ఐకూ లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ iQOO Neo 7 5G సేల్ కి అందుబాటులో వుంది. iQOO Neo 6 5G తరువాతి తరం ఫోనుగా ఇండియాలో ప్రవేశపెట్టబడిన ఈ స్మార్ట్ ఫోన్ 4nm ప్రాసెసర్ తో ఇండియాలో విడుదలైన మొదటి ఫోనుగా నిలిచింది. అంతేకాదు, 120W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ వంటి మరిన్ని ఫీచర్లతో ఈ స్మార్ట్ ఫోన్ ను మిడ్ రేంజ్ ధరలో విడుదల చేసింది. iQOO యొక్క ఈ లేటెస్ట్ 5G ఫోన్ ధర మరియు ఫీచర్లు తెలుసుకోండి.
Survey
✅ Thank you for completing the survey!
iQOO Neo 7 5G: ధర మరియు ఆఫర్లు
ఐకూ నియో 7 5జి స్మార్ట్ ఫోన్ యొక్క బేసిక్ వేరియంట్ (8GB+128GB) ధర రూ.29,999 మరియు 12GB+256GB వేరియంట్ ధర రూ.33,999. Amazon నుండి ఈ స్మార్ట్ ఫోన్ ను HDFC, SBI మరియు ICICI బ్యాంక్ కార్డుతో కొనేవారికి 1,500 రూపాయల అదనపు డిస్కౌంట్ లభిస్తుంది. ఈరోజు నుండి ఈ స్మార్ట్ ఫోన్ అమెజాన్ మరియు iqoo.com నుండి సేల్ కి అందుబాటులో వుంది.
ఐకూ నియో 7 5జి స్మార్ట్ ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్ మరియు 1300Hz నిట్స్ పీక్ బ్రైట్నెస్ రేట్ కలిగిన 6.78 ఇంచ్ పరిమాణం కలిగిన FHD+ రిజల్యూషన్ AMOLED డిస్ప్లే ని కలిగి వుంది.ఈ డిస్ప్లే HDR 10+ సపోర్ట్ సర్టిఫికేషన్ తో వస్తుంది. ఈ ఫోన్ మీడియాటెక్ Dimensity 8200 5G ప్రొసెసర్ తో పనిచేస్తుంది. ఇది 4nm ప్రాసెసర్ మరియు దీనికి జతగా గరిష్టంగా 12GB LPDDR5 ర్యామ్ మరియు (UFS 3.1) 256GB ఇంటర్నల్ స్టోరేజ్ సపోర్ట్ తో వస్తుంది.
కెమేరా విభాగంలో, ఈ లేటెస్ట్ ఐకూ 5G ఫోన్ వెనుక ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో, 64MP OIS ప్రధాన కెమెరాకి జతగా 2MP బొకే మరియు 2MP మ్యాక్రో సెన్సార్ తో వస్తుంది. ముందుభాగంలో, 16MP సెల్ఫీ కెమెరాని సెల్ఫీల కోసం అందించింది. ఈ 5G స్మార్ట్ ఫోన్ ను 5,000mAh బ్యాటరీని 120W ఫ్లాష్ ఛార్జ్ సపోర్ట్ తో అందించింది.
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile