Nothing Phone 4b: అబ్బురపరిచే సరికొత్త డిజైన్ తో లాంచ్ అవుతోంది.!

HIGHLIGHTS

కేవలం స్కెచ్ డిజైన్ తో అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ లాంచ్ కోసం టీజింగ్ చేసిన నథింగ్

ఈరోజు ఈ ఫోన్ డిజైన్ మరియు ఫీచర్స్ వెల్లడించే టీజర్ వీడియో రిలీజ్ చేసింది

ఈ ఫోన్ నథింగ్ సబ్ బ్రాండ్ CMF ఫోన్ మరియు నథింగ్ ఫోన్ రెండింటి కలబోతగా వస్తున్నట్టు అనిపిస్తుంది

Nothing Phone 4b: గత కొన్ని రోజులుగా కేవలం స్కెచ్ డిజైన్ తో అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ లాంచ్ కోసం టీజింగ్ చేసిన నథింగ్, ఈరోజు ఈ ఫోన్ డిజైన్ మరియు ఫీచర్స్ వెల్లడించే టీజర్ వీడియో రిలీజ్ చేసింది. ఈ ఫోన్ కొత్త టీజర్ వీడియో చూడగానే, ఈ అప్ కమింగ్ నథింగ్ ఫోన్ అబ్బురపరిచే సరికొత్త డిజైన్ తో లాంచ్ అవుతోందని ఎవరైనా చెబుతారు. అంతేకాదు, ఈ ఫోన్ నథింగ్ సబ్ బ్రాండ్ CMF ఫోన్ మరియు నథింగ్ ఫోన్ రెండింటి కలబోతగా వస్తున్నట్టు అనిపిస్తుంది.

Nothing Phone 4b: లాంచ్

నథింగ్ ఫోన్ 4బి ఇండియాతో పాటు ప్రపంచ వ్యాప్తంగా లాంచ్ అవుతోంది. ఈ ఫోన్ జులై 7వ తేదీ మధ్యాహ్నం 3:30 గంటలకు ఇండియాలో లాంచ్ అవుతుంది. ఈ ఫోన్ ఫ్లిప్ కార్ట్ ద్వారా సేల్ కి అందుబాటులోకి వస్తుంది. ఈ ఫోన్ లాంచ్ కోసం ఫ్లిప్ కార్ట్ ప్రత్యేకమైన టీజర్ పేజీ ద్వారా టీజింగ్ చేస్తోంది.

ఈరోజు నథింగ్ గ్లోబల్ ఎక్స్ అకౌంట్ నుంచి కొత్త టీజర్ వీడియో విడుదల చేసింది. ఈ వీడియోలో ఫోన్ డిజైన్ మరియు ఫీచర్స్ ను కూడా వెల్లడించింది.

Also Read: JBL New Live 780 NC: ప్రైమ్ డే సేల్ నుంచి భారీ లాంచ్ ఆఫర్స్ తో సేల్ అవుతుంది.!

Nothing Phone 4b: ఫీచర్స్

నథింగ్ ఫోన్ 4b స్మార్ ఫోన్ CMF ఫోన్ మరియు నథింగ్ 4 సిరీస్ రెండింటి మిళితమైన డిజైన్ తో ఉన్నట్లు క్లియర్ గా కనిపిస్తోంది. ఈ ఫోన్ CMF నుంచి నథింగ్ అందించిన ఫోన్ మాదిరిగా స్క్రూ ఫిట్ డిజైన్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ చాలా స్లీక్ కనిపిస్తోంది మరియు న్యూ కలర్ తో దర్శనమిచ్చింది.

కొత్త టీజర్ ప్రకారం, ఈ ఫోన్ లో వెనుక ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఈ ఫోన్ కెమెరా మరియు ఇండికేటర్ లైట్ కోసం పెద్ద బంప్ అందించింది. ఇది ఫోన్ డిజైన్ ను మరింత అందంగా కనిపించేలా చేసింది. లో వాల్యూమ్ అండ్ పవర్ బటన్ లను మరింత పెద్దగా ఉండేలా డిజైన్ చేసింది. ఇదే కాదు SIM కార్డ్ ట్రే ను కూడా ఫోన్ అడుగు భాగంలో సెట్ చేసింది.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :