ఆండ్రాయిడ్ 10 అప్డేట్ అందుకున్న నోకియా 6.1 ప్లస్

ఆండ్రాయిడ్ 10 అప్డేట్ అందుకున్న నోకియా 6.1 ప్లస్
HIGHLIGHTS

ఈ మొబైల్ ఫోన్ 2019 డిసెంబర్ ఆండ్రాయిడ్ సెక్యూరిటీ ప్యాచ్‌ ను కూడా అందుకుంటోంది.

నోకియా 6.1 ప్లస్ మొబైల్ ఫోన్, ఇప్పుడు ఆండ్రాయిడ్ 10 అప్డేట్ ను స్వీకరించడం ప్రారంభించిందని HMD గ్లోబల్ ప్రకటించింది. ఇది కాకుండా, ఈ మొబైల్ ఫోన్ 2019 డిసెంబర్ ఆండ్రాయిడ్ సెక్యూరిటీ ప్యాచ్‌ ను కూడా అందుకుంటోంది. ఇది కాకుండా, ఈ మొబైల్ ఫోనుతో పాటు మరికొన్ని ఫీచర్లు కూడా కనుగొనబడ్డాయి. మొబైల్ ఫోన్లకు ఇప్పుడు డార్క్ మోడ్ వచ్చినట్లే, దీనికి అదనంగా, ఈ అప్డేట్ తో మీకు గెశ్చర్ నావిగేషన్ కూడా వచ్చిచేరుతుంది. దీనితో పాటు, ఈ మొబైల్ ఫోన్‌ లో స్మార్ట్ రిప్లై కూడా అందుబాటులో ఉంటుంది. గత సంవత్సరం, నోకియా 7.1, నోకియా 6.1 మరియు నోకియా 9 ప్యూర్ వ్యూ  కూడా ఆండ్రాయిడ్ 10 యొక్క అప్డేట్ ను అందుకున్నాయి.

అయితే, ఇప్పుడు నోకియా 6.1 ప్లస్ స్మార్ట్‌ ఫోన్లు ఈ అప్డేట్ ను స్వీకరించడం ప్రారంభించాయి. ఈ అప్డేట్లో అనగా Android 10 అప్డేట్లో, మీకు మరిన్ని యాప్స్  నియంత్రణ, కొత్త UI మరియు అనేక ఇతర విషయాలు కూడా అందుతాయి. HMD  గ్లోబల్, ఈ నోకియా 6.1 ప్లస్ మొబైల్ ఫోన్ వినియోగదారులకు ఆండ్రాయిడ్ 10 అప్‌ డేట్ లభించిందని ట్విట్టర్ ద్వారా తెలిపింది. ఈ క్రొత్త అప్డేట్ OTA గా విడుదల చేయబడింది. ఇది ఫోన్‌ లో వేర్వేరు సమయాల్లో అందుతుందని దీని అర్థం. అయినప్పటికీ, మీరు మీ ఫోనులో ఈ అప్డేట్ను ఇంకా స్వీకరించకపోతే, ఫోన్ సెట్టింగ్‌లకు వెళ్లడం ద్వారా మీరు ఈ  అప్డేటును సులభంగా తనిఖీ చేయవచ్చు. 

ఇటీవల, నోకియా 6.1 యొక్క అప్డేట్ 106.6MB  మరియు నోకియా 7 ప్లస్ కోసం 97.1MB పరిమాణంతో వచ్చింది. ఈ అప్డేట్  కోసం, మీ హ్యాండ్‌ సెట్‌ లో ఆటొమ్యాటిగ్గా నోటిఫికేషన్ ఉంటుంది మరియు మీరు సెట్టింగ్‌లకు వెళ్లడం ద్వారా దీన్ని మాన్యువల్‌ గా కూడా తనిఖీ చేయవచ్చు. చేంజ్లాగ్‌లో, నవంబర్ ఆండ్రాయిడ్ సెక్యూరిటీ ప్యాచ్ మాత్రమే వెల్లడి అవుతుంది మరియు ఇది మరికొన్ని కొన్ని ఇతర దోషాలను కూడా పరిష్కరిస్తుంది.

నోకియా హ్యాండ్‌సెట్‌ల కోసం గూగుల్ అసెంట్ యొక్క కొత్త యాంబియంట్ మోడ్‌ ను విడుదల చేస్తున్నట్లు ఇటీవల నివేదికలో వెల్లడైంది. నోకియా 6.1, నోకియా 6.1 ప్లస్, నోకియా 7.1, నోకియా 8.1, నోకియా 9 ప్యూర్‌వ్యూ, నోకియా 3, నోకియా 3.2, నోకియా 4.2 ఈ అప్‌ డేట్‌ ను పొందునున్నాయి. గూగుల్ అసిస్టెంట్ యొక్క కొత్త యాంబియంట్ మోడ్ ప్లగిన్ అయినప్పుడు మీ పరికరాన్ని స్మార్ట్ డిస్ప్లే గా మారుస్తుంది. ఈ లక్షణాన్ని మొట్టమొదట నోకియా 6.2 మరియు నోకియా 7.2 లో ప్రవేశపెట్టారు.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo