ఒప్పో F11 పైన భారీ డిస్కౌంట్ : ఏకంగా 6,000 రుపాయల డిస్కౌంట్

Updated on 13-Jan-2020
HIGHLIGHTS

ఈ ఫోన్ ఎన్నడూలేనంత చౌక ధరకు అమ్ముడవుతోంది.

గత సంవత్సరం మే నెలలో ఇండియాలో ఒక ప్రధాన 48MP డ్యూయల్ రియర్ కెమెరాతో తీసుకొచ్చినటువంటి, ఒప్పో ఎఫ్ 11 యొక్క 6 జిబి ర్యామ్ వేరియంట్ ధరను తగ్గించింది మరియు ఇప్పుడు కంపెనీ ఒప్పో ఎఫ్ 11 యొక్క 6 జిబి ర్యామ్ వేరియంట్ పైన భారీ డిస్కౌంట్ ప్రకటించింది. వాస్తవానికి, ఈ ఫోన్ను రూ .19,990 ధర వద్ద లాంచ్ చేశారు. తరువాత, ఈ స్మార్ట్‌ ఫోన్ ధరను రూ .17,990 కు తగ్గించారు. దాని తరువాత, ఒప్పో ఎఫ్ 11 యొక్క 6 జిబి ర్యామ్ మరియు 128 జిబి స్టోరేజ్ వేరియంట్  రూ .16,990 కి తగ్గించబడి మరియు అదే ధర వద్ద నిలకడగా అమ్ముడవుతోంది.  కానీ, ప్రస్తుతం అమెజాన్ ఇండియా ఈ ఫోన్ను గరిష్టంగా 6,000 డిస్కౌంటుతో  కేవలం రూ .13,990 ధరతో అమ్ముడు చేస్తోంది.

ఒప్పో ఎఫ్ 11 ప్రోలో, మీరు 6.53-అంగుళాల FHD + (1080×2340 పిక్సెల్స్) ఎల్‌సిడి డిస్‌ప్లేను 19.5: 9 కారక నిష్పత్తులతో మరియు 90.90 శాతం స్క్రీన్ టు బాడీ రేషియోతో పొందుతారు. ఈ ఫోన్ 4,000 mAh బ్యాటరీని కలిగి ఉంది, ఇది VOOC ఫ్లాష్ ఛార్జ్ 3.0 ఫాస్ట్ ఛార్జింగుకు మద్దతు ఇస్తుంది. ఇందులో 6 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్‌తో ఆక్టా-కోర్ మీడియాటెక్ హెలియో పి 70 ప్రాసెసర్‌ తో నడుస్తుంది. ఆండ్రాయిడ్ 9.0 పై ఆధారంగా స్మార్ట్ఫోన్ అవుట్ ఆఫ్ బాక్స్ కలర్ ఓస్ 6.0 లో నడుస్తుంది. వెనుక వైపు డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది.

ఇక కెమేరాల విషయానికి వస్తే, ఇందులో ఒక 48MP మరియు జతగా ఒక 5MP డెప్త్ సెన్సార్ జతకలిపిన ఒక డ్యూయల్ రియర్ కెమెరాతో వస్తుంది. ముందు భాగంలో, ఒక 16MP సెల్ఫీ కెమేరాని మంచి కెమేరా ఫీచరాలతో అందించింది.       

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :