నోకియా నుండి 10 వేల రూ మోడల్ తో పాటు టోటల్ గా 5 ఫోనులు వస్తున్నాయి

నోకియా నుండి 10 వేల రూ మోడల్ తో పాటు టోటల్ గా 5 ఫోనులు వస్తున్నాయి

నోకియా ఫోన్స్ తిరిగి వస్తున్నాయి అనేది పాత విషయం అయిపొయింది ఇప్పుడు. అయితే లేటెస్ట్ రిపోర్ట్ ఏంటంటే 2017 లో కంపెని మినిమమ్ 5 స్మార్ట్ ఫోన్లను రిలీజ్ చేయనుంది.

మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ లో మినిమమ్ ఒకటి అయినా ప్రపంచానికి చూపించనుంది నోకియా. ఈ ఈవెంట్ ప్రతీ సంవత్సరం ఫిబ్రవరి లో జరుగుతుంది.  రీసెంట్ గా రెండు రోజులు క్రితం ఫోన్ కొత్త leaks కూడా బయట పడ్డాయి ఒక మోడల్ కు.

వాటిలో రెండు మిడ్ రేంజ్ బడ్జెట్ లోని మోడల్స్ అయితే , మరో రెండు ఫ్లాగ్ షిప్ రేంజ్ (హై ఎండ్ అన్ని విధాలుగా) స్మార్ట్ ఫోనులు అని తెలుస్తున్నాయి డిజిట్ టైమ్స్ రిపోర్ట్ ప్రకారం.

ఫిబ్రవరీ MWC లో D1C అనే బడ్జెట్ మోడల్ ను చూపించనుంది అని అంచనా. ఈ మోడల్ గురించి ఇంతకముందే మనం leaks ద్వారా తెలుసుకున్నాము. దీని ప్రైస్ సుమారు 10,000 రూ ఉండనుంది.

D1C స్పెక్స్ విషయానికి వస్తే.. 5 in అండ్ 5.5 in FHD డిస్ప్లే, 2GB అండ్ 3GB రామ్స్, 13MP అండ్ 16MP రేర్ కేమేరాస్, 16 అండ్ 32GB స్టోరేజ్ వేరియంట్స్ లో రానుంది ఇది కూడా. స్నాప్ డ్రాగన్ 430 ప్రొసెసర్, అడ్రెనో 505 GPU.

Karthekayan Iyer
Digit.in
Logo
Digit.in
Logo