్లో తీసుకునే చిత్రాల యొక్క నాణ్యతను కూడా మరింత మెరుగుపర్చడానికి సహాయం చేస్తుంది.  ముదుభాగంలో, ఒక 16MP కెమేరాని పాప్ అప్ స్లఫై కెమేరాగా అందించారు దీన్ని సంస్థ రైజింగ్ సెల్ఫీ కెమేరాగా చెబుతోంది. 

OPPO F11 Pro ఫోన్ 20 నిమిషాల పాటు ఛార్జింగ్ సమయాన్ని తగ్గిస్తుంది మరియు మరింత ఛార్జింగ్ వేగాన్ని  అందిస్తుంది , ఇది VOOC 3.0 సాంకేతికతను ఇందులో అందించింది. F11 సిరీస్ 4,000mAh బ్యాటరీని కలిగి ఉంది, గత తరంతో పోలిస్తే ఈ బ్యాటరీ సామర్థ్యం 14% వరకూ పెరిగింది.OPPO యొక్క అంతర్గత పరీక్షలలో, ప్రతిరోజు ఉపయోగం కోసం బ్యాటరీ 15.5 గంటల వరకు, పూర్తిగా నిరంతర వీడియో కోసం 12 గంటలు మరియు భారీ గేమ్స్ ఆడటానికి 5.5 గంటలకు ఒక పూర్తి-ఛార్జ్ పనిచేస్తుంది.  ఈ ఫోన్ థండర్ బ్లాక్ మరియు అరోరా గ్రీన్ వంటి రెండు రంగులలోలభిస్తుంది.   

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo