MOTOROLA Edge 70 ఫస్ట్ సేల్ కంటే ముందు మీరు తెలుసుకోవాల్సిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్.!
MOTOROLA Edge 70 ఫస్ట్ సేల్ కంటే ముందు మీరు తెలుసుకోవాల్సిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్
ఈ ఫోన్ రేపు మధ్యాహ్నం 12 గంటల నుంచి సేల్ కి అందుబాటులోకి వస్తుంది
ఈ ఫోన్ కొనడానికి ముందుగా ఈ ఫోన్ గురించి మీరు తెలుసుకోవాల్సిన ఫీచర్స్
MOTOROLA Edge 70 ఫస్ట్ సేల్ కంటే ముందు మీరు తెలుసుకోవాల్సిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్, ఈరోజు ప్రత్యేకంగా అందిస్తున్నాము. ఈ ఫోన్ రేపు మధ్యాహ్నం 12 గంటల నుంచి సేల్ కి అందుబాటులోకి వస్తుంది. అందుకే, ఈ ఫోన్ కొనడానికి ముందుగా ఈ ఫోన్ గురించి మీరు తెలుసుకోవాల్సిన ఫీచర్స్, ప్రైస్ మరియు ఆఫర్ వంటి పూర్తి సమాచారం ఈరోజు సవివరంగా అందించాము.
SurveyMOTOROLA Edge 70 : వేరియంట్ అండ్ ప్రైస్
మోటోరోలా ఎడ్జ్ 70 స్మార్ట్ ఫోన్ ను కేవలం 8GB + 256GB సింగల్ వేరియంట్ తో లాంచ్ చేసింది. ఈ ఫోన్ ను రూ. 29,999 ప్రైస్ ట్యాగ్ తో అందించింది. ఈ మోటోరోలా స్మార్ట్ ఫోన్ పాంటోన్ బ్రోన్జ్ గ్రీన్, పాంటోన్ గ్యాడ్జెట్ గ్రే మరియు పాంటోన్ లిలీ ప్యాడ్ మూడు రంగుల్లో లభిస్తుంది. ఈ ఫోన్ ఫ్లిప్ కార్ట్, మోటోరోలా అఫీషియల్ సైట్ మరియు రిటైల్ స్టోర్ నుంచి కూడా సేల్ అవుతుంది. ఈ ఫోన్ అపి కంపెనీ అందించిన ఆఫర్స్ విషయానికి వస్తే, ఈ ఫోన్ పై రూ. 1,000 రూపాయల బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ అందించింది. ఈ ఆఫర్ తో ఈ ఫోన్ రూ. 28,999 రూపాయల ఆఫర్ ధరలో లభిస్తుంది.
Also Read: Jio Happy New Year Plan: ప్లాన్ ఒక్కటే కానీ ఎన్నో లాభాలు అందిస్తుంది.!
MOTOROLA Edge 70 : ఫీచర్స్
ఈ మోటోరోలా స్మార్ట్ ఫోన్ ఏరో స్పేస్ గ్రేడ్ అల్యూమినియం ఫ్రేమ్ తో చాలా సన్నని డిజైన్ తో లాంచ్ అయ్యింది మరియు ఇది సరికొత్త డిజైన్ తో ఉంటుంది. ఈ ఫోన్ కేవలం 5.7mm స్లీక్ డిజైన్ తో మాత్రమే ఉంటుంది. ఇది సాధారణ (7.9mm) ఫోన్స్ తో పోలిస్తే మరింత సన్నగా ఉంటుంది. ఇందులో 6.7 ఇంచ్ బిగ్ AMOLED స్క్రీన్ ను 4500 నిట్స్ పీక్ బ్రైట్నెస్, 1.5K రిజల్యూషన్ మరియు 144Hz రిఫ్రెష్ రేట్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ Snapdragon 7 Gen 4 తో నడుస్తుంది మరియు జతగా 12 జీబీ ర్యామ్ తో పాటు 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ కలిగి ఉంటుంది.

ఈ స్మార్ట్ ఫోన్ లో వెనుక 50MP + 50MP జతగా మరో కెమెరా కలిగిన ట్రిపుల్ రియర్ కెమెరా ఉంటుంది మరియు ముందు 50MP సెల్ఫీ కెమెరా కూడా ఉంటుంది. ఈ ఫోన్ 4K UHD (60fps/30fps) వీడియో సపోర్ట్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ లో మోటో ఎఐ మరియు మరిన్ని Ai కెమెరా ఫీచర్స్ కూడా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ లో 5000 mAh బిగ్ బ్యాటరీ, 68W ఫాస్ట్ వైర్డ్ టర్బో ఛార్జ్ మరియు 15W వైర్లెస్ ఛార్జ్ సపోర్ట్ కూడా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ మోటోరోలా లేటెస్ట్ Hello UI సాఫ్ట్ వేర్ ఆండ్రాయిడ్ OS పై నడుస్తుంది. ఈ ఫోన్ IP69 + IP68 రేటింగ్ తో మంచి డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెంట్ ఫోన్ గా ఉంటుంది.