Nothing phone 4b launched in india know the price and features
Nothing phone 4b: నథింగ్ ఈరోజు కొత్త సిరీస్ ఫోన్ లాంచ్ చేసింది. ఈ ఫోన్ ను సరికొత్త డిజైన్ మరియు ఫీచర్స్ విడుదల చేసింది. ఈ ఫోన్ నథింగ్ మరియు CMF ఫోన్స్ సంగమంలా ఉంటుంది. ఈ ఫోన్ లో ప్రత్యేకమైన నోటిఫికేషన్ లైట్, ఫోన్ ను విప్పడానికి వీలుగా స్క్రూలు మరియు మినిమల్ సెటప్ తో లాంచ్ చేసింది. ఈ లేటెస్ట్ నొథింగ్ స్మార్ట్ ఫోన్ ప్రైస్ అండ్ ఫీచర్స్ ఎలా ఉన్నాయో వివరంగా తెలుసుకుందామా.
నథింగ్ ఈ స్మార్ట్ ఫోన్ ను రెండు వేరియంట్లలో విడుదల చేసింది. ఈ రెండు వేరియంట్ ప్రైస్ ఇప్పుడు చూద్దాం. నథింగ్ ఫోన్ 4b స్మార్ట్ ఫోన్ రూ. 34,999 ప్రారంభ ధరతో లాంచ్ చేసింది. ఇది బేసిక్ వేరియంట్ ప్రైస్ మరియు ఇది 8 జీబీ ర్యామ్ మరియు 128 జీబీ స్టోరేజ్ తో వస్తుంది. 8 జీబీ + 256 జీబీ వేరియంట్ ను రూ. 38,999 రూపాయల ధరతో లాంచ్ చేసింది. ఈ ఫోన్ ను వైట్, బ్లాక్ మరియు బ్లూ మూడు రంగుల్లో లాంచ్ చేసింది. ఈ ఫోన్ జూలై 14వ తేదీ 12PM నుంచి సేల్ కి అందుబాటులోకి వస్తుంది.
ఈ ఫోన్ పై గొప్ప లాంచ్ డిస్కౌంట్ ఆఫర్స్ కూడా నథింగ్ అందించింది. అవేమిటంటే, ఈ ఫోన్ పై రూ. 2375 రూపాయల అదనపు ఎక్స్ చేంజ్ బోనస్ మరియు రూ. 2,625 రూపాయల బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ అందించింది. ఈ ఆఫర్స్ తో ఈ ఫోన్ కేవలం రూ. 29,999 రూపాయల ప్రారంభ ధరలో లభిస్తుంది. ఈ ఫోన్ ను ICICI, HDFC, SBI మరియు Axis బ్యాంక్ క్రెడిట్ కార్డ్ తో కొనే వారికి ఈ అదనపు బ్యాంక్ డిస్కౌంట్ లభిస్తుంది.
నథింగ్ ఫోన్ 4b స్మార్ట్ ఫోన్ 6.77 ఇంచ్ Super AMOLED స్క్రీన్ కలిగి ఉంటుంది. ఈ స్క్రీన్ 120Hz అడాప్టివ్ రిఫ్రెష్ రేట్, గొప్ప 2000 నిట్స్ పీక్ బ్రైట్నెస్ మరియు డ్రాగన్ టైల్ ప్రో గ్లాస్ సపోర్ట్ వంటి ఫీచర్స్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ క్వాల్కమ్ Snapdragon 6 Gen 4 చిప్ సెట్ తో నడుస్తుంది. ఈ ఫోన్ లో 8 జీబీ ర్యామ్ మరియు 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ను కూడా నథింగ్ ఆఫర్ చేస్తోంది.
ఈ నథింగ్ ఫోన్ Nothing OS 4.1 సాఫ్ట్ వేర్ జతగా ఆండ్రాయిడ్ 16 OS తో వస్తుంది మరియు అప్ కమింగ్ అప్డేట్స్ కూడా అందుకుంటుంది. ఈ ఫోన్ 3 సంవత్సరాల ఆండ్రాయిడ్ అప్గ్రేడ్ మరియు 6 సంవత్సరాల సెక్యూరిటీ ప్యాచ్ అప్డేట్స్ అందుకుంటుంది.
కెమెరా పరంగా, ఈ ఫోన్ డ్యూయల్ రియర్ కెమెరా కలిగి ఉంటుంది. ఈ సెటప్ లో 50MP మెయిన్ (OIS అండ్ EIS) మరియు 8MP అల్ట్రా వైడ్ సెన్సార్ లు ఉంటాయి. అలాగే, ఈ ఫోన్ లో ముందు 16MP సెల్ఫీ కెమెరా కూడా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ 30FPS 4K వీడియో రికార్డింగ్ మరియు లేటెస్ట్ AI కెమెరా ఫీచర్స్ కలిగి ఉంటుంది. ఇది కాకుండా Ultra XDR సపోర్ట్ మరియు AI సెమెటిక్ సెగ్మెంటేషన్ వంటి కెమెరా ఫీచర్స్ కూడా కలిగి ఉంటుంది.
Also Read: Samsung QLED Smart Tv గోట్ సేల్ బిగ్ డీల్ ఈరోజు మిస్సైతే మళ్ళీ దొరకదేమో.!
ఈ ఫోన్ ను ఇండియాలో 6,000 mAh బ్యాటరీతో లాంచ్ చేసింది. అయితే, గ్లోబల్ మార్కెట్ లో కేవలం 5,200 mAh బ్యాటరీతో మాత్రమే లాంచ్ చేసింది. ఈ ఫోన్ 33 W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ మరియు 7.5 W రివర్స్ ఛార్జ్ సపోర్ట్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ లో డ్యూయల్ స్టీరియో స్పీకర్లు మరియు IP 64 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెంట్ సపోర్ట్ కూడా ఉంటాయి.