nothing confirmed triple rear camera on Nothing Phone (3a) Series
Nothing Phone (3a) Series లాంచ్ అనౌన్స్ చేసిన కంపెనీ ఒక్కొక్క కీలకమైన ఫీచర్ తో టీజింగ్ చేస్తోంది. నిన్న మొన్నటి వరకు డిజైన్ గురించి మాత్రమే టీజింగ్ చేసిన నథింగ్ ఇప్పుడు టీజింగ్ స్పీడ్ పెంచింది. ఈ ఫోన్ కలిగి ఉన్న కెమెరా వివరాలు ఇప్పుడు టీజింగ్ చేస్తోంది. ఈరోజు కొత్తగా విడుదల చేసిన టీజర్ ఇమేజ్ ద్వారా ఈ సిరీస్ ఫోన్ లలో వెనుక ట్రిపుల్ రియర్ కెమెరా ఉన్నట్లు కన్ఫర్మ్ చేసింది.
నథింగ్ ఫోన్ (3a) సిరీస్ ను మార్చి 4వ తేదీన మధ్యాహ్నం 12 గంటలకు లాంచ్ చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ సిరీస్ లాంచ్ కోసం ఫోన్ కంపెనీ సరికొత్తగా టీజింగ్ చేస్తోంది. ఈ ఫోన్ కోసం ఫ్లిప్ కార్ట్ ప్రత్యేకమైన మైక్రో సైట్ పేజి తో టీజింగ్ చేస్తోంది.
నథింగ్ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ సిరీస్ ఫోన్ (3a) సిరీస్ యొక్క కీలకమైన ఫీచర్స్ ఈరోజు విడుదల చేసింది. ఈ అప్ కమింగ్ సిరీస్ ను ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఎంతో తీసుకొస్తున్నట్లు ఈరోజు కన్ఫర్మ్ చేసింది. అంతేకాదు, ఈ కెమెరా సెటప్ లో పెరిస్కోప్ కెమెరా ఉన్నట్లు కూడా ఇమేజ్ ద్వారా తెలుస్తోంది. ఈరోజు విడుదల చేసిన కొత్త టీజర్ ఇమేజ్ ద్వారా ఈ వివరాలు బయటపెట్టింది. అంతేకాదు, ఈ టీజర్ లో “See More. Capture More.” టైటిల్ ను అందించింది.
ఇక ముందు అందించిన టీజర్ ఇమేజ్ ల ద్వారా ఈ ఫోన్ ,లో కెమెరా కోసం యాపిల్ లేటెస్ట్ సిరీస్ ఫోన్ లలో మాదిరి ప్రత్యేకమైన కెమెరా బటన్ ఉంటుందని ఒక అంచనా అందించింది. ఇది కాకుండా ఈ ఫోన్ ను సరికొత్త పర్పస్ ఫుల్ డిజైన్ తో లాంచ్ చేస్తుందని కూడా పేర్కొంది. అంతేకాదు, ఈ సిరీస్ ను Snapdragon లేటెస్ట్ చిప్ సెట్ తో లాంచ్ చేస్తున్నట్లు కూడా కన్ఫర్మ్ చేసింది.
Also Read: boAt Dolby Soundbar పై ఆకర్షణీయమైన ఆఫర్లు అందించిన ఫ్లిప్ కార్ట్.!
నథింగ్ ఫోన్ (3a) సిరీస్ లాంచ్ కోసం ఇంకా సమయం వుంది కాబట్టి ఈ ఫోన్ యొక్క మరిన్ని ఫీచర్లు కూడా త్వరలోనే వెల్లడించే అవకాశం ఉంటుంది.