Tecno అప్ కమింగ్ ఫోన్ పైన Nothing కంపెనీ కామెడీ పంచ్.!
Tecno ఇండియాలో Pova 5 Series స్మార్ట్ ఫోన్ లాంచ్ చేస్తున్నట్లు టీజర్ ను అందించింది
ఈ టీజర్ పైన Nothing కంపెనీ కామెడీ పంచ్ తో ట్వీట్ చేసింది
ఈ ట్వీట్ కి స్పందించి నెటిజన్లు వారి అభిప్రాయాలను షేర్ చేశారు
Tecno ఇండియాలో Pova 5 Series స్మార్ట్ ఫోన్ ను ఇండియాలో లాంచ్ చేస్తున్నట్లు టీజర్ ను అందించింది. అయితే, ఈ టీజర్ పైన Nothing కంపెనీ కామెడీ పంచ్ తో ట్వీట్ చేసింది. టెక్నో ఫోన్ పైన నథింగ్ కంపెనీ కామెడీ పంచ్ వెయ్యడం ఏమిటీ అనుకుంటున్నారా? ఇక్కడే మంచి ట్విస్ట్ వుంది. టెక్నో లాంచ్ చేయబోతున్న Pova 5 Series ఫోన్, నథింగ్ ఫోన్ వెనుక కనిపించే RGB లైట్ డిజైన్ ను పోలిన డిజైన్ తో కనిపిస్తోంది. దీనికి స్పందించిన నథింగ్ కంపెనీ అధికారిక ట్విట్టర్ అకౌంట్ నుండి అనూహ్యమైన ట్వీట్ ను చేసింది.
Surveyవిషయంలోకి వెళితే, బ్యాక్ ప్యానల్ లో నోటిఫికేషన్ కోసం పెద్ద RGB లైట్స్ కలిగిన వినూత్నమైన డిజైన్ ఫోన్ ను తీసుకొచ్చిన కంపెనీ నథింగ్ అని అందరికీ తెలుసు. రీసెంట్ గా నథింగ్ లాంచ్ చేసిన Nothing Phone (2) కోడోత్ ఇదే వినూత్నమైన డిజైన్ తో వచ్చింది. అయితే, ప్రముఖ చైనీస్ మొబైల్ తయారీ కంపెనీ Tecno ఇండియాలో లాంచ్ చేయబోతున్నట్లు తెలిపిన Pova 5 Series యొక్క టీజర్ లాంచ్ చేసింది. టెక్నో లాంచ్ చేయబోతున్న ఈ ఫోన్ నథింగ్ ఫోన్స్ మాదిరిగా వెనుక RGB లైట్స్ డిజైన్ తో కనిపిస్తోంది.
అంతే, టెక్నో అధికారిక ట్విట్ట్టెర్ అకౌంట్ నుండి రిలీజ్ చేసిన టీజర్ ను ట్యాగ్ చేస్తూ, నథింగ్ ట్వీట్ చేసింది. 'మ పనిని కాపీ కొట్టాలంటే, వచ్చేసారి మమ్మల్నే అడగండి" అని ట్వీట్ చేసింది. అయితే, ఈ ట్వీట్ కి స్పందించి నెటిజన్లు వారి అభిప్రాయాలను షేర్ చేశారు. ఈ ట్వీట్ ను క్రింద చూడవచ్చు.
if you want to copy our homework, just ask next time? https://t.co/J03caEIX4t
— Nothing (@nothing) July 25, 2023
అయితే, ఈ నథింగ్ చేసిన ఈ ట్వీట్ పైన టెక్నో ఎటువంటి కౌంటర్ ఇవ్వలేదు. కానీ, యూజర్లు మాత్రం వారి అభిప్రాయాలను తెలిపారు. కొందరు యూజర్లు కాపీ చెయడం తప్పని చెబితే, ఎక్కువ శాతం యూజర్లు మాత్రం నీ ఫోన్లు కూడా కాపీ చేసినవే కదా అంటూ ఫైర్ అవుతున్నారు.
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile