Apple iPhone 17 ఫోన్ ఈరోజు ఫ్లిప్ కార్ట్ రిపబ్లిక్ డే సేల్ నుంచి మంచి డిస్కౌంట్ ధరలో సేల్ అవుతోంది. ఆపిల్ యొక్క లేటెస్ట్ 17 సిరీస్ నుంచి వచ్చిన ఈ ఐఫోన్ ఫ్లిప్ కార్ట్ నుంచి ఈరోజు రెండు జబర్దస్త్ డిస్కౌంట్ ఆఫర్ లతో మంచి ఆఫర్ ధరలో లభిస్తుంది. ఐఫోన్ 17 ఫోన్ ను మంచి డిస్కౌంట్ ధరలో కొనాలని చూస్తున్న యూజర్లు ఈరోజు ఫ్లిప్ కార్ట్ అందించిన ఈ డీల్ ను పరిశీలించవచ్చు.
Survey
✅ Thank you for completing the survey!
Apple iPhone 17 : ఫ్లిప్ కార్ట్ ఆఫర్
ఐఫోన్ 17 స్మార్ట్ ఫోన్ ఇండియాలో రూ. 82,900 రూపాయల ప్రారంభం ధరతో లాంచ్ అయ్యింది మరియు ఈరోజు కూడా ఇదే ధరతో ఫ్లిప్ కార్ట్ నుంచి లిస్ట్ అవుట్ అయ్యింది. అయితే, ఈ ఫోన్ పై ఫ్లిప్ కార్ట్ ఈరోజు రెండు గొప్ప ఆఫర్లు అందించింది. అవేమిటంటే, ఈ ఫోన్ పై రూ. 2,500 రూపాయల HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్ డిస్కౌంట్ ఆఫర్ మరియు రూ. 2,000 ఎక్స్ చేంజ్ బోనస్ ఆఫర్ కూడా అందించింది. అంటే, ఫ్లిప్ కార్ట్ సేల్ నుంచి ఈ ఫోన్ పై టోటల్ రూ. 4,500 అదనపు డిస్కౌంట్ లభిస్తుంది. ఈ ఆఫర్స్ తో ఈ ఐఫోన్ మీకు రూ. 78,400 రూపాయల ఆఫర్ ధరలో సేల్ నుంచి లభిస్తుంది.
యాపిల్ ఐఫోన్ 17 2025 లో విడుదలైన అత్యాధునిక ఫ్లాగ్ షిప్ స్మార్ట్‌ఫోన్ గా మార్కెట్లోకి వచ్చింది. అద్భుతం విజువల్స్ అందించే 6.3 ఇంచ్ సూపర్ రెటీనా XDR OLED డిస్‌ప్లే ఈ ఫోన్ లో ఉంది. ఇది 120Hz అడాప్టివ్ రిఫ్రెష్ రేట్ మరియు 3000 నిట్స్ పీక్ బ్రైట్నెస్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ 3x ఎక్కువ స్క్రాచ్ రెసిస్టెంట్ సిరామిక్ షీల్డ్ 2 తో వస్తుంది. ఐఫోన్ 17 ఫోన్ యాపిల్ A19 Chip తో నడుస్తుంది మరియు iOS 26 ఆధారంగా పని చేస్తుంది. ఇందులో యాపిల్ ఇంటెలిజెన్స్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి.
కెమెరా పరంగా, ఈ ఫోన్ లో వెనుక 48MP ఫ్యూజన్ మెయిన్ మరియు 48MP ఫ్యూజన్ అల్ట్రా వైడ్ సెన్సార్ కలిగిన డ్యూయల్ రియర్ కెమెరా మరియు ముందు 18MP సెంటర్ స్టేజ్ సెల్ఫీ కెమెరా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ 4K Dolby Vision వీడియో రికార్డింగ్, ఆపిల్ కెమెరా ఫిల్టర్లు మరియు AI ఫీచర్స్ కూడా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ ఫాస్ట్ ఛార్జ్ మరియు MagSafe అండ్ Qi2 వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా కలిగి ఉంటుంది.