Motorola Edge 70 Fusion launched in India know price and features
Motorola Edge 70 Fusion: మోటోరోలా ఈరోజు ఎడ్జ్ 70 సిరీస్ నుంచి ఎడ్జ్ 70 ఫ్యూజన్ స్మార్ట్ ఫోన్ ను విడుదల చేసింది. ఈ ఫోన్ మిడ్ రేంజ్ సెగ్మెంట్ ప్రీమియం ఫోన్ గా వచ్చింది. అంటే, ఈ ఫోన్ మిడ్ రేంజ్ ప్రైస్ సెగ్మెంట్ లో ప్రీమియం స్మార్ట్ ఫోన్ కలిగి ఉండే ఫీచర్స్ తో లాంచ్ అయ్యింది. ఇది 7000mAh భారీ బ్యాటరీ, ఏడీబీ అద్భుతమైన డిజైన్ మరియు Snapdragon 7s Gen 4 ప్రాసెసర్ వంటి ఫీచర్లతో ఈ ఫోన్ గొప్ప సెటప్ కలిగి ఉంటుంది.
మోటోరోలా ఎడ్జ్ 70 ఫ్యూజన్ స్మార్ట్ ఫోన్ రెగ్యులర్ అండ్ హెవీ ర్యం వేరియంట్స్ లో లాంచ్ అయ్యింది. ఈ ఫోన్ వేరియంట్స్ అండ్ ప్రైస్ లిస్ట్ ఇక్కడ చూడవచ్చు.
మోటోరోలా ఎడ్జ్ 70 ఫ్యూజన్ (8GB + 128GB) ప్రైస్ : రూ. 26,999
మోటోరోలా ఎడ్జ్ 70 ఫ్యూజన్ (8GB + 256GB) ప్రైస్ : రూ. 29,999
మోటోరోలా ఎడ్జ్ 70 ఫ్యూజన్ (12GB + 256GB) ప్రైస్ : రూ. 32,999
ఈ స్మార్ట్ ఫోన్ ప్యాంటోన్ బ్లూ సర్ఫ్, ప్యాంటోన్ కంట్రీ ఎయిర్ మరియు ప్యాంటోన్ సిల్ హౌతీ మూడు రంగుల్లో లభిస్తుంది.
మోటోరోలా ఎడ్జ్ 70 ఫ్యూజన్ మంచి లాంచ్ డిస్కౌంట్ ఆఫర్స్ కూడా అనౌన్స్ చేసింది. ఈ ఫోన్ పై రూ. 2,000 రూపాయల అదనపు బ్యాంక్ డిస్కౌంట్ మరియు రూ. 2,000 రూపాయల ఎక్స్ చేంజ్ బోనస్ ఆఫర్ అందించింది. మార్చి 12వ తేదీ నుంచి ఈ ఫోన్ సేల్ స్టార్ట్ అవుతుంది మరియు ఈ ఫోన్ ఫ్లిప్ కార్ట్ మరియు మోటోరోలా ఆన్లైన్ స్టోర్ నుంచి సేల్ కి అందుబాటులోకి వస్తుంది.
Also Read: Amazon EPL Sale నుంచి Samsung Smart Tv నమ్మశక్యం కానంత చవక ధరకు లభిస్తోంది.!
ఈ మోటోరోలా స్మార్ట్ ఫోన్ 6.78 ఇంచ్ క్వాడ్ కర్వుడ్ AMOLED స్క్రీన్ తో వస్తుంది. ఈ స్క్రీన్ 144Hz రిఫ్రెష్ రేట్, HDR10+ సపోర్ట్, 1.5K రిజల్యూషన్ మరియు 5200 నిట్స్ పీక్ బ్రైట్నెస్ కలిగి ఉంటుంది. ఈ మొత్తం స్క్రీన్ ను గొరిల్లా గ్లాస్ 7i టఫ్ గ్లాస్ ప్రొటక్షన్ తో అందించింది. ఈ ఫోన్ క్వాల్కమ్ Snapdragon 7s Gen 4 ప్రోసెసర్ జతగా 12 జీబీ మరియు 256 జీబీ స్టోరేజ్ కలిగి ఉంటుంది.
ఈ ఫోన్ 50MP (Sony LYTIA 710) మెయిన్ కెమెరా, 13MP అల్ట్రా వైడ్ కెమెరా మరియు మాక్రో సెన్సార్ కలిగిన ట్రిపుల్ రియర్ కెమెరా వుంది. ఈ ఫోన్ లో 32MP సెల్ఫీ కెమెరా తో లాంచ్ అయ్యింది.