Motorola Razr 60 Ultra launched with powerful features
Motorola Razr 60 Ultra: మోటోరోలా మోస్ట్ పవర్ ఫుల్ Flip ఫోన్ ను ఈ రోజు ఇండియన్ మార్కెట్లో విడుదల చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ ను Snapdragon 8 Elite పవర్ ఫుల్ చిప్ సెట్ మరియు moto ai వంటి మరిన్ని ఫీచర్స్ తో అందించింది. ఈరోజే ఇండియాలో సరికొత్తగా విడుదలైన మోటోరోలా ఫ్లిప్ ఫోన్ ధర మరియు ఫీచర్లు తెలుసుకుందామా.
మోటోరోలా ఈ ఫోన్ ను మధ్యకు మడతపెట్టే 6.96 ఇంచ్ ఫోల్డబుల్ AMOLED స్క్రీన్ తో అందించింది. ఈ స్క్రీన్ Dolby Vision మరియు HDR10+ సపోర్ట్ కలిగి ఉంటుంది.ఈ స్క్రీన్ 4500 పీక్ బ్రైట్నెస్, గరిష్టంగా 165Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ మరియు 120% DCI-P3 కలర్ గాముట్ తో వస్తుంది. అలాగే, ఈ ఫోన్ వెలుపల HDR10+ సపోర్ట్ కలిగిన 4 ఇంచ్ AMOLED స్క్రీన్ కూడా ఉంటుంది. ఈ ఫోన్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ సిరామిక్ రక్షణతో ఉంటుంది మరియు మెటల్ ఫ్రెమ్ కలిగి ఉంటుంది.
ఈ ఫోన్ ను Snapdragon 8 Elite చిప్ సెట్ తో అందించింది. ఇది 3nm చిప్ సెట్ మరియు ఇది గరిష్టంగా 4.32GHz క్లాక్ స్పీడ్ తో ఉంటుంది. ఈ ఫోన్ 16GB LPDDR5X ర్యామ్ మరియు 512GB (UFS4.0) ఇంటర్నల్ స్టోరేజ్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ IP48 డస్ట్ మరియు వాటర్ రెసిస్టెంట్ ప్రొటెక్షన్ ఫీచర్ తో కూడా వస్తుంది. మోటోరోలా ఈ ఫ్లిప్ ఫోన్ లో 4700 mAh బిగ్ బ్యాటరీ అందించింది. ఈ స్మార్ట్ ఫోన్ 68W టర్బో ఛార్జ్, 30W వైర్లెస్ ఛార్జ్ మరియు 5W రివర్స్ ఛార్జ్ సపోర్ట్ ను కలిగి ఉంటుంది.
ఇక కెమెరా సెటప్ విషయానికి వస్తే, ఈ ఫోన్ లో వెనుక 50MP మెయిన్ + 50MP అల్ట్రా వైడ్/మ్యాక్రో డ్యూయల్ రియర్ కెమెరా మరియు ముందు 50MP సెల్ఫీ కెమెరా ఉంటుంది. ఈ ఫోన్ 30fps తో 8K వీడియో రికార్డ్ మరియు 60fps/30fps తో 4K UHD వీడియో రికార్డ్ సపోర్ట్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ నైట్ విజన్ తో పాటు చాలా AI కెమెరా ఫీచర్స్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ లో Dolby Atmos సపోర్ట్ కలిగిన డ్యూయల్ స్టీరియో స్పీకర్లు కూడా అందించింది.
Also Read: లేటెస్ట్ 32 ఇంచ్ QLED Smart Tv మంచి డిస్కౌంట్ తో 8 వేల బడ్జెట్ లో లభిస్తోంది.!
మోటోరోలా ఈ ఫోన్ ను కేవలం సింగల్ వేరియంట్ లో రూ. 99,999 ధరతో లాంచ్ చేసింది. అయితే, ఈ ఫోన్ ను రూ. 89,999 ధరకే అందుకునేలా రూ. 10,000 భారీ డిస్కౌంట్ ఆఫర్స్ అందించింది. ప్రధాన బ్యాంక్ కార్డ్స్ తో ఈ ఫోన్ కొనుగోలు చేసే వారికి ఈ డిస్కౌంట్ ఆఫర్ చేస్తుంది. మే 21వ తేదీ నుంచి ఈ ఫోన్ సేల్ కి అందుబాటులోకి వస్తుంది.