రేపు లాంచ్ కాబోయే Motorola Edge 70 Neo కంప్లీట్ ఫీచర్స్ అండ్ ప్రైస్ ఈరోజే తెలుసుకోండి.!

Highlights

Motorola Edge 70 Neo ఇండియన్ మార్కెట్ లో లాంచ్ కోసం సిద్ధం

ఈ ఫోన్ ను సరికొత్త డిజైన్ అండ్ ఫీచర్స్ తో మోటోరోలా లాంచ్ చేస్తోంది

క రోజు ముందే ఈ ఫోన్ కంప్లీట్ ఫీచర్స్ అండ్ ప్రైస్ ఈరోజే తెలుసుకోండి

Motorola Edge 70 Neo ఇండియన్ మార్కెట్ లో లాంచ్ కోసం సిద్ధం అయ్యింది. ఈ ఫోన్ రేపు ఇండియన్ మార్కెట్ లో లాంచ్ అవుతుంది. అయితే, ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ లాంచ్ కంటే ఒక రోజు ముందే ఈ ఫోన్ కంప్లీట్ ఫీచర్స్ అండ్ ప్రైస్ ఈరోజే తెలుసుకోండి. ఈ ఫోన్ ను సరికొత్త డిజైన్ అండ్ ఫీచర్స్ తో మోటోరోలా లాంచ్ చేస్తోంది. ఇది సోషల్ మీడియా రెడీ ఫోన్ గా మార్కెట్ లో వస్తుందని మోటోరోలా ఈ ఫోన్ గురించి తెలిపింది.

Motorola Edge 70 Neo : లాంచ్

ఈ ఫోన్ రేపు అనగా నవంబర్ 23వ తేదీ మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఇండియన్ మార్కెట్ లో లాంచ్ అవుతుంది. ఈ ఫోన్ ఫ్లిప్ కార్ట్ ద్వారా టీజింగ్ చేయబడుతోంది మరియు ఈ ఫోన్ లాంచ్ తర్వాత ఫ్లిప్ కార్ట్ ద్వారా సేల్ కి అందుబాటులోకి వస్తుంది.

Motorola Edge 70 Neo

అంచనా ప్రైస్

మోటోరోలా ఈ ఫోన్ ను రూ. 30,000 రూపాయల నుంచి రూ. 35,000 రూపాయల ప్రైస్ సెగ్మెంట్ లో లాంచ్ చేసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఈ ప్రైస్ ను కొత్త లీక్స్ మరియు మార్కెట్ వర్గాల అంచనాల ద్వారా తీసుకున్నట్లు తెలుస్తోంది.

Motorola Edge 70 Neo : ఫీచర్స్

మోటోరోలా ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ టీజర్ ద్వారా ఈ ఫోన్ కంప్లీట్ ఫీచర్స్ ని వెల్లడించింది. ఈ ఫోన్ చాలా స్లీక్ అండ్ కర్వ్డ్ డిజైన్ తో ఉంటుంది. ఇందులో 5,200 నిట్స్ పీక్ బ్రైట్‌ నెస్‌ కలిగిన 6.8 అంగుళాల 1.5K Extreme AMOLED స్క్రీన్ కలిగి ఉంటుంది. ఇది 1.5K రిజల్యూషన్ మరియు 144Hz రిఫ్రెష్ రేట్ తో పాటు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7i రక్షణ కూడా కలిగి ఉంటుంది.

ఈ మోటోరోలా స్మార్ట్ ఫోన్ క్వాల్కమ్ Snapdragon 7s Gen 3 ప్రాసెసర్‌ తో పని చేస్తుంది మరియు 8GB LPDDR5X ర్యామ్ తో పాటు AI RAM Boost టెక్నాలజీ సపోర్ట్ కూడా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ ను 45W Turbo Power ఫాస్ట్ ఛార్జ్ మరియు 7.5W రివర్స్ ఛార్జ్ సపోర్ట్ కలిగిన 7,000mAh బిగ్ బ్యాటరీతో లాంచ్ చేస్తున్నట్లు కంపెనీ కన్ఫర్మ్ చేసింది. ఈ ఫోన్ బిగ్ బ్యాటరీ కలిగి ఉన్నా కూడా చాలా స్లీక్ గా ఉంటుంది.

ఈ ఫోన్ కెమెరా విషయానికి వస్తే, ఈ ఫోన్ లో 10X Super Zoom మరియు 4K వీడియో సపోర్ట్ కలిగిన ట్రిపుల్ రియర్ కెమెరా ఉంటుంది. ఇందులో OIS సపోర్ట్ కలిగిన 50MP Sony LYTIA 710 ప్రధాన కెమెరా ఉంటుంది. ఈ ఫోన్ లో Ultra HDR సపోర్ట్‌, నైట్ విజన్ మరియు AI ఇమేజ్ ఎన్‌హాన్స్‌మెంట్ వంటి మరెన్నో కెమెరా ఫీచర్స్ కూడా ఉంటాయి. ఈ ఫోన్ MIL-STD-810H సర్టిఫికేషన్ డిజైన్ తో ఉంటుంది. అలాగే, IP64 రేటింగ్ తో డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్ ఫీచర్ కూడా ఆకలిగా ఉంటుంది.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

View full profile