Nokia 5310 (2020): ఇప్పుడు ఆఫ్ లైన్ స్టోర్లలో కూడా కొనవచ్చు

Nokia 5310 (2020): ఇప్పుడు ఆఫ్ లైన్ స్టోర్లలో కూడా కొనవచ్చు
HIGHLIGHTS

Nokia 5310 (2020) ఫీచర్ ఫోన్ ఇటీవలే నోకియా సంస్థ భారతదేశంలో లాంచ్ చేసింది.

ఆగస్టు 11 నుండి ఈ నోకియా 5310 ఆఫ్‌ లైన్ మార్కెట్లో కూడా అందుబాటులోకి వచ్చింది.

Nokia 5310 (2020) ఫీచర్ ఫోన్ ఇటీవలే నోకియా సంస్థ భారతదేశంలో లాంచ్ చేసింది. ఇప్పుడు, ఆగస్టు 11 నుండి ఈ నోకియా 5310 ఆఫ్‌ లైన్ మార్కెట్లో కూడా  అందుబాటులోకి వచ్చింది. ఈ Nokia 5310 (2020) మొబైల్ ఫోన్ ధర 3,399 రూపాయలు మరియు ఇది డ్యూయల్ సిమ్ సపోర్ట్‌ తో వస్తుంది. ఈ ఫోన్ గతంలో సంగీత ప్రియులను అత్యధికంగా ఆకటున్న ఫోనుగా అందరికి సుపరిచితమే. ఇప్పుడు, అదే ఫోన్ను కొత్త డిజైన్ మరియు ఫీచర్లతో అదే పాత పేరుతో ఇండియాలో విడుదల చేసింది.  ఈ ఫోన్ ఇప్పటి వరకూ నోకియా ఇండియా స్టోర్ మరియు అమెజాన్ ఇండియా నుండి అమ్ముడవుతుండగా, ఇప్పుడు ఆఫ్ లైన్ మార్కెట్ స్టోర్లలో కూడా కొనడానికి ఇది అందుబాటులోకి వచ్చింది.

Nokia 5310 (2020) Price

నోకియా 5310 (2020) ఎక్స్‌ప్రెస్ మ్యూజిక్ Price విషయానికి వస్తే, దీన్ని కేవలం 3,399 రూపాయల ధరలో మరియు రెండు రంగులలో అందించింది – తెలుపు మరియు నలుపు.

Nokia 5310 (2020): ప్రత్యేకతలు

 ఈ కొత్త నోకియా 5310 ఎక్స్‌ప్రెస్ మ్యూజిక్ 2020 ఫీచర్ ఫోన్‌లో 13.1 మిమీ మందంతో నిర్మించిన ప్లాస్టిక్ బాడీ ఉంది, దీని బరువు 88 గ్రాములు. ముందుగా వచ్చిన  5310 కంటే, ఈ కొత్త అప్డేటెడ్ వెర్షన్ సన్నగా మరియు తేలికైనది. 5310 ఎక్స్‌ప్రెస్ మ్యూజిక్ ఫోన్ యొక్క హైలైట్ ఏమిటంటే ఇది మ్యూజిక్ ప్లేబ్యాక్ కంట్రోల్ మరియు వాల్యూమ్ కోసం ప్రత్యేకమైన బటన్లతో వస్తుంది.

ఇది 320 x 240 పిక్సెల్స్ కలిగిన QVGA రిజల్యూషన్ మరియు 4: 3 యాస్పెక్ట్ రేషియోతో ఒక 2.4-అంగుళాల TFT డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ కొత్త నోకియా 5310 మీడియాటెక్ MT6260A ప్రాసెసర్‌తో పనిచేస్తుంది మరియు నోకియా యొక్క సిరీస్ 30+ ఆపరేటింగ్ సిస్టమ్‌లో నడుస్తుంది. ఇది మైక్రో ఎస్‌డి కార్డ్ ద్వారా 32 జిబి వరకు స్టోరేజిను పెంచే ఎంపికతో 8 MB ర్యామ్ మరియు 16 MB  ఇంటర్నల్ స్టోరేజ్‌తో జత చేయబడింది.

ఈ ఫోన్ వెనుక భాగంలో LED ఫ్లాష్‌తో సపోర్ట్ చేసిన VGA కెమెరా అమర్చారు. ఇయర్‌ఫోన్‌లను కనెక్ట్ చేయడానికి ఇది 3.5 ఎంఎం జాక్‌ను కలిగి ఉంది మరియు బ్లూటూత్ 3.0 కి మద్దతుతో వస్తుంది. నోకియా 5310 ఫీచర్ ఫోన్ ఒక 1200 ఎమ్ఏహెచ్ బ్యాటరీతో అమర్చబడివుంది. ఇది 20 గంటల టాక్ టైం వరకు అందించగలదని మరియు స్టాండ్ బై మోడ్లో 22 రోజుల వరకు ఉంటుందని కంపెనీ పేర్కొంది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo