Motorola Razr 60: పటిష్టమైన టైటానియం హింజ్ తో లాంచ్ అవుతోంది.!

Updated on 22-May-2025
HIGHLIGHTS

Motorola Razr 60 స్మార్ట్ ఫోన్ వచ్చే వారం ఇండియాలో రిలీజ్ కావడానికి సిద్ధంగా ఉంది

స్ట్రాంగ్ డిజైన్ మరియు పటిష్టమైన టైటానియం హింజ్ తో లాంచ్ చేస్తున్నట్లు మోటోరోలా టీజింగ్

ఈ ఫోన్ మూడు భయంకరమైన కూల్ ఫీచర్స్ కలిగి ఉంటుందని మోటోరోలా కూల్ గా టీజింగ్ చేస్తోంది

Motorola Razr 60 స్మార్ట్ ఫోన్ వచ్చే వారం ఇండియాలో రిలీజ్ కావడానికి సిద్ధంగా ఉంది. ఈ స్మార్ట్ ఫోన్ ను స్ట్రాంగ్ డిజైన్ మరియు పటిష్టమైన టైటానియం హింజ్ తో లాంచ్ చేస్తున్నట్లు మోటోరోలా టీజింగ్ చేస్తోంది. ముఖ్యంగా, ఈ ఫోన్ మూడు భయంకరమైన కూల్ ఫీచర్స్ కలిగి ఉంటుందని మోటోరోలా కూల్ గా టీజింగ్ చేస్తోంది. ఈ అప్ కమింగ్ మోటోరోలా ఫ్లిప్ ఫోన్ కలిగిన ఆ కూల్ ఫీచర్స్ మరియు ఈ ఫోన్ ఇతర వివరాలు ఏమిటో చూద్దామా.

Motorola Razr 60: ఎప్పుడు లాంచ్ అవుతుంది?

మోటోరోలా రేజర్ 60 స్మార్ట్ ఫోన్ మే 28వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు లాంచ్ అవుతుంది. ఈ ఫోన్ కోసం ఫ్లిప్ కార్ట్ అందించిన మైక్రో సైట్ టీజర్ పేజీ నుంచి ఈ ఫోన్ లాంచ్ డేట్ మరియు కీలకమైన ఫీచర్స్ ను మోటోరోలా అందించింది.

Motorola Razr 60: ఫీచర్స్

మోటోరోలా రేజర్ 60 స్మార్ట్ ఫోన్ 100% ట్రూ కలర్ కెమెరాతో వీడియో జెశ్చర్ ఫీచర్ కలిగిన వరల్డ్స్ ఫస్ట్ ఫోన్ అని ఈ ఫోన్ గురించి మోటోరోలా తెలిపింది. ఈ ఫోన్ పర్ల్ అసిటేట్ మరియు ఫ్యాబ్రిక్ డిజైన్ తో వస్తుంది. ఈ ఫోన్ 5 లక్షలకు పైగా ఫ్లిఫ్స్ అందించే పటిష్టమైన టైటానియం రీ ఇన్ ఫోర్స్ హింజ్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ మార్బుల్ ఫినిష్, వేగాన్ లెథర్ మరియు లగ్జరీ ఫ్యాబ్రిక్ ఫినిష్ తో కూడా వస్తుంది.

ఈ అప్ కమింగ్ ఫోన్ మధ్యకు మడత పెట్టే 6.9 ఇంచ్ LTPO స్క్రీన్ కలిగి ఉంటుంది. ఈ స్క్రీన్ 120 Hz రిఫ్రెష్ రేట్ మరియు 3000 నిట్స్ పీక్ బ్రైట్నెస్ కలిగి ఉంటుంది. స్మార్ట్ వాటర్ టచ్ సపోర్ట్ మరియు గొరిల్లా గ్లాస్ విక్టస్ రక్షణ కలిగిన పెద్ద వెలుపలి స్క్రీన్ కూడా ఈ ఫోన్ కలిగి ఉంటుంది. ఈ మోటోరోలా ఈ ఫోన్ ను ఇంప్రూవ్డ్ AI పెర్ఫార్మెన్స్ అందించే మీడియాటెక్ లేటెస్ట్ చిప్ సెట్ Dimensity 7400x తో అందిస్తోంది.

ఈ ఫోన్ లో గొప్ప కెమెరా సెటప్ మరియు ఫీచర్స్ అందించింది. ఈ ఫోన్ లో వెనుక 50MP ప్రైమరీ కెమెరా, 13MP అల్ట్రా వైడ్ అండ్ మైక్రో కెమెరా కలిగిన డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ కలిగి ఉంటుంది. అలాగే, ఈ ఫోన్ లో 32MP సెల్ఫీ కెమెరా కూడా ఉంటుంది. ఈ ఫోన్ కెమెరా moto ai సపోర్ట్ తో వస్తుంది. ఇది ఇమేజ్ స్టూడియో ఫీచర్ కలిగి ఉంటుంది మరియు ఈ ఫీచర్ కలిగిన AI సపోర్ట్ తో ఇమేజ్ ను యూజర్ కోరుకున్న విధంగా మార్చుకునే అవకాశం ఉంటుంది.

Also Read: Tecno POVA CURVE 5G ఇండియా లాంచ్ మరియు ఫీచర్స్ రిలీజ్ చేసిన టెక్నో.!

ఈ ఫోన్ మరిన్ని ఫీచర్లు కూడా ఈ ఫోన్ లాంచ్ కంటే ముందే అందించే అవకాశం ఉంది.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :