Nokia 8.2 5G స్మార్ట్ ఫోన్ స్నాప్ డ్రాగన్ 765 SoC మరియు 64MP ప్రధాన కెమెరాతో రావచ్చు

HIGHLIGHTS

ఇందులో 6 జీబీ, 8 జీబీ ర్యామ్ వేరియంట్లు ఉండవచ్చు.

Nokia 8.2 5G స్మార్ట్ ఫోన్ స్నాప్ డ్రాగన్ 765 SoC మరియు 64MP ప్రధాన కెమెరాతో రావచ్చు

HMD  గ్లోబల్ గత రెండేళ్లుగా మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ (MWC) వేదికను ప్రధానంగా తీసుకుంటోంది. ప్రతి సంవత్సరం ఎఈ గ్జిబిషన్‌ లో కంపెనీ యొక్క కొత్త డివైజులను ఆవిష్కరిస్తుంది. MWC 2020 లో నోకియా 1.3, నోకియా 5.2 మరియు నోకియా 8.2 5G వంటి చాలా డివైజులను కంపెనీ ప్రకటించనున్నందున, ఈ సంవత్సరం కూడా అదే పంథాను సాగిస్తున్నదని భావిస్తున్నారు. కొత్త అప్డేట్లతో పాటుగా, నోకియా యొక్క ఒరిజినల్ సిరీస్ డివైజ్ ను ప్రకటిస్తుందని నివేదిక పేర్కొంది.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

nokiamob.net నుండి వచ్చిన నివేదిక ప్రకారం, నోకియా 8.2 యొక్క 4G ఎడిషన్ రద్దు చేయబడింది. ఇక 5G  వేరియంట్ విషయానికొస్తే, ఇది క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 765 SoC యొక్క శక్తితో రానున్నట్లు చెప్పబడింది. ఈ డిజైన్ 2019 లో వచ్చిన నోకియా 7.2 ఫోన్‌ తో సమానంగా ఉంటుంది. ఈ స్మార్ట్‌ ఫోన్ గరిష్టంగా, 64MP  ప్రైమరీ కెమెరా మరియు 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాను కలిగి ఉంటుందని ముందుగా వచ్చిన నివేదికలు పేర్కొన్నాయి. ఇందులో 6 జీబీ, 8 జీబీ ర్యామ్ వేరియంట్లు ఉండవచ్చు. ఈ ఫోన్ 128GB ఇంటర్నల్ స్టోరేజితో అమర్చబడిందని కూడా ఒక పుకారు ఉంది.

నోకియా 8.2 5G ఒక 32 MP  సెల్ఫీ షూటర్‌తో రావచ్చు. ఈ ఫోన్ POLED లేదా LCD స్క్రీన్ మరియు సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ రీడర్‌ తో రావచ్చు. అధనంగా, ఈ స్మార్ట్ ఫోన్ కర్వ్డ్ డిస్ప్లేని కలిగి ఉందని మరొక రూమర్ కూడా ఆన్లైన్లో చెక్కర్లు కొడుతోంది. అయితే, ఈ కొత్త నివేదిక అది ఒట్టిమాటే అని తెచ్చేసింది. ఈ స్మార్ట్ ఫోన్,  3500 mAh బ్యాటరీని ప్యాక్ చేయనున్నట్లు అంచనా వేయబడింది. ఇది స్పీడ్ ఛార్జింగ్‌కు కూడా మద్దతు ఇవ్వవచ్చు.

నోకియా 8.2 5G కి వైర్‌ లెస్ ఛార్జింగ్ మరియు బ్రీతింగ్ లైట్ నోటిఫికేషన్‌కు మద్దతు కలిగి ఉండదు. ఇది 3.5 ఎంఎం హెడ్‌ఫోన్ తో అమర్చబడిందని భావిస్తున్నారు. నోకియా 8.2 5G ధర అంతర్జాతీయ మార్కెట్లలో $ 500 మార్క్ కింద ఉంటుందని చెప్పబడింది. భారతదేశంలో నోకియా 8.2 5 జి లభ్యతపై ఇంకా ఎటువంటి సమాచారం లేదు.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo