మూడు కొత్త ఫోన్లను ఆవిష్కరించిన నోకియా..!!

HIGHLIGHTS

నోకియా మూడు కొత్త ఫీచర్ ఫోన్లను గ్లోబల్ మార్కెట్లో ఆవిష్కరించింది

ఈ ఫీచర్ ఫోన్లలో Nokia 2660 Flip, Nokia 8210 4G మరియు Nokia 5710 Xpress Audio ఉన్నాయి

నోకియా కొత్తగా ఆవిష్కరించిన ఈ ఫీచర్ ఫోన్లు ప్రపంచ మార్కెట్లో విడుదలయ్యాయి

మూడు కొత్త ఫోన్లను ఆవిష్కరించిన నోకియా..!!

నోకియా మూడు కొత్త ఫీచర్ ఫోన్లను గ్లోబల్ మార్కెట్లో ఆవిష్కరించింది. ఈ ఫీచర్ ఫోన్లలో Nokia 2660 Flip, Nokia 8210 4G మరియు Nokia 5710 Xpress Audio ఉన్నాయి. వీటిలో పేరు సూచించినట్లుగా నోకియా 2660 ఫ్లిప్ ఫోన్ కాగా, నోకియా 8210 4G కనెక్టివిటీ కలిగిన ఫీచర్ ఫోన్. ఇక చివరిగా, నోకియా 5710 ఎక్స్ ప్రెస్ ఆడియో ఫోన్ ఎన్నడూ చూడని విధంగా వెనుక TWS లను అంతర్నిర్మితంగా కలిగి ఉంటుంది. ఈ లేటెస్ట్ నోకియా ఫీచర్ ఫోన్ ధర, స్పెక్స్ మరియు ప్రత్యేకతలు ఏమిటో తెలుసుకోవాలని వుందా? అయితే, ఆలశ్యం చేయకుండా వివరాల్లోకి వెళదాం.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Nokia New phones-1.jpg

నోకియా కొత్తగా ఆవిష్కరించిన ఈ ఫీచర్ ఫోన్లు ప్రపంచ మార్కెట్లో విడుదలయ్యాయి. ఈ ఫీచర్ ఫోన్ల ధరలు ఈవిధంగా వున్నాయి. Nokia 8210 4G మరియు Nokia 2660 ఫ్లిప్‌లను £64.99 ($59) అంటే దాదాపు రూ. 6000 ధరకు అఫర్ చేసింది. అయితే, Nokia 5710 XpressAudio ను పొందాలంటే మాత్రం £74.99 ($69) (దాదాపు రూ. 7,000 రూపాయలు) ఖర్చు చేయవలసి ఉంటుంది.

నోకియా 2660 ఫ్లిప్:

Nokia-2660-Flip 650.jpg

నోకియా 2660 ఫ్లిప్ ఫీచర్ ఫోన్ పేరు సూచించినట్లుగా మడతపెట్టేలా ఉంటుంది. ఈ ఫోన్ లో లోపల మరియు వెనుక రెండు డిస్ప్లేలు ఉంటాయి. ఇది లోపల 2.8-అంగుళాల QVGA డిస్ప్లేని కలిగి ఉంటే వెనుక 1.77-అంగుళాల QQVGA డిస్ప్లేను కలిగివుంది. ఈ ఫోన్ Unisoc T107 ప్రాసెసర్ తో పనిచేస్తుంది మరియు 128MB ఇన్ బిల్ట్ స్టోరేజ్ ను కలిగి ఉంటుంది. ఈ ఫోన్ 1,450mAh బ్యాటరీని ప్యాక్ చేస్తుంది మరియు ఈ ఫోన్ లో కెమెరా, వైర్లెస్ FM , VGA కెమెరా కూడా వున్నాయి.

నోకియా 8210 4G:

Nokia-8210-4G 650.jpg

ఇరవై సంవత్సరాల క్రితం నోకియా అందించిన నోకియా 8210 ఫోన్ యొక్క 4G వెర్షన్ ఈ నోకియా 8210 4G మరియు దీని డిజైన్ లో కూడా ఎటువంటి మార్పును చెయ్యలేదు. అయితే, ఫోన్ లోపల మాత్రం కొత్త ఫీచర్లతో అప్గ్రేడ్ చేసింది. ఈ ఫోన్ డ్యూయల్ సిమ్ తో వస్తుంది మరియు LTE కనెక్టివిటీని కలిగి ఉంది. ఈ ఫోన్ 1,450mAh బ్యాటరీతో వస్తుంది. ఈ ఫోన్ VGA కెమెరా, 128MB అంతర్నిర్మిత స్టోరేజ్, FM రేడియో మరియు MP3 ప్లేయర్ వంటి ఇతర ఫీచర్లతో వస్తుంది.

 నోకియా 5710 ఎక్స్ ప్రెస్ ఆడియో:

Nokia-5710-XpressAudio 650.jpg

ఇక చివరిగా మూడవ ఫోన్ అయిన నోకియా 5710 ఎక్స్ ప్రెస్ ఆడియో విషయానికి వస్తే, ఈ ఫోన్ చాలా ప్రత్యేకమైన డిజైన్ తో ప్రవేశపెట్టబడింది. మనం ఎన్నడూ చూడని విదంగా ఈ ఫోన్ వెనుక అంతర్నిర్మిత TWS ఇయర్‌ బడ్స్ కోసం వెనుకవైపు స్లైడర్‌ కలిగిన చక్కని డిజైన్‌తో వస్తుంది. ఈ ఫోన్ VGA రియర్ కెమెరాను కలిగి వుంది మరియు 1,450 mAh రిమూవబుల్ బ్యాటరీతో వస్తుంది. ఈ ఫోన్ Unisoc T107 SoC ని S30+ UI తో కలిగి ఉంటుంది మరియు డ్యూయల్-సిమ్ కార్డ్‌ లకు కూడా మద్దతు ఇస్తుంది. 

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo