/var/www/html/wp-shared-data/advanced-cache.php
Motorola Signature price and complete specs leaked ahead of launch
Motorola Signature స్మార్ట్ ఫోన్ ఇండియాలో లాంచ్ కావడానికి ఇంకా రెండు రోజులు ఉండగా, ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ ప్రైస్ అండ్ ఫీచర్స్ ఇప్పుడు ఆన్లైన్ లో లీకయ్యాయి. ఈ ఫోన్ ను 8K Dolby Vision వంటి జబర్దస్త్ ఫీచర్స్ తో మోటోరోలా ఈ ఫోన్ ను లాంచ్ చేస్తోంది. ఈ ఫోన్ పై ఇప్పటికే భారత మార్కెట్లో భారీ ఎక్స్పెక్టేషన్స్ రేకెత్తాయి. అందుకే, ఈ ఫోన్ లాంచ్ కంటే ముందే ఈ ఫోన్ ప్రైస్ అండ్ ఫీచర్స్ తెలుసుకోవాలనే కుతూహలం రేకెత్తిస్తోంది. మరి ఈ ఫోన్ గురించి ముందుగా లీకైన వివరాలు ఏమిటో చూద్దామా.
మోటోరోలా సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్ ను ఇండియన్ మార్కెట్ లో ప్రీమియం ఫోన్ గా విడుదల చేస్తున్నట్లు ఆన్లైన్ లీక్స్ చెబుతున్నాయి. ఆన్లైన్ లీక్స్ ప్రకారం, ఈ ఫోన్ స్టార్టింగ్ వేరియంట్ (12 జీబీ + 256 జీబీ) ను రూ. 59,999 ధరతో మరియు (16 జీబీ + 512 జీబీ) వేరియంట్ ను రూ. 64,999 ధరతో లాంచ్ చేస్తుందని తెలుస్తోంది. ఇదే కాదు ఈ ఫోన్ లో (16 జీబీ + 1 టీబీ) హై ఎండ్ వేరియంట్ కూడా ఉన్నట్లు లీక్స్ చెబుతున్నాయి. ఈ వేరియంట్ ను రూ. 69,999 ప్రైస్ ట్యాగ్ తో లాంచ్ చేస్తుందని కూడా చెబుతున్నారు.
అంతేకాదు, ఈ ఫోన్ పై అందించనున్న ఆఫర్స్ గురించి కూడా ఈ లీక్స్ లో వెల్లడించారు. అదేమిటంటే, ఈ ఫోన్ పై భారీ రూ. 5,000 బ్యాంక్ డిస్కౌంట్ మరియు రూ. 7,500 రూపాయల అదనపు ఎక్స్ చేంజ్ ఆఫర్ కూడా అందిస్తుందట. ప్రముఖ టిప్స్టర్ సంజూ చౌదరి ఈ లీక్స్ రిలీజ్ చేశారు. ఇదే కనుక నిజం అయితే, ఈ మోటోరోలా స్మార్ట్ ఫోన్ ఇండియన్ మార్కెట్లో ప్రీమియం సెగ్మెంట్లో గట్టి పోటీ నిచ్చే ఫోనుగా నిలుస్తుంది.
మోటోరోలా సిగ్నేచర్ లో 6.8 అంగుళాల LTPO AMOLED డిస్‌ప్లే ఉంటుంది. ఇది 1.5K రిజల్యూషన్, 165Hz రిఫ్రెష్ రేట్ మరియు గొప్ప బ్రైట్నెస్ కలిగి ఉంటుంది కలిగి ఉంటుంది. ఇది మాత్రమే కాదు ఈ ఫోన్ HDR10+ మరియు డాల్బీ విజన్ సపోర్ట్ తో కూడా వస్తుంది. ఇది ప్రీమియం డిస్ప్లే సెటప్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ లో క్వాల్కమ్ Snapdragon 8 Gen 5 ప్రాసెసర్ ఉంటుంది. ఇది ఫ్లాగ్‌షిప్ లెవల్ చిప్ సెట్ మరియు జతగా 16 జీబీ LPDDR5X ర్యామ్ మరియు 1 TB హెవీ స్టోరేజ్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ Android 16 ఆధారంగా Hello UI తో వస్తుంది.
ఈ మోటోరోలా స్మార్ట్ ఫోన్ 50MP Sony LYT-828 మెయిన్ సెన్సార్, 50MP అల్ట్రా వైడ్ సెన్సార్, 50MP పెరిస్కోప్ టెలిఫోటో సెన్సార్ లతో ట్రిపుల్ రియర్ కెమెరా మరియు ముందు 50MP సెల్ఫీ కెమెరా కూడా ఉంటుంది. ఈ ఫోన్ 8K డాల్బీ విజన్ వీడియో రికార్డ్ సపోర్ట్ కలిగి ఉంది. అంతేకాదు, సూపర్ రిజల్యూషన్ ఫోటోలు అందించే గొప్ప ఫీచర్లు కూడా కలిగి ఉంది. ఈ ఫోన్ లో 5,200 mAh సిలికాన్ కార్బన్ బ్యాటరీ, 90W టర్బో పవర్ వైర్డ్ ఛార్జ్ సపోర్ట్ మరియు 50W వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంటుంది.
Also Read: Apple iPhone 17 ఫోన్ ను ఫ్లిప్ కార్ట్ సేల్ నుంచి భారీ డిస్కౌంట్ ధరలో అందుకోండి.!
ఈ ఫోన్ IP68 మరియు IP69 రేటింగ్ తో డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెంట్ గా ఉంటుంది. ఈ ఫోన్ లో Bose ఆడియో సపోర్ట్ మరియు డాల్బీ అట్మాస్ సౌండ్ సపోర్ట్ కూడా కలిగి ఉంటుంది. ఓవరాల్ గా ఈ ఫోన్ ను సూపర్ ఫీచర్స్ తో లాంచ్ చేస్తోందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.