Motorola Edge 70 Max Sale: బిగ్ డీల్స్ అండ్ ఆఫర్స్ తో మోటో కొత్త ఫోన్ ఫస్ట్ సేల్.!

HIGHLIGHTS

మోటోరోలా ఎడ్జ్ 70 మ్యాక్స్ ఫస్ట్ సేల్ ఈరోజు నుంచి ప్రారంభం అవుతుంది

ఇది మోటోరోలా లేటెస్ట్ గా విడుదల చేసిన లేటెస్ట్ ప్రీమియం స్మార్ట్ ఫోన్

ఈ ఫోన్ ఫస్ట్ సేల్ నుంచి మోటోరోలా బిగ్ డీల్స్ అందించింది

Motorola Edge 70 Max Sale: మోటోరోలా లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ మోటోరోలా ఎడ్జ్ 70 మ్యాక్స్ ఫస్ట్ సేల్ ఈరోజు 12PM నుంచి ప్రారంభం అవుతుంది. ఇది మోటోరోలా లేటెస్ట్ గా విడుదల చేసిన లేటెస్ట్ ప్రీమియం స్మార్ట్ ఫోన్ మరియు ఈ ఫోన్ ఫస్ట్ సేల్ నుంచి భారీ డీల్స్ కూడా అందించింది. ఈ ఫోన్ ఫస్ట్ సేల్ నుంచి మోటోరోలా ఆఫర్ చేస్తున్న బిగ్ డీల్స్ అండ్ ఆఫర్స్ తో పాటు కొత్త ఫోన్ కంప్లీట్ ఫీచర్స్ కూడా తెలుసుకోండి.

Motorola Edge 70 Max Sale: సేల్ ఆఫర్లు

ఈ ఫోన్ పై మోటోరోలా భారీ ఆఫర్లు అందించింది. ఈ ఫోన్ ను Axis మరియు HDFC బ్యాంక్ క్రెడిట్ ఆప్షన్ తో తీసుకునే వారికి రూ. 5,000 బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ అందించింది. అలాగే, ఈ ఫోన్ ను ఎక్స్ చేంజ్ ఆఫర్ తో కొనే వారి కోసం రూ. 5,000 రూపాయల భారీ ఎక్స్ చేంజ్ బోనస్ ఆఫర్ ను అందించింది. ఈ ఆఫర్స్ తో ఈ స్మార్ట్ ఫోన్ బేసిక్ వేరియంట్ రూ. 49,999 రూపాయల ఆఫర్ ధరలో లభిస్తుంది.

ఈ ఫోన్ బేసిక్ (8GB + 128GB) వేరియంట్ అసలు ధర రూ. 54,999 రూపాయలు మరియు ఆఫర్ తో పెయిన్ తెలిపిన ధరలో లభిస్తుంది. ఈ ఫోన్ రెండవ వేరియంట్ (12GB + 256GB) అసలు ధర రూ. 59,999 మరియు ఆఫర్స్ తో ఈ ఫోన్ రూ. 54,999 ధరలో లభిస్తుంది.

Also Read: Google Pixel 11 Pro మోడల్ డిజైన్ మరియు పిక్సెల్ 11 సిరీస్ Pre-Order డేట్ కూడా అనౌన్స్ చేసింది.!

Motorola Edge 70 Max : ఫీచర్స్

ఈ స్మార్ట్ ఫోన్ 6.82 ఇంచ్ LTPO AMOLED స్క్రీన్ కలిగి ఉంటుంది. ఇది QHD+ రిజల్యూషన్ 144Hz రిఫ్రెష్ రేట్, HDR10+ సపోర్ట్ మరియు 7000 నిట్స్ పీక్ బ్రైట్నెస్ వంటి ప్రీమియం ఫీచర్స్ తో వస్తుంది. ఈ ఫోన్ డిజైన్ పరంగా చూస్తే, మోటోరోలా ఈ ఫోన్ ను అల్యూమినియం ఫ్రేమ్ తో గాస్ల్ డిజైన్ లో ప్రీమియం లుక్స్ తో అందించింది.

ఈ ఫోన్ ను క్వాల్కమ్ యొక్క లేటెస్ట్ Snapdragon 8 Gen 5 చిప్ సెట్ తో లాంచ్ చేసింది. ఇది 3nm ఫ్యాబ్రికేషన్ చిప్ సెట్ మరియు గరిష్టంగా దీనికి జతగా 12GB LPDDR5X ర్యామ్ మరియు UFS 4.1 256GB స్టోరేజ్ కూడా ఉంటాయి. మోటోరోలా ఈ ఫోన్ ను Hello UI తో Android 16 OS పై అందించింది.

ఈ ఫోన్ 50MP Sony LYT OIS మెయిన్ సెన్సార్, 8MP అల్ట్రా వైడ్ సెన్సార్ తో రియర్ కెమెరా మరియు 32MP సెల్ఫీ కెమెరాతో వచ్చింది. ఈ ఫోన్ కెమెరా 30FPS / 60FPS తో 4K HDR 10+ వీడియో సపోర్ట్ చేస్తుంది. అలాగే, లేటెస్ట్ Ai కెమెరా ఫీచర్స్ తో పాటు ప్రత్యేకమైన మోటోరోలా కెమెరా ఫీచర్స్ తో కూడా వస్తుంది. ఇందులో 7100 mAh భారీ బ్యాటరీ, 90W టర్బో వైర్డ్ ఛార్జ్ మరియు 25W మాగ్నెటిక్ వైర్లెస్ ఛార్జ్ సపోర్ట్ ఉంది.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :