4D గేమింగ్ ఫోన్ అయిన Honor Play పైన రూ.9000 భారీ డిస్కౌంట్

HIGHLIGHTS

హువావే యొక్క కిరిణ్ 970 ప్రాసెసర్ శక్తితో ఇది పనిచేస్తుంది.

గేమింగ్ ప్రియుల కోసం, హానర్ ప్రత్యేకంగా అందించిన ఈ హానర్ ప్లే స్మార్ట్ ఫోన్, ఉత్తమైన 4D గేమింగ్ అనుభూతుని అందిస్తుంది. అంతేకాకుండా, ఇందులో మంచి డ్యూయల్ రియర్ కెమేరా సేటప్పుతో పాటుగా 16MP సెల్ఫీ కెమేరా కూడా మంచి కెమేరా అనుభూతిని అందిస్తాయి. వాస్తవానికి, Rs. 21, 999 ధరతో తీసుకొచ్చిన  ఈ స్మార్ట్ ఫోన్ పైన అమేజాన్ ఇండియా అత్యధికంగా 9,000 రూపాయల డిస్కౌంట్ అందించింది. అంటే, ఇప్పుడు కేవలం రూ.12, 999 రూపాయల ధరతో కొనుగోలు చేయవచ్చు.

హానర్ ప్లే ధరలు

  1. హానర్ ప్లే  (4GB + 64GB ) ధర : Rs. 12,999  

  2. హానర్ ప్లే  (6GB + 64GB ) ధర : Rs. 14,999  

హానర్ ప్లే ప్రత్యేకతలు

హానర్ ప్లే ఒక 6.3 అంగుళాల పూర్తి HD + IPS LCD డిస్ప్లే తో ఉంది, ఇది 1080 × 2340 పిక్సల్స్ మరియు 19.5: 9 యాస్పెక్ట్ రేషియో కలిగివుంది. ఇది కిరిణ్ 970 AI చిప్సెట్ శక్తితో మరియు టర్బో GPU తో పనిచేస్తుంది. గొప్ప గేమింగ్ అనుభూతికోసం గేమింగ్ షాక్ తో 4D గేమింగ్ అనుభూతుని పొందుతారు . ఇంకా పూర్తి వివరాల కోసం మరియు కొనడానికి, Honor Play పైన Click చేయండి.

న్యూరల్ నెట్ వర్క్ ప్రాసెస్ తో కూడిన హువావే యొక్క కిరిణ్ 970 ప్రాసెసర్ శక్తితో ఇది పనిచేస్తుంది.ఈ రెండు వేరియంట్లు కూడా 64జీబీ ఇన్ బిల్ట్ స్టోరేజి తో పాటుగా స్టోరేజి సామర్ధ్యాన్నిపెంచుకునే విధంగా  మెమొరీ స్లాట్ తో ఆఫర్ చేస్తున్నాయి. 16-మెగా పిక్సెల్ మరియు 2-మెగా పిక్సెల్ యూనిట్స్ తో కూడిన డ్యూయల్-కెమేరా ని ఫోన్ వెనుక భాగం లో ప్రధాన కెమెరాగా అమర్చారు. చాల ఫోన్లలో ఉన్న విధంగానే , వివిధ రకాల సీన్లను గుర్తించే విధంగా దేనిలో సీన్ రికగ్నైజింగ్ ని అందించారు . ఇది తనంతట తానే కెమేరా సెట్టింగులను మార్చుకుంటుంది.  హానర్ ప్లే స్పీడ్ చార్జింగ్ తో పనిచేసే ఒక 3750mAh బ్యాటరీని కలిగి ఉంది.  AI 3డి సరౌండ్ సౌండ్ మరియు AI 4D స్మార్ట్ షాక్, ఇంకా జిపియూ టర్బో లు ఇతర గేమింగ్ సెంట్రిక్ ఫీచర్స్ గా ఉన్నాయి.

 

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :