Nokia 9.3 Pure View మరియు Nokia 7.3 లాంచ్ గురించి కొత్త అప్డేట్ వచ్చింది

Nokia 9.3 Pure View మరియు Nokia 7.3 లాంచ్ గురించి కొత్త అప్డేట్ వచ్చింది
HIGHLIGHTS

ఈ ఏడాది నోకియా Nokia 9.3 Pure View , Nokia 7.3, Nokia 6.3 వంటి మూడు కొత్త స్మార్ట్‌ ఫోన్ ‌లను విడుదల చేయాలనే ఆలోచనలో వుంది.

HMD Global సంస్థ, 2020 చివరి నాటికి తన సరికొత్త స్మార్ట్ ఫోన్ను పరిచయం చేయడానికి సిద్ధమవుతోంది.

ఈ Nokia 9.3 Pure View , Nokia 7.3, Nokia 6.3 స్మార్ట్ ‌ఫోన్ ‌లన్నీ ఈ ఏడాది మూడవ త్రైమాసికంలో లేదా నాల్గవ త్రైమాసికం చివరిలో ప్రారంభించబడవచ్చు.

HMD Global సంస్థ, 2020 చివరి నాటికి తన సరికొత్త స్మార్ట్ ఫోన్ను పరిచయం చేయడానికి సిద్ధమవుతోంది. ఈ ఏడాది నోకియా Nokia 9.3 Pure View , Nokia 7.3, Nokia 6.3  వంటి మూడు కొత్త స్మార్ట్‌ ఫోన్ ‌లను విడుదల చేయాలనే ఆలోచనలో వుంది. కొత్త నివేదికల ప్రకారం, ఈ స్మార్ట్ ‌ఫోన్ ‌లన్నీ ఈ ఏడాది మూడవ త్రైమాసికంలో లేదా నాల్గవ త్రైమాసికం చివరిలో ప్రారంభించబడవచ్చు. అంటే, వాటిని ప్రారంభించడానికి మీరు 2020 చివరి వరకు వేచి ఉండాల్సి ఉంటుంది.

ఈ స్మార్ట్ ‌ఫోన్ ‌లను లాంచ్ చేయడానికి కంపెనీ ట్రాక్ ‌లో ఉంది మరియు కొత్త స్మార్ట్ ‌ఫోన్లపై ట్రయల్స్‌ ను కూడా కొనసాగిస్తోంది. మునుపటి కొన్ని నివేదికలను పరిశీలిస్తే, ఈ నివేదికలు ఈ స్మార్ట్ ‌ఫోన్ ‌లను ఆగస్టు లేదా సెప్టెంబరులో ప్రారంభించవచ్చని సూచిస్తున్నాయి. ఎంత ఆలస్యం అయినప్పటికీ, నాల్గవ త్రైమాసికం నాటికి HMD గ్లోబల్ వాటిని అందిస్తుందని భావిస్తున్నారు.

NPU నివేదిక ప్రకారం, నోకియా ఉత్పత్తి పై కరోనా వైరస్ మహమ్మారి ప్రభావం ఎంతవరకూ ఉంటుందో అనే దానిపై ఆధారపడి ఉంటుంది. నోకియా తన కొత్త స్మార్ట్‌ ఫోన్‌ ను లాంచ్ చేసి చాలా కాలం అయ్యింది, MWC 2020 నుండి అంటే, ఈ ఈవెంట్ రద్దు అయిన తరువాత నోకియా ఎటువంటి ప్రోడక్ట్ ప్రారంభించలేదు.

Nokia 9.3 Pure View లీకైన స్పెక్స్

ఇక మనం ఈ Nokia 9.3 Pure View స్మార్ట్ ‌ఫోన్ గురించి మాట్లాడితే, ఈ ఫోను కోసం LCD ప్యానల్ ‌ను అందిస్తుందని లేదా OLED  ప్యానల్‌తో వస్తుందని ఊహిస్తున్నారు. రూమర్స్ ప్రకారం, ఈ నోకియా 9.3 ప్యూర్ వ్యూ అండర్ డిస్ప్లే కెమెరాతో వస్తుంది మరియు OLED ప్యానెల్ను అందిస్తుంది. ఇది కాకుండా, ఫోన్ వెనుకవైపు 108 మెగాపిక్సెల్ శామ్‌సంగ్ ప్రైమరీ కెమెరాను కలిగి ఉంటుంది. మీరు GSMarena యొక్క నివేదికను పరిశీలిస్తే, ఈ ఫోన్ ‌కు 64 మెగాపిక్సెల్ కెమెరా ఇవ్వవచ్చని అర్ధమవుతుంది.

కొన్ని నివేదికల ప్రకారం, నోకియా 9.3 కోసం కంపెనీ 24MP, 20MP మరియు 48MP సెన్సార్లను పరీక్షించింది. మనం కనుక ఈ రూమర్లను నమ్మితే రాబోయే నోకియా ఫోన్ ఆగస్టు లేదా సెప్టెంబర్ ‌లో లాంచ్ అవుతుంది. కరోనా వైరస్ కారణంగా రాబోయే నోకియా ఫోన్ లాంచ్ ఇప్పటికే రద్దు చేయబడింది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo